ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 ని ఎదుర్కోవడానికి సార్వజనిక ఆరోగ్య సంబంధి సన్నామాల పై దేశం లోని  ప్ర‌ముఖ వైద్యుల‌ తో స‌మీక్ష ను నిర్వ‌హించిన ప్ర‌ధాన‌ మంత్రి


కోవిడ్-19 కి వ్యతిరరేకంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశం జ‌రిపిన పోరాటం లో ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన వృత్తినిపుణులు అందరికీ ధన్యవాదాలు తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి

వైద్యులు స‌మాజం లో ప‌రివ‌ర్త‌నాత్మ‌క పాత్ర ను పోషించాలని, సమాజం పై వారు ప్రభావాన్ని చూపాలంటూ నొక్కి చెప్పిన ప్ర‌ధాన‌ మంత్రి

కోవిడ్ ను నియంత్రించ‌డం లో అనుభ‌వం ఉన్న న‌గ‌రాల‌ లోని వైద్యులు త‌గిన సహకారం, శిక్ష‌ణ‌, ఆన్‌ లైన్ సంప్ర‌దింపు ల ద్వారా కోవిడ్ ప్రొటోకాల్స్ ను పాటించేలా చేయాల‌ని, ఈ స‌దుపాయాలు అందుబాటు లో లేనటువంటి ప్రాంతాల‌కు సేవ‌లను అందించాల‌ంటూ విజ్ఞ‌ప్తి చేసిన ప్ర‌ధాన‌ మంత్రి

Posted On: 19 APR 2021 6:51PM by PIB Hyderabad

దేశం లో కోవిడ్-19 స్థితి పై, కోవిడ్ కు టీకా మందు ను ఇప్పించే కార్యక్రమం లో పురోగ‌తి పై ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ‌వ్యాప్త వైద్యుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు.  క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి కాలం లో వైద్యులు, చికిత్స శ్రమికులు, పారామెడిక‌ల్‌ కర్మచారులు దేశానికి అందించిన అమూల్యమైనటువంటి సేవ‌ల‌ ను ప్ర‌ధాన‌ మంత్రి కొనియాడారు.

గ‌త సంవ‌త్స‌రం, ఇదే కాలం లో, మ‌న దేశ వైద్యులు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డం, దేశం అనుస‌రించిన వ్యూహం వ‌ల్ల మ‌నం క‌రోనా వైర‌స్ ఉధృతి ని నిలువ‌రించ గ‌లిగామ‌ని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అన్నారు.  ఇప్పుడు దేశం రెండో ద‌శ క‌రోనా వైర‌స్ ప్ర‌భావాన్ని ఎదుర్కొంటోంద‌ని, అంద‌రు వైద్యులు, మన ఫ్రంట్‌ లైన్ వ‌ర్క‌ర్ లు పూర్తి శక్తి తో మ‌హ‌మ్మారి ని ఎదుర్కొంటున్నారని, వారు ఈ క్రమం లో ల‌క్ష‌ల కొద్దీ ప్ర‌జ‌ల ప్రాణాలను కాపాడుతున్నార‌ని ఆయన అన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల అవసరమైన మందుల స‌ర‌ఫ‌రా, సూది మందు లు, ఆక్సీజ‌న్ త‌గినంత‌గా అందుబాటు లో ఉండేటట్టు చూడ‌డానికి సంబంధించి అనేక కీల‌క చ‌ర్య‌లను తీసుకొందని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు.  రాష్ట్ర‌ప్ర‌భుత్వాలకు వీటి ని గురించి అవసరమైన దిశానిర్దేశం ఇవ్వడం జరిగిందన్నారు.

క‌రోనావైర‌స్ కు వ్యతిరేకం గా జరుపుతున్న పోరాటం లో టీకా మందు ను ఇప్పించే కార్యక్రమం అనేది అతి పెద్ద ఆయుధ‌ం అని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అన్నారు.  మ‌రింత ఎక్కువ‌ మంది రోగులను టీకా మందు ను వేయించుకొనేటట్టుగా ప్రోత్స‌హించాల‌ని ఆయన వైద్యులకు విజ్ఞప్తి చేశారు.

