వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆక్వా రైతులు మరియు కొనుగోలుదారులను అనుసంధానించడానికి ఒక వేదికను అందించే ఎలక్ట్రానిక్ మార్కెట్ ఈ-సంతను శ్రీ పియూష్ గోయల్ ప్రారంభించారు.


ఇది ఆదాయం, జీవనశైలి, స్వావలంబన, నాణ్యతా స్థాయిలు మరియు మన ఆక్వా రైతులకు కొత్త ఎంపికలను అందిస్తుందని శ్రీ గోయల్ చెప్పారు


రైతుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం కట్టుబడి ఉంది: శ్రీ గోయల్

Posted On: 13 APR 2021 2:43PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు ఆక్వా రైతులు మరియు కొనుగోలుదారులను అనుసంధానించడానికి ఒక వేదికను అందించే ఎలక్ట్రానిక్ మార్కెట్ ఈ-సంతను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఇది రైతులు మెరుగైన ధరను పొందటానికి మరియు ఎగుమతిదారులు అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకమైన పాత్ర పోషించడానికి అవసరమైన సామర్థ్యాన్ని పెంచి రైతుల నుండి నాణ్యమైన ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ-సంత అనే పదాన్ని వెబ్ పోర్టల్ కోసం రూపొందించారు. ఇది ఆక్వాకల్చర్‌లో రైతుల వాణిజ్యాన్ని పెంచడానికి ఉపయోగపడే ఎలక్ట్రానిక్ సొల్యూషన్. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ (ఎన్‌ఏసిఎస్‌ఏ) అనేది సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపిఈడిఏ) భారత ప్రభుత్వం మరియు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలతో రూపొందించబడిన విభాగం.


ఈ సందర్భంగా శ్రీ గోయల్ మాట్లాడుతూ " ఈ-సంత ఆదాయం, జీవనశైలి, స్వావలంబన, నాణ్యతా స్థాయిలు మరియు మా ఆక్వా రైతులకు కొత్త ఎంపికలను అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫాం వారి వ్యాపారాన్ని సాంప్రదాయకంగా  నోటి ప్రాతిపదిక జరిగే విధానం నుండి మరింత లాంఛనప్రాయంగా  చట్టబద్ధంగా మార్చడానికి ఉపయోగపడుతుంది అని అన్నారు. రైతుల జీవితాలను మరియు ఆదాయాన్ని ఈ-సంత ఈ కింది విధంగా పెంచుతుందని చెప్పారు.

- నష్టాలను తగ్గించడం
- ఉత్పత్తులు & మార్కెట్లపై అవగాహన
- ఆదాయంలో పెరుగుదల
- అక్రమ లావాదేవీలనుండి రక్షణ
- సులభతర విధానం

మార్కెట్ విభజనను రూపుమాపడానికి ఈ-సంత డిజిటల్ వంతెన అని మధ్యవర్తులను తొలగించడం ద్వారా రైతులు మరియు కొనుగోలుదారుల మధ్య ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సాధనంగా పనిచేస్తుందని మంత్రి చెప్పారు. రైతులు మరియు ఎగుమతిదారుల మధ్య నగదు రహిత, కలవడం అవసరం లేని మరియు కాగిత రహిత ఎలక్ట్రానిక్ వాణిజ్య వేదికను అందించడం ద్వారా ఇది సాంప్రదాయ ఆక్వాఫార్మింగ్‌లో విప్లవాత్మక  తెస్తుంది. "ఈ-సంత కొనుగోలుదారులు, మత్స్యకారులు మరియు చేపల ఉత్పత్తి సంస్థల ఉత్పత్తులను సమిష్టిగా ప్రచారం చేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కాబట్టి భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా ప్రజలు అందుబాటులో ఉన్న వాటిని తెలుసుకోవచ్చు మరియు భవిష్యత్తులో ఇది వేలం వేదికగా మారవచ్చు" అని ఆయన తెలిపారు. ఈ విధానం అనేక భాషలలో అందుబాటులో ఉంది. కాబట్టి స్థానిక జనాభాకు సహాయపడుతుంది.

