నీతి ఆయోగ్

ప్రజా వ్యవస్థల్లో స‌రికొత్త ఆవిష్కరణల కోసం 'సిప్స్'‌‌తో చేతులు క‌లిపిన అటల్ ఇన్నోవేషన్ మిషన్

Posted On: 06 APR 2021 6:09PM by PIB Hyderabad

ఇత‌ర అంశాల‌తో పాటుగా ప్రభుత్వ సేవలను మెరుగు పరచడానికి.. ప్రజా వ్యవస్థలలో ఆవిష్కరణల డేటాబేస్‌ను అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకత ఎకోసిస్ట‌మ్‌ను బలోపేతం చేయడానికి గాను.. అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం‌), నీతి ఆయోగ్, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్సిన్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ (సిప్స్‌) క‌లిసి ప‌ని చేయ‌నున్నాయి. ఈ రెండు సంస్థ‌లు ఇందుకు సంబంధించి స‌హ‌కారాన్ని ప్ర‌క‌టించాయి. దీనికి సంబంధించి ఏఐఎం మ‌రియ సిప్స్ సంస్థ‌ల మధ్య 'స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్' (ఎస్ఓఐ) సంతకం చేయబడింది. ఈ ఎస్ఓఐ ఉద్దేశ్యం ఏమిటంటే.. ఏఐఎం యొక్క విజ్ఞానం మరియు అనుభవంతో.. సిప్స్‌కు ఉన్న రీచ్‌ను చేరుకోవడం. త‌ద్వారానే వివిధ ప్రజా వ్యవస్థల పరిధిలో ఉన్న ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి సంయుక్తంగా పని చేయ‌డం. స్థానిక పరిపాలనతో సమన్వయం చేయడం ద్వారా స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను అట్టడుగు స్థాయిలకు ప్రాప్యత చేయడానికి మరియు ప్రోత్సహించడానికి ఏఐఎం మరియు సిప్స్ మధ్య ఈ స‌రికొత్త సహకారం సహాయపడుతుంది. సిప్స్‌ సలహాదారుల సహకారంతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ద్వారా పౌరులకు సేవలను అందించడంలో స్థానిక పరిపాలన ఎదుర్కొంటున్న సవాళ్లను స్టార్టప్‌ల ద్వారా పరిష్కరించేలా చూస్తారు. ఎస్ఓఐ ప్రకారం వినూత్న ఉత్పత్తులు మరియు పరిష్కారాల గురించి అవగాహన కల్పించడానికి ఏఐఎం మరియు సీప్స్‌ సంయుక్తంగా జిల్లా, స్థానిక స్థాయి పరిపాలన అధికారులతో రౌండ్ టేబుల్స్ స‌మావేశాల‌ను నిర్వహిస్తాయి. వివిధ ‌సేకరణ చుట్టూ ప్రామాణిక ప్రక్రియలు, విధానాలను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడ‌డం, తద్వారా సంబంధిత వినూత్న పరిష్కారాల సేకరణ, అమలు వేగవంతం చేసేలా కూడా కృషి చేస్తారు.
ఏఐఎం 'ఈ-ఎగ్జిబిషన్ల' శ్రేణిని నిర్వహించడం, హోస్ట్ చేయడం ఆవిష్కరణలను ప్రదర్శించడానికి వినూత్న మరియు సంబంధిత స్టార్టప్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది ప్రజా పరిపాలన మరియు సేవా డెలివరీ విధానాలను మార్చడానికి తదుపరి దశగా మారుతుంది. ఇందులో భాగంగా పైలట్లు, ఉత్పత్తి మెరుగుదల, మార్కెట్ పరిశోధనలను ప్రారంభించడానికి స్టార్టప్‌లు మరియు అధికారుల మధ్య స‌మావేశాల‌ను కూడా సులభతరం చేయనున్నారు. విద్యార్థులలో వినూత్న అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి అట్టడుగు స్థాయిలో ఉపాధ్యాయులు/ సలహాదారుల