పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
బొగ్గు క్షేత్రాల సర్వే కోసం సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ సంస్థ కు డ్రోన్ వినియోగానికి అనుమతి
డ్రోన్లను - మ్యాపింగ్ మరియు సర్వేయింగ్ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఉపయోగించాలి
Posted On:
08 APR 2021 6:14PM by PIB Hyderabad
కోల్ ఇండియా సంస్థకు చెందిన బొగ్గు క్షేత్రాలు ఉన్న ప్రాంతాల్లో సర్వే చేయడానికి సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ సంస్థ (సి.ఎం.పి.డి.ఐ) కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.సి.ఏ) మరియు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డి.జి.సి.ఎ) షరతులతో కూడిన మినహాయింపు మంజూరు చేశాయి. ఈ అనుమతి ప్రకారం, కోల్ ఇండియా సంస్థకు చెందిన బొగ్గు క్షేత్రాలు ఉన్న ప్రాంతాల్లో, యు.ఎ.వి. ఆధారిత ఆప్టికల్, లిడార్ మరియు థర్మల్ పేలోడ్స్, వాల్యూమెట్రిక్ కొలత మరియు తనిఖీలను ఉపయోగించి మ్యాపింగ్ మరియు సర్వేయింగ్ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి డ్రోన్లను మోహరిస్తారు.
షరతులతో కూడిన ఈ మినహాయింపు, లేఖ జారీ చేసిన తేదీ నుండి 2022 ఏప్రిల్ 04 వరకు లేదా డిజిటల్ స్కై ప్లాట్‌ఫాం (ఫేజ్ -1) యొక్క పూర్తి కార్యాచరణ వరకు, వీటిలో ఏది ముందు జరిగితే అంతవరకూ చెల్లుతుంది. దిగువ పేర్కొన్న అన్ని షరతులు మరియు పరిమితులు ఖచ్చితంగా అమలు చేయడానికి కట్టుబడి ఉంటేనే ఈ మినహాయింపు చెల్లుతుంది. ఏదైనా షరతును ఉల్లంఘించి నట్లయితే, ఈ మినహాయింపు రద్దవుతుంది.
కోల్ ఇండియా సంస్థ కు చెందిన బొగ్గు క్షేత్రాల ప్రాంతంలో యు.ఎ.వి. ఎగరడానికి సి.ఎం.పి.డి.ఐ. అనుసరించవలసిన ప్రామాణిక విధానం (ఎస్.ఓ.పి) ఈ క్రింది విధంగా ఉంది:
1. పని మొదలు పెట్టడానికి ముందే, 2021 యు.ఏ.ఎస్. నిబంధనల కింద, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి మినహాయింపు పొందాలి.
2. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల్లో పేర్కొన్న విధంగా, నిర్వహణ ఆంక్షలను పాటించాలి.
3. షరతులతో కూడిన అనుమతులు లేదా మినహాయింపులపై - ఎమ్.ఓ.సి.ఏ. / డి.జి.సి.ఏ. / ఎమ్.ఓ.డి. / ఐ.ఏ.ఎఫ్. / ఏ.ఎల్. / రాష్ట్రం / జిల్లా / పౌర అధికార యంత్రాంగం వంటి వివిధ సంస్థలు / విభాగాల నుండి సమ్మతి పొందాలి. కార్యకలాపాలను ప్రారంభించే ముందు తృతీయ పక్ష (థర్డ్-పార్టీ) బీమా అమలులో ఉండాలి.
4. ఎస్.ఓ.పి. కి కట్టుబడి ఉండాలి; అయితే ఇది మారవచ్చు; ఏవైనా అనివార్యమైన పరిస్థితులు తలెత్తితే, వాటిని వ్రాతపూర్వకంగా నమోదు చేయడం జరుగుతుంది.
5. ఎవరైనా వ్యక్తి లేదా ఆస్తి కి ఏదైనా నష్టం జరిగితే, సురక్షితమైన ఆపరేషన్ మరియు చట్టపరమైన సమస్యలకు, సి.ఎం.పి.డి.ఐ. సంస్థ బాధ్యత వహించాలి.
6. ఈ కార్యక్రమల నుండి ఉత్పన్నమయ్యే లేదా సంబంధించి ఏదైనా ప్రాణం / ఆస్తి కి ప్రత్యక్ష, పరోక్ష, యాదృచ్ఛిక, లేదా పర్యవసానంగా సంభవించే హాని లేదా నష్టానికి డి.జి.సి.ఏ. మరియు ఎమ్.ఓ.సి.ఏ. బాధ్యత వహించవు.
7. కోల్ ఇండియా సంస్థ కు చెందిన బొగ్గు క్షేత్రాల ప్రాంతంలో, యు.ఎ.వి. ఎగరడానికి వీలు కల్పిస్తూ, ఈ ఎస్.ఓ.పి. ప్రత్యేకంగా సి.ఎం.పి.డి.ఐ.కి. మాత్రమే చెల్లుతుంది.
8. పైన పేర్కొన్న ఆమోదం ప్రస్తుతం అమలులో ఉన్న పౌర విమానయాన అవసరాలు (సి.ఏ.ఆర్) మరియు డి.జి.సి.ఎ. ఎప్పటికప్పుడు జారీ చేసిన వివిధ ప్రకటనల్లోని నిబంధనలకు లోబడి ఉంటుంది. ఈ ఆమోదం చెల్లుబాటు అయ్యే సమయంలో ఎప్పుడైనా ఏదైనా ఉల్లంఘనలు కనుగొన్నట్లైతే, అప్పుడు, ఎటువంటి కారణాలు చెప్పకుండా, ఈ ఆమోదాన్ని మార్చవచ్చు, నిలిపివేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు.
బహిరంగ ప్రకటన / సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
*****
(Release ID: 1710601)
Visitor Counter : 182