ప్రధాన మంత్రి కార్యాలయం

భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఎఐయు) 95వ సమావేశం మరియు వైస్ చాన్స్ లర్ ల జాతీయ చర్చాసభ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 14 APR 2021 1:23PM by PIB Hyderabad

నమస్కారం.

ఈ కార్యక్రమం లో నాతో పాటు పాల్గొన్న గుజరాత్ గవర్నర్ ఆచార్య శ్రీ దేవ్ వ్రత్ గారు, దేశ విద్యా శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్ రియాల్ నిశంక్ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ గారు, గుజరాత్ విద్యా శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర సింహ్ గారు, యుజిసి ఛైర్మన్ ప్రొఫెసర్ డి.పి. సింహ్ గారు, బాబా సాహెబ్ అంబేడ్ కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ అమీ ఉపాధ్యాయ్ గారు, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్- ఎఐయు ప్రెసిడెంట్ ప్రొఫెసర్ తేజ్ ప్రతాప్ గారు , ఇక్కడ ఉన్న అందరు మహానుభావులు మరియు సహచరులారా,

స్వాతంత్ర్యం తాలూకు అమృత్ మహోత్సవాన్ని దేశం జరుపుకొంటున్న నేపథ్యం లో, ఇదే కాలం లో ఈ రోజు న బాబా సాహెబ్ అంబేడకర్ గారి జయంతి సందర్భం సైతం మనలను ఈ మహా యజ్ఞం లో జతకలుపుతున్నది, అంతే కాక భవిష్యత్తు తాలూకు ప్రేరణ తో కూడా మనలను జోడిస్తున్నది.  కృతజ్ఞ  దేశం పక్షాన, దేశ ప్రజానీకం పక్షాన నేను బాబా సాహెబ్ కు గౌరవపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
 
మిత్రులారా,

స్వాతంత్ర్య పోరాటం లో లక్షలు, కోట్ల కొద్దీ మన స్వాతంత్ర్య సమర యోధులు సామరస్య పూర్వకమైనటువంటి, సమ్మిళితమైనటువంటి భారతదేశం కోసం కలలు కన్నారు.  దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ కలల ను నెరవేర్చేందుకు బాబా సాహెబ్ నాంది పలికారు.  ఇవాళ అదే రాజ్యాంగాన్ని అనుసరిస్తూ భారతదేశం ఒక కొత్త భవిష్యత్తు ను లిఖించుకొంటోంది, సఫలత తాలూకు కొత్త పార్శ్వాలను ఆవిష్కరిస్తోంది.

 

మిత్రులారా,

ఈ రోజు, ఈ పవిత్రమైన రోజు న భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం వైస్ చాన్స్ లర్ ల 95వ సమావేశం జరుగుతోంది.  బాబా సాహెబ్ అంబేడ్ కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ‘బాబా సాహెబ్ సమరస్ తా చైర్’ ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.  బాబా సాహెబ్ జీవితం, ఆయన ఆలోచనలు, ఆదర్శాలపై  శ్రీ కిశోర్ మక్ వానా జీ రాసిన నాలుగు పుస్తకాల ను జాతికి సమర్పించడం కూడా జరిగింది.  ఈ ప్రయాసలలో పాలుపంచుకొన్న మహానుభావులు అందరినీ నేను అభినందిస్తున్నాను.

 

మిత్రులారా,

భారతదేశం ప్రపంచం లో ప్రజాస్వామ్యానికి తల్లి గా ఉండింది. ప్రజాస్వామ్యం మన నాగరకత, మన విధి విధానాలు, ఒక రకం గా మన జీవన పద్ధతి తాలలూకు ఒక సహజ భాగం గా అలరారింది.  స్వాతంత్ర్యం ఆర్జించుకొన్న తరువాత, భారతదేశం తన అదే ప్రజాస్వామిక వారసత్వాన్ని పటిష్టపరచుకొని ముందుకు సాగిపోవాలి అని బాబా సాహెబ్ దీనికి ఒక బలమైన పునాది ని దేశానికి అందించారు. మనం ఎప్పుడైతే బాబా సాహెబ్ రచనలను చదువుతామో, వాటిని అర్థం చేసుకొంటామో, అటువంటప్పుడు ఆయన ఒక విశ్వ దర్శనం గల వ్యక్తి అని మనకు అనిపిస్తుంది.

