కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆస్ట్రేలియా & న్యూజిలాండ్ మధ్య అవగాహన ఒప్పందాన్ని ఆమోదించిన - కేంద్ర మంత్రి మండలి
Posted On:
20 APR 2021 3:50PM by PIB Hyderabad
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఏ.ఐ) మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆస్ట్రేలియా & న్యూజిలాండ్ (సి.ఏ.ఏ.ఎన్.జెడ్) మధ్య ఒక తాజా అవగాహనా ఒప్పందాన్ని (ఎమ్.ఓ.యు.ని), ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదించింది.
ప్రభావం :
సభ్యులు, విద్యార్థులు, వారి సంస్థల యొక్క ఉత్తమ ప్రయోజనార్థం పరస్పర ప్రయోజనకరమైన సంబంధాన్ని అభివృద్ధి చేయాలన్నది ఈ ఎమ్.ఆర్.ఏ. ఉద్దేశ్యం. రెండు అకౌంటింగ్ సంస్థల మధ్య పని సంబంధాలను పెంపొందించడం తో పాటు, ఐ.సి.ఏ.ఐ. సభ్యులకు వారి వృత్తిపరమైన పరిధులను విస్తరించడానికి ఇది అవకాశం కల్పిస్తుందని కూడా భావిస్తున్నారు. ప్రపంచీకరణ వాతావరణంలో, ఈ వృత్తి ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లను పరిష్కరించడంలో నాయకత్వ పాత్ర పోషించడానికి, ఈ రెండు అకౌంటెన్సీ సంస్థల కు ఈ ఒప్పందం ద్వారా ఒక అవకాశం కలుగుతుంది.
ప్రయోజనాలు :
రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ద్వారా భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్ లకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, భారతదేశానికి తిరిగి భారీగా పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు.
వివరాలు :
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఏ.ఐ) మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆస్ట్రేలియా & న్యూజిలాండ్ (సి.ఏ.ఏ.ఎన్..జెడ్) ల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం (ఎమ్.ఓ.యు), రెండు సంస్థల మధ్య సంబంధాలను పెంపొందించే యంత్రాంగాన్ని సూచించడం ద్వారా సభ్యుల అర్హతలను గుర్తించి, వారు మంచి స్థితిలో ఉండేలా చేస్తుంది. అకౌంటింగ్ పరిజ్ఞానం, వృత్తిపరమైన మరియు మేధో పరమైన వికాసంతో పాటు తమ తమ సభ్యుల ప్రయోజనాల పురోగతి కోసం పరస్పర సహకార విధానాన్ని రూపొందించుకోవాలని ఐ.సి.ఏ.ఐ. మరియు సి.ఏ.ఏ. ఎన్.జెడ్. సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అదేవిధంగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు భారతదేశంలో అకౌంటింగ్ వృత్తి అభివృద్ధి కి కూడా, ఈ ఒప్పందం, సానుకూలంగా తోడ్పాటు నందిస్తుంది.
అమలు వ్యూహం మరియు లక్ష్యాలు :
రెండు సంస్థల పరీక్ష, వృత్తి పరమైన కార్యక్రమాలు, ప్రాక్టికల్ అనుభవం వంటి సభ్యత్వ అవసరాలను పూర్తి చేయడం ద్వారా సభ్యత్వం పొందిన, తమ సంస్థ సభ్యుల అర్హతలకు పరస్పరం గుర్తింపు ఇచ్చుకునే విధంగా ఈ అవగాహన ఒప్పందం అవకాశం కల్పిస్తుంది.
నేపధ్యం :
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఎ.ఐ) అనేది - భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తిని నియంత్రించడానికి, భారత పార్లమెంట్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం, 1949 ద్వారా, స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ. కాగా, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆస్ట్రేలియా & న్యూజిలాండ్ (సి.ఏ.ఏ.ఎన్.జెడ్) అనేది - ఆస్ట్రేలియాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ మరియు న్యూజిలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అనే సంస్థలు రెండూ, 2014 అక్టోబర్ లో విలీనం కావడం ద్వారా ఉద్భవించిన సంస్థ.
*****
(Release ID: 1713073)
Visitor Counter : 149