ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భారత్-హెచ్డబ్ల్యూసీ మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఆరోగ్య అవగాహనపై ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. ఈ విషయంలో తమకు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ప్రేరణ అని ప్రకటించారు.


ఇప్పటి వరకు దేశంలో 75,532 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి

మన ప్రధాని ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించడమే గాక, అది సక్రమంగా అమలయ్యేలా చూశారు : డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 14 APR 2021 5:23PM by PIB Hyderabad

ఆయుష్మాన్ భారత్- హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ (హెచ్డబ్ల్యూసీ)  మూడవ వార్షికోత్సవం సందర్భంగా వర్చువల్ విధానంలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి  అశ్విని కుమార్ చౌబే హాజరయ్యారు.

నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కె పాల్ కూడా వర్చువల్గా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 6800 మందికి పైగా ఎబి-హెచ్డబ్ల్యూసీల ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు,  కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల వంటి హెల్త్ వర్కర్లు కూడా  ఈ వేడుకల్లో వర్చువల్ వేదికల ద్వారా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం (2018 లో) ఛత్తీస్గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జంగ్లాలో మొట్టమొదటి ఆయుష్మాన్ భారత్- ఆరోగ్య  సంరక్షణ కేంద్రాన్ని  ప్రధాని  నరేంద్ర మోడీ ప్రారంభించిన సంఘటనను గుర్తు చేశారు. ఇందుకు భారత్ రత్న బాబాసాహెబ్ డాక్టర్ భీంరావు అంబేద్కర్ స్పూర్తి అన్నారు. “ఈ కేంద్రాలు ఆయన ఆలోచనా విధానానికి దగ్గరగా ఉన్నాయి.  అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి సమాజంలో వారికి గౌరవం, సమానత్వం  సామాజిక న్యాయం తీసుకురావడానికి చేస్తున్న మా ప్రయత్నాలకు ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంంటారు ” అని ఆయన వివరించారు.  ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు హెచ్డబ్ల్యూసీలు  వెన్నెముక అని అన్నారు.  "ప్రధానమంత్రికి  దూరదృష్టి ఉంది. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది" అని పేర్కొన్నారు.  'స్వస్థ్' కార్యక్రమాన్ని  సంస్థాగతీకరించడంలో, ప్రజాఉద్యమంగా మార్చడంలో ఈ కేంద్రాలు కీలకమని రుజువు అయిందని హర్షవర్ధన్ వివరించారు.  కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ, భారతదేశం ఇప్పటివరకు 75,532 హెచ్డబ్ల్యూసీలను మొదలుపెట్టింది. 2022 డిసెంబర్ నాటికి 1.5 లక్షల హెచ్డబ్ల్యూసీలను అందుబాటులోకి తెస్తారు. ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్, ఆశా కార్యకర్తలు,  ఎఎన్ఎంల్లో ఎక్కువ మంది మహిళలే కాబట్టి, వాళ్లే ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. హెచ్డబ్ల్యూసీలకు దగ్గరగా ఫ్రంట్లైన్ వర్కర్ల ఇండ్లు ఉండటం, వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటుండటం వల్ల సంరక్షణ కేంద్రాల్లో పరీక్షలు,  చికిత్సల కోసం పెద్ద సంఖ్యలో మహిళలు ముందుకు వస్తున్నారు. 2021 ఏప్రిల్ 13 నాటికి, 23.8 కోట్ల మందికిపైగా మహిళలు (53.7%) ఈ కేంద్రాలలో చికిత్స తీసుకున్నారు. మొత్తం 44.24 కోట్ల మందికి పైగా వచ్చారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య అధికారులు  రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల వారు ఎక్కడికి వెళ్లినా హెచ్డబ్ల్యూసీలను సందర్శించి, వారి పనితీరును గమనించాలని,  ఫ్రంట్లైన్ వర్కర్లకు ఉన్న అవరోధాలను  లోపాలను తొలగించే దిశగా పనిచేయాలని డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా అన్నారు. వివిధ రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాలు ఉపయోగించిన ఉత్తమ పద్ధతుల నుండి నేర్చుకోవడం ద్వారా ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి వినూత్న విధానాల మధ్య పోటీకి ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటివరకు హెచ్డబ్ల్యూసీ కార్యక్రమం సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు. ఎబి-హెచ్డబ్ల్యూసీల్లో రక్తపోటు నిర్ధారణ కోసం 9.82 కోట్ల మందిని, డయాబెటిస్‌ను నిర్ధారించడానికి 8.05 కోట్ల మందిని పరీక్షించారు. ఇన్సులిన్ కనుగొన్న సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రోజు ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నదని వెల్లడించారు.  నోటి క్యాన్సర్ (5.08 కోట్ల పరీక్షలు), రొమ్ము క్యాన్సర్ (మహిళల్లో 2.64 కోట్ల పరీక్షలు), గర్భాశయ క్యాన్సర్ (మహిళల్లో 1.79 కోట్ల పరీక్షలు) వంటి మూడు సాధారణ క్యాన్సర్ల పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ఆరోగ్యరంగానికి భారీ కేటాయింపులను గమనిస్తే  పౌరులందరి సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉందని  అర్ధమవుతుందని మంత్రి అన్నారు.  “ఈ సంవత్సరం ఆరోగ్యం  శ్రేయస్సు కోసం బడ్జెట్ వ్యయం  137% పెరిగి రూ. 2,23,846 కోట్లకు చేరుకుంది. కరోనా9 వ్యాక్సిన్ కోసం రూ .35,000 కోట్లు కేటాయించారు. వచ్చే 5 సంవత్సరాల్లో సుమారు 64,180 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధాన్ మంత్రి ఆత్మ నిర్భర్ స్వస్థ్ భారత్ యోజన (పిఎంఎఎస్బివై)ను అమలు చేస్తారు. ఇందులో భాగంగా ప్రాథమిక, ద్వితీయ,  తృతీయ సంరక్షణ ఆరోగ్య వ్యవస్థల సామర్థ్యాలను పెంచుతారు. ఇప్పుడున్న జాతీయస్థాయి సంస్థలను బలోపేతం చేస్తారు.. కొత్త వ్యాధులను గుర్తించడం  నయం చేయడానికి కొత్త సంస్థలను ఏర్పాటు చేస్తారు. హెచ్డబ్ల్యూసీల అభివృద్ది కోసం పలు కార్యక్రమాలను అమలు చేస్తారు. ప్రధాన్ మంత్రి ఆత్మ నిర్భర్ స్వస్థ్ భారత్ యోజన 17,788 గ్రామీణ,  11,024 పట్టణ ఆరోగ్య  సంరక్షణ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.  పట్టణ ప్రాంతాల్లో మరింత వికేంద్రీకృత ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ విభాగాలను ప్రారంభిస్తామని హర్షవర్ధన్ విశదీకరించారు.

