ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
85వ రోజున 10 కోట్ల కోవిడ్ టీకా డోసుల మైలురాయి దాటిన భారత్
అత్యంత వేగంగా 10 కోట్ల టీకాలిచ్చిన దేశం భారత్
ఈరోజు సాయంత్రం 8 వరకు 29 లక్షల డోసులు
Posted On:
10 APR 2021 8:51PM by PIB Hyderabad
కోవిడ్ ను అరికట్టటంలో తీసుకుంటున్న చర్యల్లో భారత్ మరో కీలకమైన మైలురాయి దాటింది. నేటికి పది కోట్ల టీకా డోసుల పంపిణీ చేయగలిగింది. సాయంత్రం 8 గంటకవరకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన టీకాల సంఖ్య 10,12,84,282 కు చేరింది. టీకాలు అందుకునేవారి పరిధిలోకి 45 ఏళ్ళు పైబడినవారందరినీ చేర్చటంతోబాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వారి కార్య స్థలాల్లోనే టీకాలిచ్చే ఏర్పాటు చేయటం లాంటి చర్యలు సానుకూల ఫలితాలిచ్చాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ సాగించిన ఈ కార్యక్రమం విజయపథంలో సాగుతోంది. అదే సమయంలో చికిత్స పరంగా తీసుకుంటున్న చర్యలవలన కూడా ప్రపంచంలోనే అతి తక్కువ కోవిడ్ మరణాలు (1.28%) నమోదవుతున్న దేశంగా భారత్ తన ప్రత్యేకత చాటుకోగలిగింది. టీకాలమీద కొంతమంది ఉద్దేశపూర్వకంగా సాగించిన ప్రతికూల ప్రచారాన్ని సైతం ప్రక్కకుబెట్టి ప్రజలు ముందుకువచ్చేలా ప్రభుత్వం విశ్వాసం నెలకొల్పింది. కోవిడ్ 19 సోకటానికి అవకాశమున్నవారందరినీ కాపాడే లక్ష్యంతో రూపొందించిన కార్యాచరణ ప్రకారం టీకాలివ్వటం కొనసాగింది. ప్రభుత్వం అత్యంత ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది.
10 కోట్ల స్థాయికి అత్యంత వేగంగా చేరుకున్న దేశంగా కూడా భారత్ తన ప్రత్యేకత చాటుకుంది. అమెరికా, చైనా దేశాలతో పోల్చుకున్నప్పుడు అమెరికా 89 రోజుల్లోనును, చైనా 103 రోజుల్లోను 10 కోట్ల టీకాల మైలురాయి దాటగలిగిన విషయం గుర్తు చేసుకోవటం అవసరం.
85వ రోజు నాటికి సాధించిన ఫలితాలను స్థూలంగా ఇతరదేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశంలో రోజువారీ సగటు కోవిడ్ టీకాల సంఖ్య ఎక్కువగా ఉంది. అమెరికా 85 రోజులలో 9 కోట్ల 20 లక్షల 90 వేలమందికి టీకాలివ్వగలిగింది. చైనాలో అయితే 85 రోజుల్లో 6 కోట్ల 14 లక్షల 20 వేలమంది టీకాలు తీసుకున్నారు.
15,17,260 శిబిరాల ద్వారా సాధించిన10 కోట్ల 12 లక్షల టీకా డోసులలో 90,03,060 డోసులు ఆరోగ్య సిబ్బంది తీసుకున్న మొదటి డోసులు, 55,06,717 డోసులు ఆరోగ్య సిబ్బంది రెండో డోసులు, 99,39,321 డోసులు కోవిడ్ యోధుల మొదటి డోసులు, 47,28,966 డోసులు కోవిడ్ యోధుల రెండో డోసులు, 3,01,14,957డోసులు 45-59 ఏళ్ల మధ్య వారు తీసుకున్న మొదటి డోసులు, 6,37,768 డోసులు వారు తీసుకున్న రెండో డోసులు, 3,95,64,741డోసులు 60 ఏళ్ళు పైబడ్డవారి మొదటి డోసులు, 17,88,752 డోసులు వారి రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ వయసువారు
|
60ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
90,03,060
|
55,06,717
|
99,39,321
|
47,28,966
|
3,01,14,957
|
6,37,768
|
3,95,64,741
|
17,88,752
|
8,86,22,079
|
1,26,62,203
|
టీకాల కార్యక్రమం మొదలైన 85 వ రోజైన నేటి సాయంత్రం 8 గంటలవరకు 29,65,886 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో 26,31,119 మంది లబ్ధిదారులు మొదటీ డోస్ తీసుకున్నవారు కాగా 3,34,767 మంది రెండో డోస్ లబ్ధిదారులు. ఇది తాత్కాలిక నివేదిక కాగా, రాత్రిపొద్దుపోయాక తుదినివేదిక అందవచ్చునని భావిస్తున్నారు.
తేదీ: ఏప్రిల్ 10, 2021 (85వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ వయసువారు
|
60ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
12,581
|
26,051
|
66,137
|
68,029
|
17,32,688
|
52,191
|
8,19,713
|
1,88,496
|
26,31,119
|
3,34,767
|
***
(Release ID: 1710954)
Visitor Counter : 179