శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
లేహ్‌లో మేటి వ్యవసాయ సమాచార వ్యాప్తికి గాను ఎన్ఎంఎస్‌హెచ్ఈకి చెందిన ఐసీఏఆర్ బృందానికి అవార్డు
Posted On:
12 APR 2021 12:18PM by PIB Hyderabad
పరిశోధన కేంద్రం నుంచి వ్యవసాయ క్షేత్రాల వరకు మేటి వ్యవసాయ పద్ధతులు, తగిన సాంకేతిక పరిజ్ఞానం అన్నదాతలకు వ్యాప్తి చెందేలా కృషి చేసిన 'ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్' (ఐసీఏఆర్) శాస్త్రవేత్తల బృందానికి నేషనల్ అగ్రికల్చర్ మ్యాగజైన్ 'అగ్రికల్చర్ టుడే' అవార్డు లభించింది. లేహ్ వంటి మారుమూల ప్రాంతాల్లోనూ జీవనోపాధి మరియు జీవనాధార ఉత్పత్తి వ్యవస్థలను మెరుగుపరచడానికి గాను ఐసీఏఆర్ శాస్త్రవేత్తల బృందం చేసిన కృషికి గాను వారికి ఈ అవార్డు లభించింది.
రైతులకు శిక్షణా కార్యక్రమాలు ..
నేషనల్ మిషన్ ఆన్ సస్టైనింగ్ హిమాలయన్ ఎకోసిస్టమ్ (ఎన్‌ఎంఎస్‌హెచ్ఈ) కింద ఏర్పాటు చేసిన హిమాలయ వ్యవసాయంపై టాస్క్‌ఫోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.అరుణాచలం నేతృత్వంలోని బృందం మరియు లే కాంపోనెంట్ కో-ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఎం. రఘుబన్షి ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, కలుపు నిర్వహణకు కొత్త పంటలు మరియు రకరకాల అంచనాలను అన్నదాతలకు పరిచయం చేస్తూ విశేషంగా కృషి చేస్తున్నారు. దీనికి తోడు అసోసియేట్ సైంటిస్ట్ డాక్టర్ అనురాగ్ సక్సేనాతో పాటు సాంకేతిక సహాయక సభ్యులు ఎంఎస్ స్టాన్జిన్ లాండోల్, డాక్టర్ ఎనోచ్ స్పాల్బార్, జిగ్మత్ స్టాన్జిన్లతో కూడిన ఈ బృందం రైతులకు అందుబాటులో ఉన్న శాస్త్రీయ సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి గాను ఒక కిసాన్ మేళా, వర్క్‌షాప్‌తో పాటు మొత్తం 38 శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ (డీఎస్‌టీ) చేపట్టిన ఎన్ఎంఎస్‌హెచ్ఈ కార్యక్రమము సహకారంతో లేహ్ ప్రాంతంలో స్థిరమైన, వాతావరణ-స్థితిస్థాపకతతో కూడిన వ్యవసాయాన్ని చేపట్టేందుకు వీలుగా పలు రకాల కార్యక్రమాలను నిర్వహించారు.
ఆరు అంశాలపై విశేషంగా కృషి..
కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ చేపట్టిన వాతావరణ మార్పు కార్యక్రమంలో భాగంగా 'నేషనల్ మిషన్ ఆన్ సస్టైనింగ్ హిమాలయన్ ఎకోసిస్టమ్స' (ఎన్ఎంఎస్ హెచ్ఈ) కింద హిమాలయన్ వ్యవసాయంపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడమైంది. ఇది డేటాబేస్ అభివృద్ధి, పర్యవేక్షణ, బలహీనత అంచనా, అనుకూల పరిశోధన, పైలట్ అధ్యయనాలు, తగిన విధంగా సామర్థ్యం పెంపు/ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం వంటి వంటి ఆరు అంశాలపై పని చేస్తోంది. హిమాలయ వ్యవసాయంపై టాస్క్‌ఫోర్స్ సభ్యులు సమాచార వ్యాప్తి, సామర్థ్యం పెంపొందించడం, రైతుల శిక్షణపై చేసిన ఎన్‌ఎంఎస్‌హెచ్ఈ కృషి లేహ్ ప్రాంతంలోని జీవనాధార ఉత్పత్తి వ్యవస్థలు, ఉత్పత్తి వ్యవస్థల్తో జీవనోపాధిని, తగిన లాభదాయకతను మెరుగుపరచడంలో సహాయపడింది. ఐసీఎంఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్న ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.రఘువంశీ బృందం తరఫున ఈ అవార్డు అందుకున్నారు. అగ్రికల్చర్ టుడే గ్రూప్ వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ -2021 అవార్డు వేడుకలో డాక్టర్ ఎం.రఘువంశీ అవార్డును అందుకున్నారు.
***
(Release ID: 1711499)
Visitor Counter : 195