యు పి ఎస్ సి

కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన యుపిఎస్ సి ప్రత్యేక సమావేశం


కొన్ని పరీక్షలు, ఇంటర్వ్యూలు వాయిదా

Posted On: 19 APR 2021 7:21PM by PIB Hyderabad

కరోనా సంక్షోభం కారణంగా వస్తున్న వేగవంతమైన మార్పులు, ఆరోగ్య పరిస్థితులు, లాక్ డౌన్ నిబంధనలు, సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలు, ఇప్పుడు మరింత తీవ్రరూపం ధరించిన కరోనా వాతావరణం లాంటి విషయాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేక సమావేశం చర్చించింది.  ప్రస్తుతం పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించగలిగే  పరిస్థితి లేదని అభిప్రాయపడింది.

 

2021 మే 9న జరగాల్సిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇవో/ఎవో) రిక్రూట్ మెంట్ టెస్ట్, 2020 ను అందువల్లనే వాయిదా వేశారు. ఏప్రిల్ 20-23 తేదీల్లో జరగాల్సిన ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ /ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ -2020 పర్సనాలిటీ టెస్ట్స్ (ఇంటర్వ్యూలు), ఏప్రిల్ 26- జూన్ 18 మధ్య జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2020 , రిక్రూట్ మెంట్ పరీక్షలు కూడా మళ్లీ తేదీ ప్రకటించేదాకా వాయిదా పడ్డాయి.   

 

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు కావాల్సి ఉన్న ఇంటర్వ్యూలకు, రిక్రూట్ మెంట్ పరీక్షలకు తేదీలను ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రకటిస్తారు. కొత్త తేదీల వివరాలను యు పి ఎస్ సి వెబ్ సైట్ లో నోటిఫై చేస్తారు. పరీక్షలు, నియామకాలు, ఇంటర్వ్యూలకు సంబంధించిన మరే నిర్ణయమైనా కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పుడు వాయిదా వేసిన పరీక్షలు, ఇంటర్వ్యూలకు ఎప్పుడు కొత్త తేదీలు నిర్ణయించినా కనీసం 15 రోజులు ముందుగానే ప్రకటిస్తారు. 

 
 

(Release ID: 1712755) Visitor Counter : 155