 

శ్రీ కిశోర్ మక్ వానా గారి పుస్తకాలలో బాబా సాహెబ్ దృష్టికోణాన్ని గురించిన స్పష్టమైన దర్శనం ఇమిడివుంది.  ఆయన పుస్తకాలలో ఒకటి బాబా సాహెబ్ ‘జీవన్ దర్శన్’ ను పరిచయం చేస్తుంది; రెండో పుస్తకం ప్రధానం గా ఆయన తాలూకు ‘వ్యక్తి దర్శన్’ పై దృష్టి ని సారిస్తుంది.  అదే విధంగా, మూడో గ్రంథం బాబా సాహెబ్ ‘రాష్ట్ర దర్శన్’ ను మన ముందుకు తీసుకు వస్తుంది. ఇక నాలుగో పుస్తకం ఆయన తాలూకు ‘ఆయామ్ దర్శన్’ ను దేశ ప్రజల చెంతకు చేర్చుతుంది.  ఈ నాలుగు తత్వాలు వాటంతట అవి ఏ ఆధునిక శాస్త్రం కన్నా తక్కువ కాదు.

 

దేశం లోని విశ్వవిద్యాలయాలలో, కళాశాలల్లో మన నవ తరం, ఈ పుస్తకాలను, ఈ కోవకు చెందిన మరెన్నో గ్రంథాలను కూడా మరింత ఎక్కువ మంది చదవాలి అని నేను కోరుకుంటాను.  ఈ కోణాలన్నీ, సామరస్యభరిత సమాజం గురించి కావచ్చు, దళితులు- ఆదరణ కు నోచుకోని సమాజం తాలూకు అధికారాల పట్ల మథనం గురించి కావచ్చు, మహిళ ల అభ్యున్నతి, తోడ్పాటుల ప్రసక్తి కావచ్చు, ఈ అన్ని పార్శ్వాల పట్ల దేశం లోని యువతీయువకులకు బాబా సాహెబ్ అంతరంగాన్ని తెలుసుకొనేందుకు, గ్రహించేందుకు ఒక అవకాశం అంటూ అందివస్తుంది.

 

మిత్రులారా,

 

డాక్టర్ అమ్బేడ్ కర్ అనే వారు-

 

"నేను ఉపాసించే దేవతలు ముగ్గరు- వారే జ్ఞానం, ఆత్మగౌరవం మరియు శీలం" అని.  అంటే Knowledge, Self-respect and politeness. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, అప్పుడే ఆత్మగౌరవం కూడా పెంపొందుతుంది; ఆత్మగౌరవం తో వ్యక్తి  తన అధికారాలు, తన హక్కు ల విషయం లో తెలివిడి తెచ్చుకొంటారు.  మరి సమాన హక్కుల తోనే సమాజం లో సామరస్యం ప్రవేశిస్తుంది, దేశం అభివృద్ధి చెందుతుంది.


బాబా సాహెబ్ జీవన సంఘర్షణ గురించి మనకు అందరికీ తెలుసును.  అన్ని సంఘర్షణల అనంతరం సైతం బాబా సాహెబ్ ఏ శిఖర స్థానాన్ని చేరుకొన్నారో, అది మన అందరికీ చాలా పెద్దదైనటువంటి ప్రేరణగా ఉంది.  బాబా సాహెబ్ అమ్బేడ్ కర్ మనకు చూపించి పోయినటువంటి మార్గం ఏదయితే ఉందో, ఆ పథం లో దేశం నిరంతరం సాగు గాక, ఈ బాధ్యత మన విద్య వ్యవస్థ మీద, మన విశ్వవిద్యాలయాల మీద ఎప్పటి నుంచో ఉంటూవచ్చింది.  ఇక ఎప్పుడయితే ప్రశ్న ఒక దేశం రూపం లో ఉమ్మడి లక్ష్యాలు, భాగస్వామ్య ప్రయాసలకు సంబంధించింది అవుతుందో, అటువంటప్పుడు సామూహిక ప్రయాసలే కార్యసాధన తాలూకు మాధ్యమం అయిపోతాయి.

