వ్యవసాయ మంత్రిత్వ శాఖ
నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సిడిసి) మొదటిసారిగా డాయిష్ బ్యాంకు నుండి 68.87 మిలియన్ యూరోలు (రూ. 600 కోట్లు) రుణం పొందింది
ఈ ఒప్పందం ఇండో-జర్మన్ సంబంధాలను బలోపేతం చేస్తుంది: నరేంద్ర సింగ్ తోమర్
ఎన్‌సిడిసి మరియు ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసిసి) మధ్య అవగాహన ఒప్పందం
Posted On:
13 APR 2021 5:08PM by PIB Hyderabad
దేశంలోని సహకార సంస్థలకు రుణాలు ఇవ్వడం కోసం జర్మనీలో అతిపెద్ద బ్యాంకు అయిన డాయిస్ బ్యాంక్ నుండి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సిడిసి) 68.87 మిలియన్ యూరోల (రూ .600 కోట్ల) రుణం పొందింది. దీనికి సంబంధించి న్యూ ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ సమక్షంలో ఎన్‌సిడిసి, జర్మన్ బ్యాంక్ మధ్య ఒప్పందం కుదిరింది. మార్కెట్లతో రైతుల సంబంధాలను పెంచడానికి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఎన్‌సిడిసిల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమానికి కూడా మంత్రి అధ్యక్షత వహించారు.
భారత వ్యవసాయ రంగంతో జర్మనీకి ఆర్థిక సంబంధాలను పెంపొందించడంపై ప్రధానమంత్రి దృష్టి పెట్టారని వ్యవసాయ మంత్రి చెప్పారు. ఐసిసి, డాయిష్ బ్యాంక్‌తో ఎన్‌సిడిసి ఒప్పందాల ద్వారా దేశంలో ఏర్పాటు చేయబడుతున్న రైతు ఉత్పత్తి సంస్థలకు సులభంగా క్రెడిట్, మార్కెట్ లభిస్తుందని, ఇది చిన్న, సన్నకారు రైతులకు సహాయం చేస్తుందని ఆయన అన్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద యూరోపియన్ బ్యాంకులలో ఒకటి ఎన్‌సిడిసికి రుణాలు ఇవ్వడం ఇదే మొదటిసారి. తద్వారా భారత అభివృద్ధి, ఆర్థికవ్యవస్థపై ప్రపంచ ఆర్థిక సంస్థ యొక్క విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా కోవిడ్-19 సృష్టించిన సంక్షోభం నేపథ్యంలో రుణాలు పొందడం సవాలుగా మారిన తరుణంలో ఇది మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.
భారతదేశంలో జర్మన్ కంపెనీలు చేస్తున్న అనేక ముఖ్య వాణిజ్య కార్యకలాపాల్లో డాయిష్ బ్యాంక్ చొరవ మరొకటి. ప్రస్తుతం 1700 కి పైగా జర్మన్ కంపెనీలు భారతదేశంలో చురుకుగా పనిచేస్తున్నాయి. ఇవి సుమారు 4, 00,000 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను అందిస్తున్నాయి. ఐరోపాలో భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామి జర్మనీ మరియు భారతదేశం యొక్క మొదటి పది ప్రపంచ వాణిజ్య భాగస్వాములలో ఒకటి.
1963 లో స్థాపించబడిన ఎన్‌సిడిసి వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి ఫైనాన్స్ చట్టబద్ధమైన సంస్థ. ఇది 2014 నుండి సహకార సంస్థలకు 16 బిలియన్ యూరోల రుణాలను అందించింది. జీరో నెట్ ఎన్‌పిఎతో ఎన్‌సిడిసి దేశవ్యాప్తంగా ఉనికిని కలిగి ఉంది. 18 ప్రాంతీయ డైరెక్టరేట్‌లతో అన్ని రాష్ట్రాలకు ఇది సేవలు అందిస్తుంది.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్‌షోత్తమ్ రూపాలా, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి, డిఓసి & ఎఫ్‌డబ్ల్యు, జిఒఐ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్, ఎండి, ఎన్‌సిడిసి, శ్రీ దిలీప్ సంఘాని , అధ్యక్షుడు, ఎన్‌సియుఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1711592)
Visitor Counter : 138