రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

'రాజ్య సైనిక్‌ బోర్డుల' పశ్చిమ ప్రాంత నాలుగో సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిల్లీలో నిర్వహణ

Posted On: 16 APR 2021 5:37PM by PIB Hyderabad

రాజ్య సైనిక్‌ బోర్డుల (ఆర్‌ఎస్‌బీ) పశ్చిమ ప్రాంత నాలుగో సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిల్లీలో నిర్వహించారు. మాజీ సైనికుల సంక్షేమ విభాగం (డీఈఎస్‌డబ్ల్యూ) కార్యదర్శి శ్రీ రవికాంత్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. 

    కొత్త అంశాలతోపాటు, మూడో సమావేశంలోని నిర్ణయాలపై చేపట్టిన కార్యాచరణ నివేదికపైనా నాలుగో సమావేశంలో చర్చించారు. ఉద్యోగాల్లో మాజీ సైనికులకు కోటా, సిబ్బంది కొరత, ఆర్‌ఎస్‌బీ ఉద్యోగులకు జీతభత్యాలు, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిని అందించడంలో జాప్యం, 'ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్' కింద కొత్త పాలీ క్లినిక్‌ల ప్రారంభం, కొత్త సీఎస్‌డీ క్యాంటీన్లు, పింఛన్ల సమస్యలపై చర్చలు జరిపారు.

    ఆర్‌ఎస్‌బీలు ప్రస్తావించిన అంశాలపై అత్యవసరంగా, కాలవ్యవధి చర్యలు తీసుకోవాలని శ్రీ రవికాంత్‌ ఆదేశాలు జారీ చేశారు. డీఈఎస్‌డబ్ల్యూ, కేంద్రీయ సైనిక్‌ బోర్డు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆర్‌ఎస్‌బీలకు భరోసా ఇచ్చారు.

***


(Release ID: 1712332)