వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2021 మే, జూన్‌ నెలల్లో ప్రధాన మంత్రి గరిబ్ కల్యాణ్ అన్న యోజన ఆధ్వర్యంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులకు అదనంగా ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేయబడతాయి.


దాదాపు 80 కోట్ల మంది లబ్ధిదారులకు నెలకు 5 కిలోల చొప్పున ఉచితంగా అందిస్తారు. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) పరిధిలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ ఆహార ధాన్యాలపైన వచ్చే రెండు నెలలు అంటే మే మరియు జూన్ 2021 అమలులో ఉంటుంది.

Posted On: 23 APR 2021 4:02PM by PIB Hyderabad

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పేదల పట్ల ఉన్న నిబద్ధతకు అనుగుణంగా జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) పరిధిలో ఉన్న దాదాపు 80 కోట్ల మంది లబ్ధిదారులకు నెలకు 5 కిలోల చొప్పు ఉచిత ఆహార ధాన్యాలు కేటాయించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మునుపటి "ప్రధాన మంత్రి గరిబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎం-జికెఎవై) మాదిరిగానే వచ్చే రెండు నెలలు అంటే మే మరియు జూన్ 2021 వరకు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ఆహార ధాన్యాలు పైన ఇది అమలవుతుంది.

ఈ ప్రత్యేక పథకం (పిఎమ్‌జికెఎ) కింద ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ యొక్క రెండు వర్గాల పరిధిలో ఉన్న 80 కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్ధిదారులకు, అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) మరియు ప్రయారిటీ హౌస్‌హోల్డర్స్ (పిహెచ్‌హెచ్), అదనపు కోటా ఉచిత ఆహార ధాన్యాలు (బియ్యం/గోధుమ)తో అందించబడతాయి. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద వారి సాధారణ నెలవారీ అర్హతలకు అదనంగా నెలకు 5 కిలోల చొప్పున అందిస్తారు.

రాష్ట్రాలు/యుటిలకు కేంద్ర సహాయంలో భాగంగా ఆహార ధాన్యాలు, అంతర్రాష్ట్ర రవాణా మొదలైన వాటిపై  భారత ప్రభుత్వం రూ .26 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది.

 

***


(Release ID: 1713617) Visitor Counter : 268