నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ఒడిశాలోని ధమారా నదిపై రూ.110 కోట్ల విలువైన రోపాక్స్ జెట్టి ప్రాజెక్ట్ రానుంది
దీనివల్ల ప్రయాణ సమయం 6 గంటల నుండి కేవలం గంటకు తగ్గుతుంది
Posted On:
16 APR 2021 1:19PM by PIB Hyderabad
ఒడిశాలోని ధమారా నదిపై ఆల్-వెదర్ రోపాక్స్ (రోల్-ఆన్ / రోల్-ఆఫ్ ప్యాసింజర్) జెట్టీ, అనుబంధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రూ .50.30 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ & జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎస్డబ్ల్యూ) అనుమతించింది. సాగర్మాల కార్యక్రమం కింద చేపట్టే ఈ ప్రాజెక్టు వల్ల భద్రక్ జిల్లాలోని కనినాలి, కేంద్రపారా జిల్లాలోని తలచువా మధ్య ప్రయాణదూరాన్ని తగ్గించవచ్చు. ఒడిశా ఈ ప్రాజెక్టుకు అదనంగా 50% నిధులు సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం మూలధన వ్యయం రూ .110.60 కోట్లు. వీటితో కనిలి, తలాచువా వద్ద ఆర్ఓ-పాక్స్ జెట్టి నిర్మాణం, పార్కింగ్ ఏరియా డెవలప్‌మెంట్, నావిగేషనల్ ఎయిడ్స్, డ్రెడ్జింగ్ వంటి సదుపాయాలను నిర్మిస్తారు. ఈ జలరవాణా మార్గం వల్ల రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 6 గంటల నుండి గంటకు తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న ఘాట్లతోపాటు ఆల్-వెదర్ రోపాక్స్ జెట్టీలను అభివృద్ధి చేస్తారు. దీనివల్ల పడవలు, లాంచీలు, ఇతర నౌకలకు వసతి కల్పించవవచ్చు. 10 తేలికపాటి మోటారు వాహనాలు, 20 మోటర్‌బైక్‌లతో పాటు ఒకేసారి 60 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న భారీ నౌకను కూడా నడపవచ్చు. ఈ ప్రాజెక్ట్ ధమ్రా నది చుట్టూ ఉన్న స్థానికులకు పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. తలాచువా నుండి ధమ్రా వరకు 200 కిలోమీటర్ల దూరాన్ని రోడ్డు ద్వారా ప్రయాణించాల్సిన అవసరం ఉండదు.
భద్రాక్ జిల్లాలోని కనినాలి, కేంద్రాపాడ జిల్లాలోని తలాచువా ప్రాంతాలు ధమ్రా నది ఉత్తర, దక్షిణ ఒడ్డున ఉన్నాయి. తలాచువా సమీప గ్రామాల ప్రజలు తమ జీవనోపాధి కోసం ఎక్కువగా ధమ్రా ఓడరేవుపై ఆధారపడతారు. ఇది కనినాలి ఘాట్ నుండి సుమారు 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు రవాణా సదుపాయం లేనందున, స్థానిక ప్రజలు నదిని దాటడానికి కనినాలి తలాచువా ఘాట్ల వద్ద ప్యాసింజర్ ఫెర్రీలపై ఆధారపడుతారు. ఇలా ఏడు కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రస్తుతం, ప్రయాణీకుల వాహనాలు భద్రత లేకుండానే ప్రైవేట్ బోట్ల ద్వారా వెళ్తున్నాయి. రోజూ లాంచీల్లో ప్రయాణించడానికి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ప్రయాణీకుల వాహనాల భద్రతను మెరుగుపరుస్తుంది. జలరవాణా పెరగడం వల్ల వాణిజ్య వ్యాపార కార్యకలాపాలను పెరుగుతాయి. చుట్టుపక్కల ప్రాంతాల సామాజిక-ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతాయి.
***
(Release ID: 1712230)
Visitor Counter : 219