మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2019-20 సంవత్సరానికి అత్యధికంగా 12.5 కోట్ల రూపాయల మేర డివిడెండ్ చెల్లించిన - ఎడ్సిల్
Posted On:
13 APR 2021 5:39PM by PIB Hyderabad
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీ రత్న కేటగిరీ-1 కి చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ - ఈ.డి.సి.ఐ.ఎల్. (ఇండియా) లిమిటెడ్, 2019-20 ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా 12.5 కోట్ల రూపాయల మేర డివిడెండ్ చెల్లించింది.
కేంద్ర విద్యా శాఖ, అదనపు కార్యదర్శి (సాంకేతిక విద్య) డాక్టర్ రాకేశ్ రంజన్ తో పాటు, విద్య మంత్రిత్వ శాఖ మరియు ఈ.డి.సి.ఐ.ఎల్. సంస్థకు చెందిన ఇతర అధికారుల సమక్షంలో, ఈ.డి.సి.ఐ.ఎల్., చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మనోజ్ కుమార్, ఈ డివిడెంట్ చెక్కును, కేంద్ర విద్యా శాఖ మంత్రి, శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' కు, ఈ డివిడెండ్ చెక్కును అందజేశారు.
ఈ సంస్థ, 2019-20 సంవత్సరంలో, 326 కోట్ల రూపాయల టర్నోవర్ తో పాటు, 56 కోట్ల రూపాయల మేర పి.బి.టి. నమోదుచేసింది.
ఈ.డి.సి.ఐ.ఎల్. సంస్థ - ఐ.సి.టి / ఐ.టి పరిష్కారాలు, ఆన్-లైన్-టెస్టింగ్, అసెస్‌మెంట్ సేవలు, సలహా సేవలు, మౌలిక సదుపాయాలు, పి.ఎం.సి, ప్రొక్యూర్‌మెంట్, విదేశాలలో విద్యా సేవలు, వంటి విద్యా సంబంధించిన వివిధ ప్రాజెక్టు యాజమాన్యం మరియు కన్సల్టెన్సీ పరిష్కారాలను అందిస్తుంది. భారతదేశంలో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ రూపొందించిన, "స్టడీ ఇన్ ఇండియా" అనే ఒక భారీ ప్రాజెక్ట్ ను ఈ సంస్థ అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఒక పెద్ద పోర్టల్, కాల్ సెంటర్, సోషల్ మీడియా ప్రచారం, బ్రాండింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ తో పాటు సదుపాయాల కేంద్రాల ఏర్పాటు వంటివి ఉన్నాయి.
*****
(Release ID: 1711589)
Visitor Counter : 144