మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మంగళవారం ఇ9 దేశాల విద్యామంత్రుల సంప్రదింపుల సమావేశానికి హాజరుకానున్న కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి
Posted On:
05 APR 2021 5:49PM by PIB Hyderabad
ఇ9 దేశాలు ఏప్రిల్ 6, 2021న ఇ9 చొరవః SDG4 వైపు పురోగతిని వేగవంతం చేయడానికి డిజిటల్ అభ్యాసాన్ని పెంచడం అన్న అంశంపై విద్యా మంత్రుల సంప్రదింపుల సమావేశానికి కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే హాజరుకానున్నారు. బడుగువర్గాలకు చెందిన బాలబాలికలు, యువత, ముఖ్యంగా ఆడపిల్లలకు డిజిటల్ అభ్యాసం, నైపుణ్యాలను పెంపొందించే మూడు దశల ప్రక్రియను కలిసి సృష్టించడం కోసం జరుగుతున్న సమావేశాలలో ఇది మొదటిది.
2020 అంతర్జాతీయ విద్యా సమావేశ ప్రాధాన్యతలైన (1) అధ్యాపకులకు మద్దతు (2) నైపుణ్యాలలో పెట్టుబడులు (3) డిజిటల్ అంతరాన్ని తగ్గించడం కోసం విద్యా వ్యవస్థలలో తీవ్ర మార్పును తీసుకురావడం ద్వారా స్థిరమైన అభివృద్ధి లక్ష్యం 4 అజెండాను ముందుకు తీసుకువెళ్ళేందుకు, రికవరీని వేగవంతం చేయడం అన్నవి ఈ చొరవ లక్ష్యం.
ఈ సంప్రదింపుల్లో పురోగతిని పట్టిచూపడమే కాకుండా, డిజిటల్ అభ్యాసం, నైపుణ్యాల అమలులో ఎదురైన సవాళ్ళ సందర్భంగా నేర్చుకున్న పాఠాలను పంచుకుంటారు.
(Release ID: 1709733)
Visitor Counter : 192