సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కోవిడ్ మ‌హ‌మ్మారి ప‌రిస్థితుల నేప‌థ్యంలో నూ కెవిఐసి మెరుపులు


పిఎంఇజిపి కింద మున్నెన్న‌డూ లేనిస్థాయిలో గ‌రిఇష్ట ఉపాధి క‌ల్ప‌న‌

కెవిఐసి ప‌నితీరును ప్ర‌శంసించిన‌ ఎం.ఎస్‌.ఎం. ఇ మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ

Posted On: 02 APR 2021 8:38PM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆర్ధికంగా నిరాశ చుట్టుముట్టిన సంవ‌త్స‌రంలోనూ ఖాదీ, గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ (కెవిఐసి)  ప్ర‌ధాన‌మంత్రి ఉపాధి క‌ల్ప‌న కార్య‌క్ర‌మం కింద (పిఎంఇజిపి), ఉపాధి క‌ల్ప‌న‌లో మున్నెన్న‌డూ లేని రీతిలో అద్భుత ప‌నితీరు క‌న‌బ‌ర‌చింది. మార్చి 31 తో అంత‌మైన  2020-21 ఆర్ధిక సంవ‌త్స‌రంలో చాలా కాలం కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ఉన్న స‌మ‌యంలో కెవిఐసి , 5,95,320 ఉద్యోగాల క‌ల్ప‌న‌కు రూ 218.78 కోట్ల రూపాయ‌ల‌ను పంపిణీ చేసింది. 2008లో ఈ ప‌థ‌కం ప్రారంభించిన త‌రువాత ఇంత గ‌రిష్ఠ స్థాయిలో మొత్తాన్ని విడుద‌ల చేయ‌డం ఇదే మొద‌టిసారి.  దేశ‌వ్యాప్తంగా కెవిఐసి 74,415 ప్రాజెక్టుల‌ను ఏర్పాటుచేసింది.

కెవిఐసి సాధించిన విజ‌యాన్ని కేంద్ర ఎం.ఎస్‌.ఎం.ఇ శాఖ మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రి ప్ర‌శంసించారు.  స్థానికంగా ఉపాధి క‌ల్పించ‌డం వ‌ల్ల ల‌క్ష‌లాది మందికి జీవ‌నోపాధి ల‌భిస్తుంద‌ని, అది ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను ముందుకుతీసుకువెళుతుంద‌ని ఆయ‌న అన్నారు.

 

2020-21 సంవ‌త్స‌రంలో రూ 2,120.81 కోట్ల‌రూపాయ‌ల మార్జిన్ మ‌నీ పంపిణీకి ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకోగా, కెవిఐసి రూ 2,188.78 కోట్ల‌రూపాయ‌లు విడుద‌ల చేసింది. ఆ ర‌కంగా 103.2 శాతం ల‌క్ష్యాన్ని సాధించింది. 2019-20లో సుమారు 14 శాతం ఎక్కువ మార్జిన్ మ‌నీని పంపిణీ చేశారు. కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, ఉపాధిక‌ల్ప‌న‌కుసంబంధించి ల‌క్ష్యంలో కెవిఐసి 106.2 శాతం సాధించింది.
కెవిఐసి ఛైర్మ‌న్ శ్రీ విన‌య్ కుమార్ స‌క్సేనా ఈ విజ‌యం ప్ర‌ధాన‌మంత్రి పిలుపునిచ్చిన ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌, వోక‌ల్ ఫ‌ర్‌లోక‌ల్ కు  , ఈ విష‌యంలో నిరంత‌ర మార్గ‌నిర్దేశం చేస్తున్న ఎం.ఎస్‌.ఎం.ఇ శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రికి చెందుతుంద‌న్నారు.

 

స్థానిక త‌యారీకిప్ర‌భుత్వం ప్రాధాన్య‌త‌నిచ్చింద‌ని, ఇది యువ‌‌త‌, మ‌హిళ‌లు, ఇత‌రులు పిఎంఇజిపి కింది  స్వ‌యం ఉపాధి కార్య‌క‌లాపాలు చేప‌ట్టేందుకు వీలు క‌ల్పించింద‌ని ఆయ‌న అన్నారు.
స‌కాలంలో ద‌ర‌ఖాస్తుల అమ‌లుకు సంబంధించి కెవిఐసి తీసుకున్న రెండు కీల‌క నిర్ణ‌యాలు బాగా ఉప‌క‌రించాయన్నారు. ఇందులో ఒక‌టి ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌, బ్యాంకుల‌కు ఫార్వ‌ర్డ్‌చేయ‌డానికి దాని స్టేట్‌డైర‌క్ట‌ర్లకు కాల‌ప‌రిమితి ని 90 రోజుల నుంచి 26 రోజుల‌కు కుదించ‌డం, బ్యాంకుల‌తో నెల‌వారీ స‌మ‌న్వ‌య స‌మావేశాలు వివిధ స్థాయిల‌లో  నిర్వ‌హించ‌డం ల‌బ్ధిదారుల‌కు స‌కాలంలో రుణాలు మంజూరుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింద‌ని ఆయ‌న అన్నారు.

 

సంవ‌త్స‌రం

నెల‌కొల్పిన ప్రాజెక్టులు

పంపిణీ చేసిఏన మార్జిన్ మ‌నీ (రూ కోట్ల‌లో)

  క‌ల్పించిన ఉపాధి

2020-21

74,415

2188.78

5,95,320

2019-20

72,612

2149.75

5,80,896

2018-19

73,427

2070.00

5,87,416

 

*****


(Release ID: 1709326) Visitor Counter : 195


Read this release in: Urdu , English , Hindi , Punjabi