అందువల్ల, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఎఐయు) తాలూకు భూమిక మహత్వపూర్ణం గా మారుతుంది అని నేను తలుస్తాను.  ఎఐయు దగ్గరయితే డాక్టర్ సర్వపల్లీ రాధాకృష్ణన్ గారు, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, శ్రీమతి హంసా మెహతా, డాక్టర్ జాకిర్ హుసైన్ ల వంటి పండితుల వారసత్వం కూడా ఉంది.
 

డాక్టర్ రాధాకృష్ణన్ గారు అనే వారు- “The end-product of education should be a free creativeman, who can battle against historical circumstancesand adversitiesof nature”.

ఈ మాటల తాత్పర్యం ఏమిటి అంటే,

విద్య ఎలా ఉండాలి అంటే ఏదయితే వ్యక్తి కి విముక్తి ని ఇస్తుందో, ఆ వ్యక్తి అరమరికలు లేకుండా ఆలోచించాలి, కొత్త ఆలోచన తో నవ నిర్మాణాన్ని చేయాలి.. అని.  మనం మన విద్య నిర్వహణ ను యావత్తు ప్రపంచాన్ని ఒక యూనిట్ గా తలపోసి అభివృద్ధి చేయాలి అని ఆయన భావించే వారు.  అయితే దీనితో పాటు ఆయన విద్య తాలూకు భారతీయ స్వభావం అన్నా, భారతీయ చరిత్ర అన్నా అంతే ప్రాధాన్యాన్ని ఇచ్చే వారు.  ఇవాళ్టి గ్లోబల్ సీనేరియో లో ఈ మాటలు మరింత ప్రాముఖ్యం కలిగినవిగా అయిపోతున్నాయి.

 

ఇప్పుడే ఇక్కడ కొత్త ‘జాతీయ విద్య విధానం’, ఆ విధానం అమలు ప్రణాళిక కు సంబంధించిన ప్రత్యేక సంచికల ను ఆవిష్కరించడం జరిగింది.  ఈ సంచిక లు జాతీయ విద్య విధానం ఎలా ఒక భవిష్యత్ దార్శనికత కలిగిన విధానం గా ఉందో, ఎలా ప్రపంచ పరామితులతో కూడిన విధానంగా రూపుదిద్దుకొందో అనే మాటల తాలూకు వివరణాత్మకమైనటువంటి  పత్రాలు అని చెప్పవచ్చును.  మీ పండితులంతా,  జాతీయ విద్య విధానం తాలూకు సూక్ష్మాలు ఎరిగినటువంటి వారు.  డాక్టర్ రాధాకృష్ణన్ గారు విద్య ను గురించి ఏ ప్రయోజనం సంగతి ని గురించి చెప్పారో, అదే ఈ విధానానికి సారం గా కనిపిస్తుంది.


ఈసారి మీరు చర్చాసభ కు ఇతివృత్తాన్ని కూడా ఇదే.. 'Implementing National Educational Policy-2020 to Transform Higher Education in India' (‘భారతదేశం లో ఉన్నత విద్య రూపురేఖల లో మార్పు కోసం జాతీయ విద్య విధానం -2020 ని అమలు చేయడం' ) గా ఉంచినట్లు నాకు చెప్పారు. దీనికి గాను మీరందరూ అభినందనలకు అర్హులు అయ్యారు.

