వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2020-21 రబీ మార్కెటింగ్ సీజన్లో ఇప్పటిదాకా 3.49లక్షల టన్నులకుపైగా గోధుమల సేకరణ!


4,45,520మంది రైతులకు ప్రయోజనం

ఖరీప్ సీజన్లో 695.23లక్షల టన్నుల ధాన్యంసేకరణ

4,75,354.54 టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజల సేకరణతో 2,97,219మంది రైతులకు ప్రయోజనం

రూ. 26,719.51కోట్ల విలువైన 91,89,378 పత్తి బేళ్ల సేకరణతో18,86,498మంది రైతులకు ప్రయోజనం

Posted On: 06 APR 2021 7:56PM by PIB Hyderabad

   2021-22వ సంవత్సరం రబీ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి గోధుమల సేకరణ ఇటీవలే ప్రారంభమైంది. హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజారత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కనీస మద్దతు ధర ప్రాతిపదికగా గోధుమల సేకరణ మొదలైంది. ఇప్పటివరకూ, అంటే, ఈ నెల 5వ తేదీ వరకూ 3.49లక్షల మెట్రిక్ టన్నులమేర గోధుమలను సేకరించారు. కనీస మద్దతు ధర విలువ ప్రకారం రూ. 690.82కోట్ల రూపాయల విలువైన ఈ గోధుమల సేకరణతో 4,45,520మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.  

2020-21వ సంవత్సరపు ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియ ఆయా రాష్ట్రాల్లో సాఫీగా సాగుతోంది. 2021 ఏప్రిల్ 5వ తేదీ నాటికి 695.23లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అంతకు ముందు సంవత్సరంలో ఇదే సమయంలో  622.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో జరిగిన ఈ సేకరణతో ఇప్పటికే దాదాపు 10.29 కోట్లమంది రైతులకు ప్రయోజనం కలిగింది. కనీసమద్దతు ధర విలువ ప్రకారం  ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో 1,31,247.46 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ జరిగింది.

https://ci5.googleusercontent.com/proxy/RtHOp1gJ7sZ2c0pha8Y3C7auA7ENFsQL1Ci0Sn1-Hj_JKxtfRGbKDXR8QC3va1WozVRpW_R2tWG6W5DyKmBLezv_0JtDJ0TQ4g66IF_bXGpOLtWiHgkyMua15A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001GBM4.png

https://ci6.googleusercontent.com/proxy/5RtehV-hweBiP7nQ616gLRQ38YC2y96F5Y40gYFzEhH7sJJa7Uc8nLAxEpdQTb08tRWdEKlF95sjo2SapxHzYW40ju2vYblFDvtkcV0gz1JftftxnV5om4UfBg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002T27M.png https://ci6.googleusercontent.com/proxy/dua1kIA9hKcDiY16XJS0q7wbCg7V1WD2oDtIR3_a-AvYPGpf0Ny6pYtUqzWRzlWLSc3xWS23ZvWFTmeRzGHyAHCKTQGx9UNkiTS4IvqOI3GnU92TNEBS1HLNoA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0035SHC.png

  ఇక ఆయా రాష్ట్రాలనుంచి అందిన ప్రతిపాదనల మేరకు 2020-21వ సంవత్సరపు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో, 2021వ సంవత్సరపు రబీ మార్కెటింగ్ సీజన్లో 107.08 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు, నూనెగింజల సేకరణకు ఆమోదం లభించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ధరల మద్దతు పథకాల కింద ఈ సేకరణ ప్రక్రియకు అనుమతి మంజూరైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో లక్షా 23వేల టన్నుల కొబ్బెర కురిడీల సేకరణకు కూడా ఆమోదం లభించింది. 2020-21వ సంవత్సరపు ఫెయిర్ ఆవరేజ్ క్వాలిటీ (ఎఫ్.ఎ.క్యు.) గ్రేడ్ పప్పు దినుసులు, నూనెగింజల పంటల సేకరణకు సంబంధించి మిగిలిన ఇతర రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి అందిన ప్రతిపాదనల మేరకు అనుమతి ఇస్తారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నోటిఫై చేసిన సాగు కాలంలో పంటల మార్కెట్ ధర కనీస మద్దతు ధరకంటే తక్కువగా ఉన్న పక్షంలో కనీస మద్దతు ధరపై రిజిస్టరైన రైతులనుంచి నేరుగా ఈ సేకరణ జరుగుతుంది. ఆయా రాష్ట్రాలు నియమించిన ఏజెన్సీల ద్వారా కేంద్ర నోడల్ ఏజెన్సీలు ఈ సేకరణ ప్రక్రియ నిర్వహిస్తాయి.

   ఈ నెల 5వ తేదీ నాటికి వివిధ రాష్ట్రాలనుంచి 4,75,354.54మెట్రిక్ టన్నుల పెసలు, మినుములు, కంది, ఎర్ర కంది పప్పు, వేరుశనగ కాయలు, ఆవాలు, సోయాబీన్ పంటలను  ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా సేకరించింది. కనీస మద్దతు ధర విలువ ప్రకారం రూ. 2,512.79కోట్ల విలువైన ఈ పంటలను సేకరించారు. దీనితో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 2,97,219 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. 2020-21సంవత్సరపు ఖరీఫ్, 2021వ సంవత్సరపు రబీ సీజన్ల కింద ఈ పంటల సేకరణ ప్రక్రియ జరిగింది.

  అలాగే, ఈ నెల 5వ తేదీ నాటికి, కనీస మద్దతు ధర ప్రాతిపదికన రూ. 52.40కోట్ల విలువైన 5,089 మెట్రిక్ టన్నుల కొబ్బెర కురిడీల సేకరణ కూడా జరిగింది. ఈ సేకరణతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 3,961మంది రైతులకు ప్రయోజనం కలిగింది. ఇక, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు అందుబాటులోకి వచ్చే సమయాన్ని బట్టి ఆయా రాష్ట్రాల నిర్ణయం మేరకు సదరు పంటల సేకరణ ప్రక్రియకోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

 

https://ci4.googleusercontent.com/proxy/L7gNEvMKlMvOyFNNrbgLh3Sosm1uW0t4xSAuwK3vJ9R-jKpgy2JgbkvhnpJVvIUxq8FGdaqUup5MRdzo7dvJEoLxcHHm9QMMfIVSMvYPL2hGwji7Y2eL_19DQg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0042IWW.png https://ci4.googleusercontent.com/proxy/QO_WBOKuvVN13_JuLeUk4w-Hj5NDMH1u8nfGb7HeAITxKo1EzI8GS6wxRMmJBb5em-zz3h7y1jGRH6qE5FmvtqNMmcsVjnEx6nNsA7POxBQn1mMJ8vO4aMY5fw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005NCNY.png

 

 పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో కనీస మద్దతు ధర ప్రాతిపదికపై గింజపత్తి సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఈ నెల 5వ తేదీ నాటికి 91,89,378 పత్తి బేళ్లను సేకరించారు. రూ. .26,719.51కోట్ల విలువైన ఈ గింజ పత్తి సేకరణతో 18,86,498మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.

 

https://ci5.googleusercontent.com/proxy/qvfdB7KcEbdL2Nuw87WuqU9Hf74qmvXIfnTlO5Yr9vCJNXIknFvQ7AWVxxZY2NQbbAxF5hosfzmGzIseUEgbjm34apyrLGYxZ0BXiSUI-iNvsKz7MjYQQmJBtQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006702K.png

 

******



(Release ID: 1710017) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi , Punjabi