వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇప్పటివరకు, ఇతర రాష్ట్రాల కంటే మహారాష్ట్రకు ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ అందింది: శ్రీ పీయూష్ గోయల్
ప్రస్తుతం 110 శాతం సామర్థ్యంతో ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది, అందుబాటులో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని పారిశ్రామిక వినియోగం నుంచి వైద్య వినియోగానికి తరలిస్తున్నాం: పీయూష్ గోయల్
Posted On:
17 APR 2021 5:49PM by PIB Hyderabad
దేశంలో గరిష్ట స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి జరిగేలా కేంద్రం చర్యలు తీసుకుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం 110 శాతం సామర్థ్యంతో ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోందని, అందుబాటులో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని పారిశ్రామిక రంగం నుంచి వైద్య రంగానికి మళ్లిస్తున్నామంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రాల అవసరాలు తెలుసుకుని, సాధ్యమైనంత ఉత్తమ పద్ధతిలో సాయం చేయడానికి రాష్ట్రాలతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ట్వీట్ ద్వారా కేంద్ర మంత్రి వివరించారు. ఈ సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్రాలు సమష్టిగా పనిచేయాలని నిన్నటి సమీక్షలోనూ ప్రధాని చెప్పారన్నారు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడంపై పీయూష్ గోయల్ విచారం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు, ఇతర రాష్ట్రాల కంటే మహారాష్ట్రకే ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ అందిందని కేంద్ర మంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
***
(Release ID: 1712462)
Visitor Counter : 165