సాంప్రదాయ ఆక్వా వ్యవసాయంలోని సవాళ్ళ శ్రీ గోయల్ మాట్లాడుతూ " రైతులు గుత్తాధిపత్యం మరియు దోపిడీని ఎదుర్కొంటున్నారని, ఎగుమతిదారులు కొనుగోలు చేసిన ఉత్పత్తులలో అస్థిరత మరియు నాణ్యత అంతరాలను ఎదుర్కొంటున్నారని ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో గుర్తించదగినది పెద్ద సమస్య అని అన్నారు. ఈ-సంత వెబ్‌సైట్ (https://esanta.gov.in) మన మత్స్యకారుల జీవన ప్రమాణాలను మారుస్తుందని, వారి జీవితాల్లో గణనీయమైన మార్పులను తెస్తుందని చెప్పారు. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ ప్రతిష్టను పెంచుతుందని  అన్నారు. ఈ పోర్టల్ దేశంలోని మరియు విదేశాలలో మత్స్యకారులు మరియు కొనుగోలుదారుల మధ్య వారధిగా పనిచేస్తుందని తెలిపారు.

ఆత్మనిర్భర్ భారత్ సాధనలో ఇది మరొక గొప్ప మార్పు అని అభివర్ణించిన మంత్రి ఇది భారతదేశం స్వావలంబన కావడానికి సహాయపడుతుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం కట్టుబడి ఉందని  తెలిపారు. ఎన్ఎసిఎస్‌ఏ యొక్క చొరవ భారతదేశంలో ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్ యొక్క నక్ష (మ్యాప్) ను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన అన్నారు.

ఈ-సంత అనేది రైతులు మరియు ఎగుమతిదారుల మధ్య పూర్తిగా కాగిత రహిత మరియు ఎండ్-టు-ఎండ్ ఎలక్ట్రానిక్ వాణిజ్య వేదిక. ఈ విధానంలో రైతులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి మరియు వారి ధరను కోట్ చేయడానికి స్వేచ్ఛ ఉంది. ఎగుమతిదారులకు వారి అవసరాలను తెలియజేయడానికి మరియు కావలసిన పరిమాణం, స్థానం, పంట తేదీలు వంటి వాటి అవసరాలను బట్టి ఉత్పత్తులను ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. ఇది రైతులు మరియు కొనుగోలుదారులను అనుమతిస్తుంది. వాణిజ్యంపై ఎక్కువ నియంత్రణ కలిగి ఉండటానికి మరియు సమాచార నిర్ణయాలు తీసుకోవడానికి వారిని అనుమతిస్తుంది. ఈ ప్లాట్‌ఫాం ప్రతి ఉత్పత్తి జాబితా యొక్క వివరణాత్మక స్పెసిఫికేషన్‌ను అందిస్తుంది మరియు ఇది ఎస్క్రో ఏజెంట్‌గా ఎన్‌ఎసిఎస్‌ఏతో ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థకు  మద్దతు ఇస్తుంది. పంట జాబితా మరియు ఆన్‌లైన్ చర్చల తరువాత ఒక ఒప్పందం కుదురుతుంది. అనంతరం ముందస్తు చెల్లింపు జరుగుతుంది మరియు అంచనా ఇన్వాయిస్ ఉత్పత్తి అవుతుంది. పంట తేదీని నిర్ణయించిన తర్వాత, కొనుగోలుదారుడు వ్యవసాయదారు వద్దకు వెళ్లి అతని సమక్షంలో ఉత్పత్తులను పండిస్తారు. పంట పూర్తయిన తర్వాత తుది గణన, పంట యొక్క పరిమాణం ధృవీకరించబడుతుంది. అనంతరం తుది మొత్తం నిర్ణయించబడుతుంది. ఆపై డెలివరీ చలాన్ జారీ చేయబడుతుంది. ఆ ఉత్పత్తి ప్రాసెసింగ్ ప్లాంట్‌కు చేరుకున్న తర్వాత తుది ఇన్‌వాయిస్ తయారవుతుంది మరియు ఎగుమతిదారు బ్యాలెన్స్ చెల్లింపు చేస్తుంది. ఈ చెల్లింపు ఎస్క్రో ఖాతాలో చూపుతుంది.ఎన్‌ఎసిఎస్‌ఎ దానిని ధృవీకరిస్తుంది మరియు తదనుగుణంగా చెల్లింపును రైతులకు విడుదల చేస్తుంది.

***



(Release ID: 1711582) Visitor Counter : 249