నేను జాతీయ విద్య విధానం (ఎన్ఇపి) విషయం లో అదే పని గా నిపుణుల తో చర్చిస్తూ వస్తున్నాను.  జాతీయ విద్య విధానం ఎంతటి ఆచరణప్రధానమైందో, దీని అమలు కూడాను అంతే ఆచరణాత్మకంగా ఉంది.

స్నేహితులారా,

మీరు మీ జీవనాన్నంతటినీ విద్య కే అంకితం చేశారు.  ప్రతి విద్యార్థి కి తన కంటూ ఒక సామర్థ్యం ఉంటుందనేది మీ అందరికీ చాలా చక్కగా తెలుసును.  ఇవే సామర్థ్యాల ఆధారం గా విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎదుట మూడు ప్రశ్నలు కూడా నిలబడతాయి.

 

ఒకటో ప్రశ్న:  వారు ఏమి చేయగలరు?

 

రెండోది:  ఒక వేళ వారికి నేర్పించడం జరిగితే, అటువంటప్పుడు వారు ఏమి చేయగలుగుతారు?

 

ఇక మూడోది:  వారు ఏమి చేయాలని కోరుకొంటున్నారు?

 

ఒక విద్యార్థి ఏమి చేయగలరు అనేది ఆ విద్యార్థి తాలూకు అంతర్గత బలం గా ఉంటుంది.  అయితే ఒకవేళ మనం ఆ విద్యార్థి అంతర్గత బలం తో పాటు సంస్థాగత బలాన్ని కూడా అందించామంటే, అప్పుడు దానితో ఆ విద్యార్థి తాలూకు వికాసం విస్తృతం గా మారిపోతుంది.  ఈ కలయిక తో మన యువత వారు చేయాలని కోరుకొంటున్నదానినల్లా చేయగలుగుతారు.  ఈ కారణం గా, ఇవాళ దేశం తాలూకు ప్రత్యేక ప్రాధాన్యం నైపుణ్యాభివృద్ధి పై కేంద్రీకృత‌ం అయింది.  ప్రస్తుతం దేశం ఎలాగయితే ‘ఆత్మనిర్భర్ భారత్’ అభియాన్ తో ముందుకు సాగిపోతోందో, నైపుణ్యవంతులైనటువంటి యువత పాత్ర, వారి గిరాకీ కూడాను పెరుగుతూ పోతోంది.


మిత్రులారా,

 

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నైపుణ్యాల తాలూకు ఈ బలాన్ని దృష్టి లో పెట్టుకొనే, దశాబ్దాల క్రితం నాడే, విద్య సంస్థ ల, పరిశ్రమల సహకారం అనే అంశానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చారు.  నేడు, దేశం వద్ద అంతులేనన్ని  అవకాశాలు ఉన్నాయి, అప్పటి కంటే ఆధునిక కాలం లో కొత్త కొత్త పరిశ్రమలు వచ్చాయి.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, 3డి ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ, రోబోటిక్స్, మొబైల్ టెక్నాలజీ, జియో- ఇన్ఫర్మేటిక్స్, స్మార్ట్ హెల్త్‌కేర్ మొదలుకొని రక్షణ రంగం వరకు, ఇవాళ ప్రపంచం లో భారతదేశాన్ని భవిష్యత్తు కు కేంద్రం గా  చూడటం జరుగుతోంది.  ఈ అవసరాలను తీర్చడానికి దేశం నిరంతరం పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకొంటోంది.

దేశం లోని మూడు పెద్ద మహానగరాలలో ఇండియన్ ఇన్స్ టిట్యూట్స్ ఆఫ్ స్కిల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతోంది.  కొన్ని నెలల కిందట ముంబయి లో ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ తాలూకు ఒకటో బ్యాచ్ ప్రారంభం అయిపోయింది కూడా.  నేస్ కామ్ తో కలసి 2018వ సంవత్సరం లో ఫ్యూచర్ స్కిల్స్ ఇనిషియేటివ్ ను మొదలుపెట్టడమైంది. ఈ కార్యక్రమం 10 అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల లో 150 కి పైగా స్కిల్ల సెట్ లలో శిక్షణ ను అందిస్తుంది.