  కామన్ ఎమర్జెన్సీల నిర్వహణ, ప్రాథమిక సంరక్షణ స్థాయిలో కాలినగాయాలు, బాధానివారణ చికిత్సలు ఇవ్వడం కోసం, హెచ్డబ్ల్యూసీలలో పాలియేటివ్ కేర్ కోసం , హెచ్డబ్ల్యూసీలలో వృద్ధుల సంరక్షణ కోసం కార్యాచరణ మార్గదర్శకాలను ఈ సందర్భంగా మంత్రి హర్షవర్ధన్ విడుదల చేశారు. హెచ్డబ్ల్యూసీలలో అందిస్తున్న 12 సేవల గురించి వివరించే పోస్టర్ను కూడా విడుదల చేశారు.  గ్రామీణ ఆరోగ్య గణాంకాలు - 2019 -20 (మార్చి 2020 నాటికి) అందజేయడానికి, హెచ్డబ్ల్యూసీలలో అందించబడుతున్న సేవలపై ఉపయోగకరమైన సమాచారాన్ని పొందటానికి రూపొందించిన హెచ్డబ్ల్యూసీ పోర్టల్‌ను కూడా కేంద్ర మంత్రి ఈ రోజు ప్రారంభించారు.  

19 రాష్ట్రాల ప్రతినిధులు (పంజాబ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, మిజోరాం, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, చండీగఢ్, దాద్రానగర్ హవేలి,  డామన్ & డయు, అండమాన్, నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్) 2020-21 సంవత్సరానికి లక్ష్యాలను  100% సాధించినందుకు సత్కరించారు.

మిజోరాం, మేఘాలయ, రాజస్థాన్ ఎబి-హెచ్డబ్ల్యూసీలలో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో అసాధారణమైన పనితీరు కనిపించింది. (2020 ఏప్రిల్- 2021 ఫిబ్రవరి మధ్య ఎబి-హెచ్డబ్ల్యూసీలు నిర్వహించిన వెల్‌నెస్ సెషన్ల సగటు సంఖ్య ఆధారంగా) కేరళ, తెలంగాణ, గుజరాత్, ఎబి-హెచ్డబ్ల్యూసీలు నాన్-కమ్యూనికేషన్ వ్యాధుల పరీక్షల నిర్వహణ అసాధారణమైన పనితీరును చూపించినందుకు సత్కరించారు (మొత్తం ఐదు షరతుల ప్రకారం.. ఏప్రిల్, 2020 నుండి 2021 ఫిబ్రవరి వరకు ఎబి-హెచ్డబ్ల్యూసీల్లో  చేసిన ఎన్‌సిడి పరీక్షల ఆధారంగా). హర్యానా, త్రిపుర,  ఛత్తీస్గఢ్లో 2021 మార్చి 31 వరకు ఎబి-హెచ్డబ్ల్యూసీలు హెచ్డబ్ల్యూసీ మొబైల్ యాప్‌నుసమర్థంగా ఉపయోగించుకున్నందుకు సత్కరించారు.

కేంద్ర ఆరోగ్యం  కుటుంబ సంక్షేమ కార్యదర్శి  రాజేష్ భూషణ్, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం) అదనపు కార్యదర్శి & మిషన్ డైరెక్టర్ వందనా గుర్నాని, ఎస్. వికాస్ షీల్, అదనపు కార్యదర్శి (పాలసీ), డాక్టర్ సునీల్ కుమార్, డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్,  సంధ్య కృష్ణమూర్తి, డిజి (గణాంకాల)తో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు, అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల జాతీయ ఆరోగ్య మిషన్  ప్రిన్సిపల్ సెక్రటరీలు  ఎండిలు, అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సీసీహెచ్సీ బృందాలు, కేంద్ర ఆరోగ్యం  కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, ఎఫ్ఎస్ఎస్ఐ, డిహెచ్ఆర్ ఐసిఎంఆర్,  అనుబంధ మంత్రిత్వ శాఖలు ఆయుష్, యూత్ అఫైర్స్  స్పోర్ట్స్ మినిస్ట్రీ అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశానికి డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ రోడెరికో హెచ్. ఆఫ్రిన్, డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారులు, ఇతర అభివృద్ధి భాగస్వాములు కూడా హాజరయ్యారు.

 

***



(Release ID: 1711951) Visitor Counter : 209