ఆర్థిక మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ , ప్లీనరీ , ఫైనాన్షియల్ కమిటీ( ఐఎంఎఫ్‌సి) సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
Posted On:
08 APR 2021 7:40PM by PIB Hyderabad
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ , ఐఎంఎఫ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఫైనాన్షియల్ కమిటీ వర్చువల్ స్ప్రింగ్ సమావేశాలు- 2021లో కేంద్ర ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఐఎంఎఫ్‌కు చెందిన 190 సభ్య దేశాల గవర్నర్లు, ప్రత్యామ్నాయ గవర్నర్లు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరక్టర్ గ్లోబల్ పాలసీ అజెండా (జిపిఎ), బోల్సటరింగ్ రికవరీ, కౌంటరింగ్ డైవర్జెన్స్ ఇతివృత్తంగా ఈ సమావేశంలో చర్చలు సాగాయి. ఐఎంఎఫ్‌సి సభ్యులు కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకున్న
చర్యలు , ఆర్థిక రికవరీకి వీలు కల్పించేందుకు తీసుకున్న చర్యలను సమావేశం దృష్టికి తెచ్చారు.
అభివృద్ధిని వేగవంతం చేసేందుకు తక్కువ కార్బన్ కలిగిన ఆర్ధిక వ్యవస్థకు మారాల్సిందిగా జిపిఎ చేసిన సూచనను మార్కెట్‌లు, ఆర్ధిక వ్యవస్థలు రూపొందుతున్న తీరు, తక్కువ రాబడి కలిగిన ఆర్ధిక వ్యవస్థల నేపథ్యంలోంచి చూడాలని
ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మాలా సీతారామన్ నొక్కి చెప్పారు.
తక్కువ కార్బన్ స్థాయిల ఆర్ధిక వ్యవస్థకు మారడానికి పడే ఆర్థిక పరివర్తన భారం, ఆయా దేశాలకు ఎక్కువగా ఉంటుందని, సానుకూల లాభాలు స్వల్పకాలంలో రాకపోవచ్చని ఆమె అన్నారు. దీనికి సంబంధించిన అంశాలపై దృష్టి అంతా సమానత్వానికి సంబంధించి అంగీకరించిన సూత్రాలు, వాతావరణ కార్యాచరణపై బాధ్యతకు అనుగుణంగా ఉండాలన్నారు.
కీలక ప్రాధాన్యత కోవిడ్ మహమ్మారిని అంతం చేయడం, ప్రపంచవ్యాప్తంగా వాక్సిన్ అందుబాటులోకి వచ్చేట్టు చేయడం, వైద్య పరమైన పరిష్కారాలకు పూచీ ఉండాలన్న ఐఎంఎఫ్ అభిప్రాయంతో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏకీభవించారు.
ఇండియాలో ప్రపంచంలోనే అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నట్టు ఐఎంఎఫ్ కమిటికి తెలియాపరు. 2021 ఏప్రిల్ నాటికి 83.1 మిలియన్ డోస్‌లు వేసినట్టు తెలిపారు. అలాగే ఇండియా భారతదేశంలో తయారైన కోవిడ్ -19 వాక్సిన్ కు సంబంధించి 65 మిలియన్ డోసులను 80 దేశాలకు పంపినట్టు ఆమె తెలిపారు . ఇందులో 10 మిలియన్ డోస్‌లు గ్రాంటుగా ఉన్నాయన్నారు.
ఐఎంఎఫ్‌సి సంవత్సరానికి రెండు సార్లు సమావేశమౌతుంది. ఒకసారి ఫండ్ -బ్యాంక్ కు సంబంధించి ఏప్రిల్‌లో జరిగే సమావేశాలు కాగా రెండోది అక్టోబర్‌లో జరిగే సమావేశం. ఈ కమిటీ అంతర్జాతీయ ఆర్ధికవ్యవస్థపై ప్రభావం చూపే అంశాలను చర్చించి, ఐఎంఎఫ్‌కు అది చేయవలసిన పనిపై సూచనలు చేస్తుంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ప్రస్తుత ఏప్రిల్ సమావేశం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
***
(Release ID: 1710755)
Visitor Counter : 221