 

మిత్రులారా,

 

కొత్త జాతీయ విధానం లోల, ఎన్ఇటిఎఫ్ తాలూకు ఏర్పాటు కూడా ఉంది.  ఇది విద్య లో సాంకేతిక విజ్ఞానాన్ని గరిష్ఠం గా ఉపయోగించడాన్ని గురించి నొక్కి చెప్తుంది.  మేము కోరుకుంటున్నది ఏమిటి అంటే అది విశ్వవిద్యాలయాలు అన్నీ కూడాను మల్టి-డిసిప్లినరీ గా రూపుదిద్దుకోవాలి అనేదే.  మేము విద్యార్థులకు సరళత్వాన్ని ఇవ్వాలనుకొంటున్నాం. ఉదాహరణ కు ఈజీ ఎంట్రీ- ఎక్జిట్, ఇంకా  అకాడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ వంటివి ప్రవేశపెపట్టి తద్వారా ఎక్కడైనా సరే కోర్సు ను సులభంగా పూర్తి చేయడం వంటివి.  ఈ లక్ష్యాలన్నిటినీ సాధించడం కోసం దేశం లోని ప్రతి విశ్వవిద్యాలయం కలిసి ఒకటి మరొక దానితో సమన్వయం ఏర్పరచుకొని పనిచేసి తీరాల్సిందే.  దీనిపై ఉప కులపతులంతా ప్రత్యేకం గా దృష్టి ని నిలపవలసివుంది.

 

దేశం లో కొత్త కొత్త అవకాశాలు ఏవయితే ఉన్నాయో, ఏ రంగాల లో మనం అవకాశాల ను సృష్టించగలమో, వాటి కోసం ఒక భారీ స్కిల్ పూల్ మన విశ్వవిద్యాలయాలలోనే సృష్టించబడుతుంది.  మీరందరిని కోరేది ఏమిటి అంటే, ఈ దిశలో మరింత వేగం గా పని జరగాలి అనే, ఒక నిర్ధారిత కాలం  లోపల ఆ పని ని పూర్తి చేయడం జరగాలి.

మిత్రులారా,


బాబా సాహెబ్ అంబేడ్ కర్ అడుగుజాడలలో నడుస్తూ- పేదలు, దళితులు, బాధితులు, శోషితులు, వంచన కు గురి అయిన వారు, అందరి జీవనం లో  వేగం గా మార్పు ను తీసుకువస్తోంది.  బాబా సాహెబ్ సమాన వకాశాలను గురించి, సమాన హక్కుల ను గురించి చెప్పారు.  నేడు జన్ ధన్ ఖాతాల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ని దేశం ఆర్ధిక వలయం లోపలకు తీసుకు వస్తోంది. డిబిటి మాధ్యమం ద్వారా పేదల డబ్బు నేరు గా వారి ఖాతాలకు చేరుకొంటోంది.  డిజిటల్ ఇకానమీ కై ఏ భీమ్ యుపిఐ ని మొదలుపెట్టడం జరిగిందో, ఇవాళ అది పేదల కు అతి పెద్ద బలం గా మారింది.  నేడు, ప్రతి పేద కు, ఇల్లు సమకూరుతోంది; ఉచిత విద్యుత్ కనెక్షన్ లభిస్తోంది; అదేవిధంగా జల్- జీవన్ మిశన్ మాధ్యమం ద్వారా పల్లె లోనూ శుద్ధమైన నీటి ని అందించేందుకుగాను ఒక భారీ ఉద్యమం స్థాయి లో పనులు జరుగుతూ ఉన్నాయి.

