నీతి ఆయోగ్

భవిష్యత్ ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులకు ప్రోత్సాహం అందించేందుకు భాగస్వామ్యాన్ని ప్రకటించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ & డసాల్ట్ సిస్టమ్స్ ఫాండేషన్

Posted On: 14 APR 2021 4:03PM by PIB Hyderabad

 

భారతదేశంలో డిజిటల్ రిచ్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఇన్నోవేషన్‌ను అందించడానికి మరియు దేశవ్యాప్తంగా ఉన్న యువ ఔత్సాహికుల్లో స్టెమ్ ఆధారిత ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి సంయుక్తంగా పనిచేయడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎఐఎం), నీతి ఆయోగ్ ఈ రోజు డసాల్ట్ సిస్టమ్స్ ఫోండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఎఐఎం ప్రధాన కార్యక్రమాలలో ఒకటైన అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఎటిఎల్‌లు)  పాఠశాల విద్యార్ధుల్లో  సృజనాత్మకతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. 3 డి టెక్నాలజీస్ మరియు వర్చువల్  సాంకేతికతలో విద్య మరియు పరిశోధన యొక్క భవిష్యత్తును మార్చడానికి అంకితం చేయబడిన డసాల్ట్ సిస్టమ్స్ ఫోండేషన్..ఎటిఎల్ కార్యక్రమానికి మూడు విస్తృత రంగాలలో సహకరించడానికి సిద్ధంగా ఉంది. వాటిలో ప్రాజెక్ట్ బేస్డ్, సెల్ఫ్-పేస్డ్ లెర్నింగ్ కంటెంట్, హాకథాన్స్ మరియు ఛాలెంజిస్ మరియు దేశాల మధ్య విద్యా సహకారం మొదలయినవి ఉన్నాయి.

డసాల్ట్ సిస్టమ్స్ ఫోండేషన్ ఆ సంస్థ సిఎస్ఆర్ లక్ష్యాలలో భాగంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించి అభివృద్ధి చేసింది. డాక్యుమెంట్ చేయబడిన స్వీయ-అభ్యాస శిక్షణ మరియు బోధనకు సంబంధించిన ప్లేబుక్, దృశ్య అవగాహన కోసం తగిన వీడియోలతో వారు ఎటిఎల్‌ విద్యార్థులతో భాగస్వామ్యం చేస్తారు. వారు డిజిటల్‌గా వీటిని ఉపయోగించవచ్చు. ఈ ప్లేబుక్‌లో ఉపాధ్యాయుల కోసం బోధనా వీడియోలు ఉంటాయి. తద్వారా దీనిని నిపుణుల కనీస మద్దతుతో అమలు చేయవచ్చు. ఈ కంటెంట్  ఎటిఎల్‌లతోపాటు భారతదేశంలోని ఇతర పాఠశాలల విద్యార్ధుల ఉపయోగించుకునేందుకు అందుబాటులో ఉంటుంది.

ఈ ఎస్‌ఓఐ కింద డసాల్ట్ సిస్టమ్స్ ఫోండేషన్ ఎటిఎల్‌ల కోసం వినూత్న సవాళ్లు / హాకథాన్‌లను రూపకల్పన చేస్తుంది మరియు నిర్వహిస్తుంది. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులలో సమస్య పరిష్కార నైపుణ్యాలు, శాస్త్రీయ మరియు సాంకేతిక ఆధారిత అన్వేషణాత్మక అభ్యాస నైపుణ్యాలు మరియు ఆవిష్కరణ సంస్కృతిని ప్రోత్సహిస్తుంది.

ఈ రోజు ఎస్‌ఓఐ వర్చువల్ సెషన్లో  ఏఐఎం,నీతి  ఆయోగ్   మిషన్‌ డైరెక్టర్‌ ఆర్ రమణన్ మాట్లాడుతూ, “అటల్ ఇన్నోవేషన్ మిషన్ భాగస్వామ్యాన్ని డసాల్ట్ సిస్టమ్స్ ఫోండేషన్‌తో ప్రారంభించడం ఆనందంగా ఉంది. మిషన్ క్రిటికల్ సిస్టమ్స్ రూపకల్పన మరియు ఇంజనీరింగ్‌లో డసాల్ట్ సిస్టమ్స్ ప్రపంచ నాయకులు. ఇది మా ఎటిఎల్‌ టింకరింగ్ ల్యాబ్ విద్యార్థులకు శాస్త్రీయ పరిశోధన మరియు ఆవిష్కరణలపై  ఆసక్తిని కలిగించడమే కాకుండా ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సామర్ధ్యాన్ని ఉత్తేజపరుస్తుంది, భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న ఆవిష్కర్తలు మరియు భారతదేశం నుండి ఉద్యోగ సృష్టికర్తలు డసాల్ట్ ద్వారా లభించే ప్రపంచ స్థాయి విషయాలను యాక్సెస్ చేస్తారు. ” అని తెలిపారు.

భారతదేశంలో డసాల్ట్ సిస్టమ్స్ ఫోండేషన్, సుదర్శన్ మొగసలే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ ఎఐఎంతో తమ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ “భారతదేశంలో డసాల్ట్ సిస్టమ్స్ ఫాండేషన్ ప్రారంభమైనప్పటి నుండి మేము ఆవిష్కరణ స్ఫూర్తిని నింపడానికి అనేక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాము.  ఈ కార్యక్రమాలు మన విద్యార్ధులను భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తాయి. అటల్ ఇన్నోవేషన్ మిషన్‌తో ఉన్న అనుబంధం పాఠశాల పిల్లలలో ఆవిష్కరణ స్ఫూర్తిని పెంపొందించడానికి దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ ప్రయాణాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళుతుంది. భారతదేశంలోని పాఠశాలల్లో ఈ మార్పు తీసుకురావడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ కలకు సహకరించడం మాకు సంతోషంగా ఉంది. ” అని తెలిపారు.

ఈ భాగస్వామ్యంలో భాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల కోసం ప్రాజెక్ట్ ఆధారిత, కార్యకలాపాల ఆధారిత మరియు స్వీయ-గమన అభ్యాస విషయాలతో డస్సాల్ట్ సిస్టమ్స్ ఫోండేషన్ సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ డొమైన్ నుండి అనుభవజ్ఞులైన అధ్యాపక సభ్యులు నేర్చుకునే కంటెంట్ సృష్టించబడింది మరియు ధృవీకరించబడింది.  పాఠశాల విద్యార్థులలో ఆవిష్కరణ, ఉత్పత్తి రూపకల్పన సంస్కృతిని పెంపొందించడానికి మరియు భవిష్యత్ ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులుగా ఉండటానికి ఆసక్తిని పెంచడానికి పాఠశాలల కోసం ఉమ్మడి హ్యాకథాన్‌లు నిర్వహించబడతాయి, విద్యార్థుల సవాళ్లు మరియు దేశాల మధ్య సహకార కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ”

ఈ భాగస్వామ్యం ద్వారా ఏఐఎం మరియు డస్సాల్ట్ సిస్టమ్స్ ఫోండేషన్ సంయుక్తంగా పాఠశాలలు మరియు పాఠశాల విద్యార్థుల మధ్య సహకార సైన్స్ / సాంకేతిక శిక్షణ, నైపుణ్యం  మరియు సాంస్కృతిక చర్యల ద్వారా దేశీయ సహకారాన్ని ప్రోత్సహిస్తాయి.

***



(Release ID: 1711849) Visitor Counter : 127