ఆర్థిక మంత్రిత్వ శాఖ
పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతు కు హామీ ఇచ్చిన కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్.
పరిస్థితిని అంచనా వేసేందుకు పరిశ్రమ వర్గాలు వేచి చూడాలన్న మంత్రి
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో , సానుకూల మార్పు రాగలదని ఆశిస్తున్నాం: ఆర్థిక మంత్రి
Posted On:
21 APR 2021 7:59PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు రాగల కొద్ది రోజులు పరిస్థితులను అంచనా వేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆర్ధికమంత్రి హామీ ఇచ్చారు.
ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యుటివ్ కమిటీ సభ్యులను ఉద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడుతూ శ్రీమతి సీతారామన్, ప్రధానమంత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం, నూతన వాక్సినేషన్ మార్గదర్శకాలు, కోవిడ్ -19 కేసులను చికిత్స అందించడంలో ఐదురకాల వ్యూహం, అంటే పరీక్షలు నిర్వహించడం, కేసులను గుర్తించడం, చికిత్స అందించడం, కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించడం, వాక్సినేషన్ వంటి వాటితో ఒక రకమైన భరోసా ఉండనున్నదని ఆమె అన్నారు.
ఈ చర్యలన్నింటితో, కోవిడ్ -19 సెకండ్ వేవ్ మహమ్మారి పరిస్థితుల లో సానుకూల మార్పు ఉండగలదని ఆశిద్దాం. పరిశ్రమ వర్గాలు జాగ్రత్తగా గమనించాలి.. మిరు కూడా( పరిశ్రమ వర్గాలను) జరుగుతున్న పరిణామాలను సునిశితంగా గమనించమని నేను కోరుతున్నాను. కోవిడ్ మహమ్మారి పై పరిశ్రమతో కలసి సంఘటితంగా పోరాటం చేస్తున్నాం. ప్రగతి వేగాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనం గట్టి కృషి చేయగలమన్నది అవగాహన చేసుకోవాలి. గత త్రైమాసికానికి, ఈ త్రైమాసికానికి తేడాను గమనించాలన్న ఆతృత మన అందరిలో ఉంది, అని శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు.
“ రాగల కొద్ది రోజులు పరిస్థితులను మరింత జాగ్రత్తగా గమనించాల్సిందిగా పరిశ్రమ వర్గాలను నేను కోరుతున్నాను. ఆ తర్వాత మీరు ఈ త్రైమాసికం ఎలా ఉండబోతుందో అంచనా వేయండి” అని ఆమె అన్నారు.
ఆతిథ్యరంగం, విమానయానరంగం, రవాణా,పర్యాటకం , హోటళ్లు కోవిడ్ -19 ప్రారంభం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.“ మేం అత్యవసర క్రెడిట్‌లైన్ గ్యారంటీ పథకాన్ని (ఇసిజిఎల్ఎస్ 2.0)ను ఈ రంగాలకు వర్తింపచేశాం. గత సంవత్సరం ఇవి చూపిన సమర్ధత పర్యాటక, విమానయాన రంగాలు కూడా చూపగలవని నేను భావిస్తున్నానను” అని ఆర్ధిక మంత్రి అన్నారు.
ఆక్సిజన్ సరఫరా గురించి మాట్లాడుతూ శ్రీమతి నిర్మలా సీతారామన్, ఆక్సిజన్ సరఫరాలకు సంబంధించి జాగ్రత్తగా ఏర్పాట్లు జరిగాయని, బాగా అవసరం ఉన్న 12 రాష్ట్రాల కోసం (ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఎంపి, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా,కర్ణాటక, తమిళనాడు, కేరళ) కొత్త అనుమతులు కూడా ఇచ్చినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ సరఫరాలను జిల్లా స్థాయిలో పర్యవేక్షించడంతోపాటు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి రాగల 15 రోజులకాలానికి పరిస్థితులను క్షుణ్ణంగా గమనించడం జరుగుతున్నదని చెప్పారు. “ ఆక్సిజన్ ట్యాంకర్ల అంతర్ రాష్ట్ర రవాణాకు ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. రిజిస్ట్రేషన్, పర్మిట్‌లకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. నిరంతరాయంగా రోజంతా కార్యకలాపాలు నిర్వహించవచ్చు. లోటు లేకుండా చూసేందుకు సిలిండర్‌లు నింపే ప్లాంట్లు తగిన రక్షణలు తీసుకుంటూ 24 గంటలూ పనిచేస్తున్నాయి.” అని ఆర్థికమంత్రి తెలిపారు
ఫార్మారంగ సామర్ధ్యం పెంపు గురించి వివరిస్తూ , శ్రీమతి నిర్మలా సీతారామన్, కీలకమైన ఔషదాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రెమిడిసివర్ ఉత్పత్తికి ఫాస్ట్‌ట్రాక్ అనుమతులు ఇచ్చినట్టు ఆమె తెలిపారు. రాగల కొద్ది నెలల్లో వీటిని నెలకు లక్ష వయల్స్ తయారీ సామర్థ్యానికి పెరుగుతుందన్నారు.
వైద్యరంగానికి అవసరమైన ఆక్సిజన్ డిమాండ్‌ను తీర్చిన తర్వాత పరిశ్రమకు కూడా అవసరమైన ఆక్సిజన్ సరఫరా జరుగుతుందని, మెడికల్ ఆక్సిజన్ దిగుమతలుకు అనుమతి ఇచ్చినట్టు ఆమె తెలిపారు.
ఫిక్కీ అధ్యక్షుడు శ్రీ ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ, అత్యవసర, అత్యవసరం కాని సరకులకు సంబంధించి కొంత స్పష్టత అవసరమని చెప్పారు.ఎం.ఎస్.ఎం.ఇ రంగానికి మద్దతు అవసరమని, ప్రస్తుతం ఈ రంగం ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని చెప్పారు.
ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ మెహతా వందన సమర్పణ చేస్తూ, ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రజల జీవనోపాథి కాపాడడానికి ప్రభుత్వం చేసే కృషికి పరిశ్రమ పూర్తిగా మద్దతు నిస్తుందని పునరుద్ఘాటించారు.
***
(Release ID: 1713331)
Visitor Counter : 231