శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ సురక్ష మిషన్ కింద కోవాక్సిన్ ఉత్పాదక సామర్థ్యం పెంపు
Posted On:
16 APR 2021 5:01PM by PIB Hyderabad
కోవిడ్ సురక్ష మిషన్ కింద కోవాక్సిన్ ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంపొందించాలని భారత ప్రభుత్వ బయో టెక్నాలజీ శాఖ నిర్ణయించింది. స్వదేశంలో కోవిడ్ నివారణ కోసం కోవిడ్ వాక్సిన్ ల అభివృద్ధి, ఉత్పత్తిని మెరుగుపరచాలన్న లక్ష్యంతో ఆత్మ నిర్భర్ భారత్ 3.0 కింద కోవిడ్ సురక్ష మిషన్ అమలుజరుగుతోంది. ఈ మిషన్ కింద ఉత్పాదకత సామర్ధ్యాలను మెరుగు పరచడానికి అవసరమైన సౌకర్యాల కల్పనకు వాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు భారత ప్రభుత్వ బయో టెక్నాలజీ శాఖ గ్రాంటుల రూపంలో ఆర్ధిక సహకారాన్ని అందిస్తున్నది. 2021 మే-జూన్ నాటికి దేశంలో కోవాక్సిన్ ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. 2021 జులై-ఆగస్ట్ నాటికి ఉత్పత్తి ఆరు నుంచి ఏడు రేట్లు ఎక్కువ అవుతుంది. ఏప్రిల్ లో కోటి వాక్సిన్ డోసులు ఉత్పత్తి అవుతాయి. వీటి సంఖ్య జులై-ఆగస్ట్ నాటికి ఆరు నుంచి ఏడు కోట్లకి పెరుగుతుంది. 2021 సెప్టెంబర్ నాటికి దేశంలో 10కోట్ల వాక్సిన్ డోసులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.
దేశంలో ప్రధానంగా వాక్సిన్ ఉత్పత్తి అవుతున్న రెండు కేంద్రాలను వివిధ శాఖలతో ఏర్పాటైన బృందాలు సందర్శించి వీటిలో ఉత్పత్తిని అధికం చేయడానికి అమలుచేయవలసిన అంశాలను సమీక్షించింది. దీనికి సంబంధించిన వివిధ అంశాలు, ప్రణాళికలపై ఉత్పత్తిదారులతో చర్చలు నిర్వహించారు.
ఉత్పత్తిని ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో హైదరాబాద్ లో వున్న భారత్ బయోటెక్ లిమిటెడ్ తో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న సౌకర్యాలను మెరుగుపరచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికోసం బెంగుళూరులో వాక్సిన్ ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి భారత్ బయోటెక్ ఏర్పాటు చేస్తున్న కేంద్రంలో సౌకర్యాల కల్పనకు 65 కోట్ల రూపాయలను గ్రాంటు రూపంలో సమకూర్చాలని కేంద్రం నిర్ణయించింది.
ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఎక్కువ చేయడానికి మరో మూడు ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్ర సహకారం లభిస్తుంది.
* ఉత్పత్తి కార్యక్రమాలను ప్రారంభించడానికి మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న హాఫ్కిన్ బయోఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు దాదాపు 65 కోట్ల రూపాయలను గ్రాంటు రూపంగా కేంద్రం ఆర్ధిక సహకారం అందిస్తుంది. ఉత్పత్తిని ప్రారంభించడానికి హాఫ్కిన్ బయోఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ 12 నెలల సమయం పడుతుందని తెలిపింది. అయితే, ఆరు నెలల లోగా పనులను పూర్తి చేసి అత్యవసరంగా ఉత్పత్తి ప్రారంభించాలని కేంద్రం సూచించింది. హాఫ్కిన్ బయోఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ పని చేయడం ప్రారంభిస్తే ఇక్కడ నెలకి 20 మిలియన్ డోసులు ఉత్పత్తి అవుతాయి.
* 2021 ఆగస్ట్ - సెప్టెంబర్ నాటికి నెలకి 10 నుంచి 15మిలియన్ డోసులను ఉత్పత్తి చేయడానికి హైదరాబాద్ లో డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ కింద ఏర్పాటైన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్), కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం కింద సిపిఎస్‌ఇగా పనిచేస్తున్న భారత్ ఇమ్యునోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్ (బిబిసిఒఎల్)కు సహకరించాలని నిర్ణయించారు. 2021 ఆగస్ట్- సెప్టెంబర్ నాటికి ఈ రెండు సంస్థల నుంచి నెలకి 15 మిలియన్ డోసులు ఉత్పత్తి అవుతాయని ఆశిస్తున్నారు.
***
(Release ID: 1712334)
Visitor Counter : 297