 

కరోనా సంక్షోభం తల ఎత్తినప్పుడు దేశం లో పేదలు, శ్రమికుల ఎదుట సమస్య గా నిలచింది.  ప్రపంచం లోని అతి పెద్ద వాక్సీనేశన్ ప్రోగ్రామ్ లో పేదలు, ధనవంతులనే వివక్ష ఏదీ లేదు; ఎలాంటి అంతరమూ తేదు.  బాబా సాహెబ్ చూపించిన మార్గం ఇదే; ఇవే కదా ఆయన ఆదర్శాలు.

మిత్రులారా,

 

బాబా సాహెబ్ ఎల్లప్పుడూ మహిళలకు సాధికారిత కల్పన ను గురించి నొక్కిచెప్పారు.  ఈ దిశలో ఆయన చాలా ప్రయత్నాలు చేశారు.  ఈ దృష్టితోనే దేశం ఈ రోజు తన కుమార్తెలకు కొత్త కొత్త అవకాశాలను ఇస్తోంది. ఇంట్లోను,  పాఠశాలలోను మరుగుదొడ్లు మొదలుకొని సైన్యం లో పాత్రల వరకు, దేశంలోని ప్రతి విధానానికి మహిళలు కేంద్ర స్థానం లో నిలుస్తున్నారు.

 

అదేవిధంగా బాబా సాహెబ్ సందేశాన్ని ప్రజలందరి వద్దకు చేరవేయడా
నికి కూడాను దేశం ఇవాళ కృషి చేస్తున్నది.  బాబా సాహెబ్ తో సంబంధం ఉన్న ప్రదేశాలను ‘పంచ్ తీర్థ్’ గా తీర్చిదిద్దడం జరుగుతోంది.

కొన్ని సంవత్సరాల క్రితం, డాక్టర్ అంబేడ్ కర్ ఇంటర్ నేశనల్ సెంటర్ ను దేశ ప్రజల కు అంకితం చేసే అవకాశం నాకు లభించింది.  ఇవాళ, ఈ కేంద్రం సామాజిక, ఆర్థిక అంశాలపై, బాబా సాహెబ్ జీవనం పై పరిశోధన తాలూకు ఒక కేంద్రం గా ఎదుగుతోంది.

మిత్రులారా,

ప్రస్తుతం, మనం స్వాతంత్య్రాన్ని సాధించుకొని 75 సంవత్సరాల కు చేరువవుతున్నాం, తరువాతి 25 సంవత్సరాలకు గాను లక్ష్యాలు మన ముందు ఉన్నాయి.  దేశ భవిష్యత్తు, భావి లక్ష్యాలు, విజయాలు మన యువత తో ముడిపడి ఉన్నాయి.  ఈ సంకల్పాలను మన యువతీయువకులు నెరవేరుస్తారు.  దేశ యువత కు వారి సామర్థ్యం మేరకు అవకాశాలను మనం అందించవలసివుంది.

మన అందరి ఈ సామూహిక సంకల్పం, మన విద్య జగతి తాలూకు ఈ జాగృత ప్రయాస లు నవ భారతదేశం తాలూకు ఈ కల ను తప్పక నెరవేర్చుతాయి అని నాకు పూర్తి భరోసా ఉంది.

మన ఈ ప్రయత్నాలు, ఈ కృషి.. ఇవే బాబా సాహెబ్‌ చరణాల లో మనం అర్పించే శ్రద్ధాంజలి కాగలవు.

ఈ శుభాకాంక్షల తో, నేను మరోసారి మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలను వ్యక్తం చేస్తున్నాను; మీకు నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు న బాబా సాహెబ్ అమ్బేడ్ కర్ జయంతి సందర్భం లో ప్రత్యేకం గా శుభకామనలను అందజేస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు.

అస్వీకరణ:  ప్రధాన మంత్రి ప్రసంగానికి ఇది ఉజ్జాయింపు అనువాదం.  సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.

 

 

***



(Release ID: 1712170) Visitor Counter : 163