సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రాయోజిత పథకం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద మధ్యప్రదేశ్‌కు చెందిన ఓబీసి విద్యార్థులకు 2020-21 సంవత్సరపు కేంద్ర ప్రభుత్వ సాయం విడుదల
Posted On:
09 APR 2021 4:14PM by PIB Hyderabad
కేంద్రం ప్రాయోజిత పథకం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓబీసి విద్యార్థులకు, 2020-21 సంవత్సరానికి గాను రూ ముప్పై తొమ్మిది కోట్లు ఎనభై ఆరు లక్షల
మేర సహాయాన్ని విడుదల చేసింది. అంతకుముందు కేంద్రం జూన్ 12, 2020న తాత్కాలిక ప్రాతిపదికన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.ఇరవై కోట్ల సహాయాన్ని విడుదల చేసింది. 22 సెప్టెంబర్, 2020న కేంద్రం నుంచి రూ.పంతొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల సొమ్ము ప్రభుత్వానికి విడుదలయింది. దీంతో 2020-21 సంవత్సరంలో ఖర్చు కోసం మొత్తం రూ.డెబ్బై తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షలు (నోషనల్ కేటాయింపు వరకు) మేర సొమ్ము మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చింది. భారత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఎంపిక చేసిన లబ్ధిదారులైన విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్‌షిప్ మొత్తాన్ని డీబీటీ విధానం ద్వారా మాత్రమే పంపిణీ చేస్తారు. నగదు చెక్‌ల ద్వారా, ఇతర పంపిణీ విధానాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
***
(Release ID: 1710758)
Visitor Counter : 168