ఆర్థిక మంత్రిత్వ శాఖ

సవరించిన నిబంధనల ప్రకారం రూ .5 కోట్లకు పైగా టర్నోవర్ కలిగి జీఎస్టీ పన్ను చెల్లింపుదారులకు 2021 ఏప్రిల్ 1 నుంచి ఇన్వాయిస్‌లపై హెచ్‌ఎస్‌ఎన్ కోడ్ / సర్వీస్ అకౌంటింగ్ కోడ్ సమర్పించడం తప్పనిసరి

Posted On: 31 MAR 2021 4:57PM by PIB Hyderabad

ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానున్న నిబంధనల ప్రకారం అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో అయిదు కోట్లకు పైగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి జీఎస్టీ పన్ను చెల్లిస్తున్న వారు పన్ను చెల్లించవలసి వున్న వస్తువులు, సేవలకు జారీ చేసిన  ఇన్వాయిస్‌లపై ఆరు అంకెల హెచ్‌ఎస్‌ఎన్ కోడ్ (హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామన్‌క్లేచర్ కోడ్) లేదా సర్వీస్ అకౌంటింగ్ కోడ్ (సర్వీస్ అకౌంటింగ్ కోడ్) వివరాలను తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుంది. ఇంతవరకు అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో అయిదు కోట్లకు పైగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి జీఎస్టీ పన్ను చెల్లిస్తున్న వారు బి 2 బి ఇన్వాయిస్‌లలో నాలుగు అంకెల హెచ్‌ఎస్‌ఎన్ కోడ్ ను తప్పనిసరిగా సమర్పించవలసి ఉండేది. గతంలో అంకెలు మరియు అంకెల కోడ్ ను సమర్పించవలసి ఉండేది. మరిన్ని వివరాల కోసం 15.10.2020 నాటి నోటిఫికేషన్ నెంబర్ 78/2020-సెంట్రల్ టాక్స్ (  https://www.cbic.gov.in/resources//htdocs-cbec/gst/notfctn-79-central-tax-english-2020.pdf)  లో పొందవచ్చును. 

 సవరించిన నిబంధనల ప్రకారం 2021 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి  జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు తమ  ఇన్వాయిస్‌లపై హెచ్‌ఎస్‌ఎన్ కోడ్ / సర్వీస్ అకౌంటింగ్ కోడ్ లను సమర్పించవలసి ఉంటుంది. 

వస్తువులపై ఆరు అంకెల హెచ్‌ఎస్‌ఎన్ కోడ్ ను ప్రపంచవ్యాపితంగా వినియోగిస్తున్నారు. దీనితో కస్టమ్స్ జీఎస్టీ లకు సాధారణ హెచ్‌ఎస్‌ఎన్ కోడ్ లను అమలుచేయడం జరుగుతుంది. దీనితో కస్టమ్స్ సుంకాల విధింపుకు వాడే కోడ్ లను జీఎస్టీ కోసం కూడా (జిఎస్‌టి రేటు షెడ్యూల్‌లో ప్రత్యేకంగా పేర్కొన్నట్లు) ఉపయోగించడం జరుగుతుంది. కస్టమ్స్ సుంకంలో  హెచ్‌ఎస్ కోడ్‌ను హెడ్డింగ్  (4 అంకెలు హెచ్‌ఎస్), సబ్ హెడ్డింగ్ (6 అంకెలు హెచ్‌ఎస్) మరియు టారిఫ్ అంశాలు (8 అంకెలు) గా సూచిస్తారు. ఈ పత్రాలు CBIC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. కస్టమ్స్ టారిఫ్‌  హెచ్‌ఎస్‌ఎన్ కోడ్‌ల వివరాల  కోసం https://www.cbic.gov.in/ htdocs-cbec / customs / cst2021- 020221 / cst -idx చూడవచ్చును. 

వస్తువులు మరియు సేవల కోసం  జీఎస్టీ    రేటు షెడ్యూల్‌ను https://www.cbic.gov.in/ htdocs-cbec / gst / index-english  ద్వారా తెలుసుకొని ఆ తరువాత  àGST రేట్లు / రెడీ రికార్నర్-అప్‌డేటెడ్ నోటిఫికేషన్స్ / ఫైండర్ à జీఎస్టీ రేట్లు రెడీ రికార్నర్ / తాజా నోటిఫికేషన్‌లను పరిశీలించవచ్చును. 

ఇంతేకాకుండా  జీఎస్టీ పోర్టల్ లో  హెచ్‌ఎస్‌ఎన్ వివరాలు అందుబాటులో ఉంటాయి. 

తయారీదారులు మరియు దిగుమతిదారులు / ఎగుమతిదారులు సాధారణంగా హెచ్‌ఎస్‌ఎన్ కోడ్‌లను వినియోగించడం జరుగుతోంది. ఇదివరకు అమలు జరిగిన జీఎస్టీ విధానంలో   కూడా తయారీదారులు ఈ కోడ్‌లను అందించేవారు. దిగుమతిదారులు మరియు ఎగుమతిదారులు ఈ కోడ్‌లను దిగుమతి / ఎగుమతి పత్రాలలో పొందుపరచేవారు. తయారీదారు లేదా దిగుమతిదారు తమకు సరఫరాదారులు  ఇచ్చిన ఇన్వాయిస్‌లలో హెచ్‌ఎస్‌ఎన్ కోడ్‌లను సమర్పించేవారు. దీనితో ఎక్కువమంది జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే ఇన్వాయిసులు , ఇ-వే బిల్లులు మరియు జీఎస్టీఆర్ 1 రిటర్నులపై స్వచ్చంధంగా ఇప్పటికే  6/8 అంకెలకు హెచ్ఎస్ కోడ్ / ఎస్ఐసిలను  అందిస్తున్నారు.

***(Release ID: 1708817) Visitor Counter : 227


Read this release in: Urdu , Marathi , English , Hindi