భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ప్రిన్సిపల్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రిన్సిపల్ ట్రస్టీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రిన్సిపల్ రిటైర్‌మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లను కొనుగోలు చేసేందుకు సుందరం అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌కు సీసీఐ అనుమతి
Posted On:
06 APR 2021 5:59PM by PIB Hyderabad
ప్రిన్సిపల్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రిన్సిపల్ ట్రస్టీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రిన్సిపల్ రిటైర్‌మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లను సుందరం అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతినిచ్చింది.
ప్రిన్సిపల్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఏఎంపీఎల్), ప్రిన్సిపల్ ట్రస్టీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (పీటీసీపీఎల్), ప్రిన్సిపల్ రిటైర్‌మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఆర్‌ఏపీఎల్)లు జారీ చేసిన, చెల్లించిన మొత్తం ఈక్విటీ షేర్లను సుందరం అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌ఏఎంసీ) దక్కించుకోవడానికి ఈ ప్రతిపాదిత కలయిక అనుమతినిస్తుంది. ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్ (పీఎంఎఫ్) పథకాలు ఈ కొనుగోలులో భాగంగా సుందరం మ్యూచువల్ ఫండ్ (ఎస్‌ఎంఎఫ్)కు బదిలీ అవుతాయి. పీఎంఎఫ్ పథకాల ధర్మకతృత్వం, నిర్వహణ కూడా సుందరం ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌టీసీఎల్), ఎస్‌ఏఎంసీకి బదిలీ అవుతాయి.
ఎస్‌ఏఎంసీ, మన దేశానికి చెందిన పబ్లిక్ లిమిటెడ్ సంస్థ. సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్ఎఫ్ఎల్) సంపూర్ణ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. ఎస్‌ఎంఎఫ్‌కు పెట్టుబడి నిర్వహణ సంస్థగా పని చేస్తోంది. వివిధ నష్టాలు, లాభాలు, ద్రవ్యత ప్రాధాన్యతలతో పెట్టుబడిదారుల అవసరాలను తీర్చే నిధులను ఎస్‌ఏఎంసీ నిర్వహిస్తోంది.
పీఎంఎఫ్ కోసం ఆస్తి నిర్వహణ సేవలను అందించడంతోపాటు, పీఎంఎఫ్ పథకాలను నిర్వహించే వ్యాపారాన్ని కూడా పీఏఎంపీఎల్ చేస్తోంది.
పీఎంఎఫ్‌కు ధర్మకతృత్వ సేవలను అందించే వ్యాపారంలో పీటీసీపీఎల్ ఉంది.
(i) దీర్ఘకాలిక పెట్టుబడులు, పదవీ విరమణ ప్రణాళిక సలహాలు (ii) బీమాలు, పాలసీల కొనుగోళ్లు, పంపిణీకి సంబంధించిన సేవలు అందించడంతోపాటు, (iii) భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ల పంపిణీదారుగా పీఆర్‌ఏపీఎల్ పని చేస్తోంది.
సీసీఐ పూర్తి ఆదేశాల ప్రతి రావలసివుంది.
***
(Release ID: 1710012)
Visitor Counter : 237