కోవిడ్ వ్యాధి చికిత్స‌ కు, నిరోధానికి సంబంధించి ప్ర‌చారం లో ఉన్న ర‌క‌ ర‌కాల వదంతుల పై ప్ర‌జ‌ల‌కు స‌రైన‌ అవ‌గాహ‌న ను క‌ల్పించవలసింది గా  వైద్యుల‌ కు ప్ర‌ధాన‌ మంత్రి పిలుపునిచ్చారు.  ప్ర‌స్తుత క్లిష్ట కాలం లో ప్ర‌జ‌లు అన‌వ‌సరంగా భ‌య‌ప‌డి బాధితులు కాకూడదు అని ఆయన అన్నారు.  ఆసుపత్రుల‌ లో చేరిన‌ రోగుల కు త‌గిన చికిత్స‌తో పాటు వారికి సరి అయిన రీతి లో కౌన్సెలింగ్‌ జరపాల‌ని ప్ర‌ధాన‌ మంత్రి సూచించారు.  ఇత‌ర వ్యాధుల‌కు సంబంధించి  అత్య‌వ‌స‌రం కాక‌పోతే చికిత్స అందించ‌డానికి టెలిమెడిసిన్ విధానాన్ని ఉపయోగించుకోవలసింది గా ఆయ‌న సూచించారు.

ప్ర‌స్తుతం కోవిడ్ మ‌హ‌మ్మారి ద్వితీయ శ్రేణి పట్ట‌ణాల‌ లో, తృతీయ శ్రేణి పట్ట‌ణాల‌ లో వేగం గా విస్త‌రిస్తోందని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు.  ఇలాంటి ప్రాంతాల‌ లో వ‌న‌రుల‌ను ఉన్న‌తీక‌రించ‌డానికి వేగ‌వంత‌మైన కృషి జ‌ర‌గాల‌న్నారు.  ద్వితీయ‌ శ్రేణి పట్ట‌ణాల‌ లో, తృతీయ‌ శ్రేణి ప‌ట్ట‌ణాల‌లో ఉన్న త‌మ స‌హ‌చ‌రుల‌తో సంబంధాలు పెట్టుకొని వారికి ఆన్‌ లైన్ ద్వారా పరామర్శించి కోవిడ్ కు సంబంధించిన అన్ని ప్రొటోకాల్స్ ను స‌క్ర‌మం గా పాటించేలా చూడాలి అని ఆయ‌న అన్నారు.

వైద్యులు కోవిడ్ మహమ్మారి ని ఎదుర్కొనే విషయం లో వారి అనుభ‌వాల‌ను తెలియ‌జేశారు.  కోవిడ్ మ‌హ‌మ్మారి ని ఎదుర్కోవ‌డం లో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ నాయ‌కత్వానికి అభినంద‌న‌ లు పలికారు.  ఆరోగ్య సంర‌క్ష‌ణ సంబంధి మౌలిక స‌దుపాయాల‌ను ఏ విధం గా పెంచుతున్నదీ కూడా వారు వివ‌రించారు.  ప్ర‌జ‌లు మాస్కు ను ధ‌రించ‌డం, సామాజిక దూరాన్ని పాటించ‌డం వంటి వాటి కి ఉన్న ప్రాధాన్య‌ాన్ని వారు పున‌రుద్ఘాటించారు.  అలాగే కోవిడ్‌ తో సంబంధం లేని రోగుల కు వైద్య పరమైన మౌలిక స‌దుపాయాల వ్యవస్థ ను అందుబాటు లో ఉంచడం గురించి సైతం వారు నొక్కి చెప్పారు.  మందుల అనుచిత ఉపయోగానికి వ్యతిరేకం గా  రోగుల కు ఏ విధం గా అవ‌గాహ‌న ను క‌ల్పిస్తున్న‌దీ వారు సమావేశం లో ప్రస్తావించారు.

ఈ స‌మావేశానికి కేంద్ర ఆరోగ్య‌ మంత్రి శ్రీ హ‌ర్ష్ వ‌ర్ధ‌న్‌, కేంద్ర ఆరోగ్య శాఖ స‌హాయ‌ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. స‌దానంద గౌడ‌, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మ‌న్‌ సుఖ్ మాండ‌వీయ‌, ప్ర‌ధాన‌ మంత్రి కి ప్రిన్సిపల్ సెక్ర‌ట్రి, నీతి ఆయోగ్ (హెచ్‌) స‌భ్యుడు డాక్ట‌ర్ వి.కె. పాల్‌,  కేబినెట్ సెక్ర‌ట్రి, కేంద్ర ఆరోగ్య కార్య‌ద‌ర్శి, కేంద్ర ఔషధి కార్య‌ద‌ర్శి, ఐసిఎమ్ ఆర్ డిజి డాక్ట‌ర్ బ‌ల‌రామ్ భార్గ‌వ లు సహా కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ‌శాఖ‌లు / విభాగాల అధికారులు హాజరు అయ్యారు.



 

***



(Release ID: 1712827) Visitor Counter : 174