సామర్థ్యాన్ని పెంపొందించడం ప్ర‌స్తుత ప‌రిస్థితిలో అత్య‌వ‌స‌రం. ఇన్నోవేషన్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను (ఐఎల్‌ఎంఎస్) సంయుక్తంగా సృష్టించడం ద్వారా దీనిని సాధించవచ్చు. ఈ భాగస్వామ్యం ఏఐఎం ప్రారంభించిన కార్యక్రమాలను రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ప్రోత్సహించడానికి మరియు రాష్ట్రాలతో అనుసంధానానికి సహాయపడుతుంది. ఇది జిల్లా స్థాయిల‌లో ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో ఏఐఎం మెంటర్ ఆఫ్ చేంజ్ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తుంది. లబ్ధిదారులు ఏఐఎం చొరవ యొక్క శిక్షణా కార్యక్రమాల కోసం సిప్స్‌ సౌకర్యాలను, గ్రామీణ ఆవిష్కరణలపై శ్వేతపత్రాల కోసం సిప్స్‌ పరిశోధన సామర్థ్యాన్ని కూడా ఉపయోగించుకోగలుగుతారు. వర్చువల్ విధానంలో ఎస్ఓఐ పై సంతకం సందర్భంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ ఆర్ రమణన్ మాట్లాడుతూ “సిప్స్‌తో ఈ సహకారం కొన్ని విధానాల‌లో స‌రికొత్త మార్గం విచ్ఛిన్నం చేసేందుకు దోహ‌దం చేస్తుంది, ఎందుకంటే ఇది అట్టడుగు స్థాయిలలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత గురించి అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది. పబ్లిక్ డెలివరీ వ్యవస్థలలో దాని శోషణ మరియు అమలు ఎంతో మేలు చేస్తుంది. సిప్స్‌తో ఇటువంటి కార్యక్రమాలు మరియు భాగస్వామ్యాలు చాలా అవసరం. జిల్లా మరియు గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి మరియు సమాజానికి పెద్దగా ఉపయోగపడతాయి” అని అన్నారు. సిప్స్ డైరెక్టర్, సి. అచలేందర్ రెడ్డి ఈ సంద‌ర్భంగా త‌న  ఆలోచనలను పంచుకుంటూ.. ఏఐఎం నీతి ఆయోగ్ మ‌రియు సిప్స్‌-ఆస్కీ స‌హ‌కారం ఒక వినూత్న‌మైన ఎకోసిస్ట‌మ్‌ను నిర్మించడాని త‌ద్వారా ప్రజా ఆవిష్కరణలను మెరుగుపరచడం, ఏఐఎం కార్యక్రమాలు మరియు ఏఐఎం లబ్ధిదారులకు వివిధ కార్యక్రమాలపై మద్దతు ఇవ్వడానికి దోహ‌దం చేస్తుంది అని అన్నారు. "ప్రజా ఆవిష్కరణల‌ను పెంచేలా దిశ‌గా అనుసంధాన‌త‌, భాగ‌స్వామ్యం మరియు అంత‌ర్ సంస్థ‌ల జట్ల బ‌హుపాత్ర‌ సహకారం త‌గు విధంగా దోహదపడుతోంది అని అనేందుకు ఇటీవ‌లి కాలంలో అనేక ఆధారాలు పెరుగుతూ వ‌స్తున్నాయి. పబ్లిక్ ఇన్నోవేషన్ ప్రక్రియలలో వేర్వేరు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ‌ల‌ ప్రమేయం సమస్య యొక్క అవగాహనను మెరుగుపరుస్తుంది. చేతిలో ఉన్న సవాళ్లు, స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకోవడాన్నిమెరుగుపరుస్తుంది. కొత్త ఆలోచనలు మరియు ప్రతిపాదనలను ముందుకు తెస్తుంది. కొత్త మరియు సాహ‌సోపేత‌మైన‌ పరిష్కారాల ఉమ్మడి యాజమాన్యాన్ని కూడా ఇది  నిర్మించగలదు” అని ఆయ‌న అన్నారు.
                               

*****



(Release ID: 1710036) Visitor Counter : 171