రక్షణ మంత్రిత్వ శాఖ
ఆజాది కా అమృతోత్సవ్
జలియన్ వాలాబాగ్ అమరవీరులను స్మరించుకున్న ఎన్.సి.సి
Posted On:
13 APR 2021 5:50PM by PIB Hyderabad
నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌సిసి) ఈరోజు జలియన్‌వాలాబాగ్ ఊచకోతలో 1019 ఏప్రిల్ 13న ప్రాణాలు కోల్పోయి అమరులైన వారిని స్మరించుకుంది. ఈ సంస్మరణ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతున్న ఆజాదికా అమృతో మహోత్సవాల సమయంలోనే వచ్చింది. ఆజాదికా అమృత్ మహోత్సవ్‌ను దేశ 75వ స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 75 ప్రాంతాలలో ఎన్ సిసి కేడెట్లు స్వాతంత్య్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నుక్కడ్‌నాటక్‌లు, దేశభక్తి గీతాలు,ప్రసంగాలు, స్కిట్లు ప్రదర్శించారు. ఎన్‌సిసి కేడెట్లు స్వాతంత్య్ర సమరయోధులకు నివాళు లర్పించే కార్యక్రమం దేశభక్తిపూరిత వాతావరణాన్ని ఏర్పరచింది.ఎంతో మంది స్థానికులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాలు కూడా పెద్ద ఎత్తున , జలియన్‌వాలా బాగ్ అమరులకు నివాళులర్పించిన ఎన్‌సిసి అంటూ తెలియజేశాయి.
ఈ సందర్భంగా ఎన్ సిసి దేశవ్యాప్తంగా ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. ఎన్‌సిసి కేడెట్లు 75 ప్రదేశాలలో ప్లాగ్ రన్ నిర్వహించిన అనంతరం పరిశుభ్రతకు సంబంధించి న సందేశాన్ని ప్రచారం చేశారు. అలాగే ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై ప్రజలలో అవగాహన కల్పించారు. ఈ సందేశం సామాజిక మాధ్యమం ద్వారా ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ఎన్‌సిసి కేడెట్లు తో ప్రచారం అయింది.
ఎన్‌సిసి అనేది దేశంలోని యూనిఫారంతో కూడిన కీలక యువజన సంస్థ. దీనిని ఏర్పాటు చేసినప్పటి నుంచి జాతి నిర్మాణంలో ఇది చెప్పుకోదగిన పాత్ర పోషించింది. యువతను ఐక్యత , క్రమశిక్షణ పథంలో పయనించే లా చేయడంతోపాటు వేలాది మంది యువత శీల నిర్మాణంతో వారి జీవితాలను తీర్చిదిద్దుతోంది. జలసంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, డిటిటల్ చైతన్యం, స్వచ్చతా అభియాన్ వంటి విషయాలపై ప్రజలలో విస్తృత అవగాహనకల్పించడానికి ఎన్‌సిసి కేడెట్లు ప్రశంసనీయమైన కృషి చేశారు.
***
(Release ID: 1711843)
Visitor Counter : 261