శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
డిఎస్‌టి గోల్డెన్ జూబ్లీ డిస్కోర్స్ సిరీస్‌లో డేటాను అర్థం చేసుకోవడం మరియు నియంత్రించాల్సిన అవసరాన్ని ప్రముఖులు నొక్కిచెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు ఆరంభం ఉంది, కానీ అంతం లేదు అది కాలంతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది: కార్యదర్శి, డీఎస్టీ, ప్రొఫెసర్ అశుతోష్ శర్మ.
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2021 12:05PM by PIB Hyderabad
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలను ప్రముఖులు వివరించారు. మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్టి) యొక్క గోల్డెన్ జూబ్లీ డిస్కోర్స్ సిరీస్‌లో డేటాను అర్థం చేసుకోవడం మరియు నియంత్రించడం ద్వారా భారతదేశం భవిష్యత్తు కోసం వాటిని ఎలా ఉపయోగించుకోగలదో వివరించింది.
"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కి ఒక ఆరంభం ఉంది, కానీ అంతం లేదు. మరియు అది కాలంతో అభివృద్ధి చెందుతుంది" అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & ఫ్యూచర్ ఆఫ్ పవర్ పై జరిగిన ప్రసంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్టి) కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ చెప్పారు. కౌన్సిల్ ఫర్ సైన్స్ & టెక్నాలజీ కమ్యూనికేషన్ మరియు విజ్ఞన్ ప్రసార్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.
ప్రొఫెసర్ శర్మ డేటా సరైన అవగాహన మరియు నియంత్రణ అవసరం గురించి నొక్కి చెప్పారు.
“సాంప్రదాయకంగా భారతదేశం ముడి పదార్థాలను ఎప్పుడూ గౌరవించలేదు. ఈ రోజు డేటా ముడి పదార్థం, మనం దానిని గౌరవించాలి. డేటాపై సరైన అవగాహన, డేటా పంచుకోవడం మరియు డేటా నియంత్రణ అవసరం ”అని ఆయన స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ శర్మ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఏకీకరణ మరియు అభివృద్ధికి మంచి భవిష్యత్తు ఉంది. గత నాలుగు ఏళ్లుగా డీఎస్టీ ఏఐ గురించి ఆలోచిస్తోంది. మరియు నేషనల్ మిషన్ ఆన్ సైబర్ ఫిజిక్స్ క్రింద దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో 25 వేర్వేరు హబ్ లను ఏర్పాటు చేసింది.
రాజీవ్ మల్హోత్రా, ఇన్ఫినిటీ ఫౌండేషన్ మరియు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ పవర్’ పుస్తక రచయిత ఏఐ యూనివర్స్, ఆర్థికాభివృద్ధి మరియు ఉద్యోగాలు, ప్రపంచ శక్తి, మరియు మెటాఫిజిక్స్ మార్పులపై మాట్లాడారు.
ప్రతి ఒక్కరినీ ఏఐ ప్రభావితం చేయబోతోందని, ప్రతిదానిపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. “ఇది సమాజం, ఉద్యోగం, సైనిక, భవిష్యత్ విద్యావ్యవస్థ మరియు అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఏఐ అప్లికేషన్స్ సంఖ్య అనంతం. మరియు భవిష్యత్తు ఏఐ చేత నిర్వహించబడుతుంది ”అని ఆయన తెలిపారు.ఏఐలో భారతదేశం తన పురోగతిని వేగవంతం చేయాలని చెప్పారు. స్వంత ఉత్పత్తులను సృష్టించడానికి దాని డేటాను మరియు మేథస్సును ఉపయోగించాలని ఆయన అన్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ వైపు మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1708965)
సందర్శకుల సూచీ సంఖ్య : : 157