ప్రధాన మంత్రి కార్యాలయం

జలవాయు శిఖర సమ్మేళనం 2021 లో ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 22 APR 2021 7:07PM by PIB Hyderabad

మాననీయులైన అధ్యక్షులు శ్రీ బైడెన్,

విశిష్ట సహచరులు,

ప్రపంచం లోని నా సహచరులారా,

నమస్కారం.

ఈ చొరవ ను తీసుకొన్నందుకు గాను అధ్యక్షులు శ్రీ బైడెన్ కు నా ధన్యవాదాలు వ్యక్తం చేయదలచుకొంటున్నాను.  వర్తమానం లో యావత్తు మానవాళి ఒక ప్రపంచ మహమ్మారి తో సతమతం అవుతోంది.  మరి ఈ సమయంలో ఈ కార్యక్రమం మనకు జలవాయు పరివర్తన తాలూకు గంభీరమైన సవాళల్లు అప్పుడే ముగిసిపోలేదు అనే విషయాన్ని గుర్తు కు తీసుకు వస్తున్నది.

వాస్తవం లో, ప్రపంచ వ్యాప్తం గా లక్షల కొద్దీ వ్యక్తులు జలవాయు పరివర్తన తో ప్రభావితం అవుతున్నారు. వారి జీవనం, బ్రతుకుదెరువు ఇదివరకటి నుంచే దీని ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటూ వస్తున్నాయి.

మిత్రులారా,

మానవాళి కి జలవాయు పరివర్తన ను ఎదుర్కొనేందుకు బలమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.  అటువంటి చర్యలను మనం వేగం గాను, పెద్ద ఎత్తున, ప్రపంచ స్థాయి లో తీసుకోవలసివుంది.  భారతదేశం లో, మేము వేగంగా ఈ దిశ లో  కృషి చేస్తున్నాం.  2030 కల్లా 450 గీగా వాట్ నవీకరణ యోగ్య శక్తి ని సాధించాలన్న మహత్వాకాంక్ష తో కూడిన లక్ష్యం మా వచనబద్ధత ను చాటి చెప్తున్నది.

ప్రగతి తో ముడిపడ్డ సవాళ్లు ఉన్నప్పటికీ, మేము స్వచ్ఛ శక్తి, శక్తి సామర్థ్యం, అటవీకరణ, జీవ వైవిధ్యం లకు సంబంధించిన అనేక సాహసిక చర్యల ను చేపట్టాం.  ఈ కారణం గానే మేము జాతీయ స్థాయి లో నిర్దేశిత లక్ష్యం (ఎన్ డిసి) 2- డిగ్రీ సెల్సియస్ కు అనుగుణం గా ఉన్న కొన్ని దేశాల లో మేము జతపడ్డాము.

మేము అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ), లీడ్ఐటీ, కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్  (సీడీఆర్ఐ) వంటి ప్రపంచ కార్యక్రమాలకు కూడా  ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది.

మిత్రులారా,

జలవాయు పట్ల ప్రతి ఒక్క బాధ్యత గల వికాసశీల దేశం గా భార‌తదేశం నిలకడతనంతో కూడిన అభివృద్ధి సంబంధిత నమూనా లను తయారు చేయడం కోసం భాగస్వాములను ఆహ్వానిస్తున్నది.  గ్రీన్ ఫైనాన్స్, స్వచ్ఛ సాంకేతిక ప‌రిజ్ఞానాలు  తక్కువ ఖర్చు తో అందుబాటులో ఉండడం అవశ్యమైనటువంటి ఇతర వికాసశీల దేశాలకు కూడా ఈ నమూనా లు తోడ్పడగలుగుతాయి.

అందుకే అధ్యక్షులు శ్రీ బైడెన్, నేను కలసి ‘‘భారతదేశం-అమెరికా జలవాయు- స్వచ్ఛ శక్తి ఎజెండా 2030 భాగస్వామ్యం’’ ను ఆరంభించనున్నాం.  మనం కలిసికట్టుగా పెట్టుబడుల ను సమీకరించే, స్వచ్ఛ శక్తి సంబంధి సాంకేతిక పరిజ్ఞానాల ను ఆవిష్కరించే, హరిత భాగస్వామ్యాన్ని సమర్థంగా బలచగలం.

మిత్రులారా,

ఇవాళ, ఎప్పుడయితే మనం ప్రపంచ జలవాయు కార్యాచరణ పై చర్చ ను జరుపుతున్నామో, నేను మీతో కలసి ఒక ఆలోచన ను పంచుకోవాలని భావిస్తున్నాను.  భారతదేశం లో తలసరి కర్బన ఉద్గార పరిమాణం అంతర్జాతీయ సగటు కన్నా 60 శాతం తక్కువ గా ఉంది.  మా జీవనశైలి ఇప్పటికీ సాంప్రదాయక పద్ధతుల పై ఆధారపడినది కావడమే దీనికి కారణం.

అందుకని ఇవాళ, నేను జలవాయు పరివర్తన కు సంబంధించిన చర్యల ను తీసుకోవడం లో జీవన శైలి లో మార్పు తాలూకు ప్రాముఖ్యాన్ని గురించి నొక్కి చెప్పదలచుకొంటున్నాను.  సతత జీవన శైలి, ‘ప్రాథమిక సూత్రాల వైపునకు తిరిగి మళ్లడం’ అనేవి కోవిడ్ అనంతర సమయం లో మన ఆర్థిక వ్యూహాల కు సంబంధించి ఒక మహత్వపూర్ణ స్తంభం గా ఉండాలి.

మిత్రులారా,

మహనీయుడైన భారతీయ సాధువు స్వామి వివేకానందుల వారి మాటలను నేను గుర్తుకు తీసుకురాదలుస్తున్నాను.  ఆయన మనతో అన్నారు కదా:
‘‘లేవండి.. మేలుకోండి.. లక్ష్యాన్ని సాధించే వరకు ఆగనే ఆగకండి.’’ రండి కలసి ఈ దశాబ్దం లో జలవాయు పరివర్తన పై గట్టి చర్యలు తీసుకొందాం.

ధన్యవాదాలు. మీకు అనేకానేక ధన్యవాదాలు.

 


 

***(Release ID: 1713522) Visitor Counter : 11