రైల్వే మంత్రిత్వ శాఖ

ఫాల్టాన్ నుంచి పూణే వరకు లోనాండ్ మీదుగా నడిచే డెము రైలును ప్రారంభించిన కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ , సమాచార మరియు ప్రసార, భారీ పరిశ్రమలు మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజ్ శాఖల మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్


ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో ఏడు సంవత్సరాల్లో భారత రైల్వేలు ఎక్స్‌ప్రెస్ వేగంతో పరుగులు తీస్తున్నాయి

మానవరహిత రైల్వే క్రాసింగ్‌ల తొలగింపు, శుభ్రత, విద్యుదీకరణ పురోగతి, రైల్వే ట్రాక్‌ల రెట్టింపు, ఆధునిక రైళ్లు కోచ్‌ల రాక, స్టేషన్లలో వైఫై సౌకర్యాల కల్పన, పోర్ట్ కనెక్టివిటీ పెంపుదల రైల్వేల గతిని మార్చివేశాయి - శ్రీ జవదేకర్

ఫాల్టాన్ నుంచి పూణే మార్గంతో ప్రాంతాభివృధి

Posted On: 30 MAR 2021 5:19PM by PIB Hyderabad

ఫాల్టాన్ నుంచి  పూణే వరకు లోనాండ్ మీదుగా నడిచే డెము రైలును కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు, సమాచార మరియు ప్రసార, భారీ పరిశ్రమలు మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజ్ శాఖల మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ 2021 మార్చ్ 30వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర సహకార సహకార, మార్కెటింగ్  శాఖ మంత్రి  శ్రీ షామ్‌రావ్ అలియాస్ బాలాసాహెబ్ పాటిల్, సతారా జిల్లా ఇంచార్జి  మంత్రి శ్రీ రంజీత్‌సింగ్ నాయక్ నింబల్కర్, పార్లమెంట్ సభ్యులు శ్రీ గిరీష్ బాపట్,శ్రీ శ్రీనివాస్ పాటిల్,శ్రీ ఛత్రపతి ఉదయన్‌రాజే భోంస్లే, శాసనసభ్యులు శ్రీ చంద్రకాంత్ (దాదా) పాటిల్,శ్రీ సునీల్ కాంబ్లే ఫాల్టాన్ మునిసిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నీతా నెవాసే వీడియో లింక్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వే బోర్డు ఛైర్మన్ మరియు న్యూఢిల్లీ నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సునీత్ శర్మ, రైల్వే బోర్డు సభ్యుడు (ఓ,బిడి) శ్రీ పునేంద్ర మిశ్రా పాల్గొన్నారు. సిఎస్‌ఎంటి ముంబైకి చెందిన సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజీవ్ మిట్టల్  స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ ప్రకాష్ జవదేకర్ రైల్వే, వాణిజ్య, పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ మార్గదర్శకత్వంలో రైల్వేలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. బయో-మరుగుదొడ్ల ఏర్పాటుతో  రైల్వే మార్గాలు  స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లు శుభ్రంగా ఉంటున్నాయని అన్నారు. ఇది స్వచ్ఛ భారత్‌కు ఆదర్శవంతమైన ఉదాహరణ అని మంత్రి వ్యాఖ్యానించారు. 

ఐఆర్‌సిటిసిలో రిజర్వేషన్ల విధానాన్నిసరళీకృతం చేయడంతో ప్రయాణీకులు వేగంగా టిక్కెట్లు పొందగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. అత్యున్నత ప్రమాణాలతో భద్రతను కల్పించడానికి  మానవరహిత రైల్వే క్రాసింగ్లను తొలగించడం, వేగంగావిద్యుదీకరణచేయడం , రైల్వేలలో పోర్ట్ కనెక్టివిటీ కల్పించడంలాంటి మౌలిక సదుపాయాల కల్పన ఆర్థిక వ్యవస్థ మరియు వృద్ధిని పెంచడానికి తోడ్పడుతున్నాయని ఆయన తెలిపారు. 5000 కి పైగా రైల్వేస్టేషన్లలో  వై-ఫై అందుబాటులోకి రావడంతో ప్రయాణీకులకు వెబ్ ద్వారా  ప్రపంచవ్యాప్త సౌకర్యాలను, విజ్ఞానాన్ని అందుబాటులోకి వచ్చిందని  శ్రీ ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. 

ఫల్టాన్-పూణే డెము రైలు -నేపధ్యం :

*లోనాండీ మీదుగా ఫాల్టాన్ మరియు పూణే మధ్య రైళ్లను ప్రవేశపెట్టడం వల్లఈ ప్రాంత ప్రజలకు మరియు వ్యవసాయదారులకు కొత్త మార్కెట్లను చేరుకోవడానికి , విద్యార్థులు తమకు నచ్చిన విద్యా సంస్థలకు వెళ్ళడానికి  మరియు కార్మికులు నూతన ఉపాధి అవకాశాలను అన్వేషించుకోవడానికి అవకాశం కలుగుతుంది.

* లోనాండ్ మీదుగా  పూణే నుంచి   ఫాల్టాన్ కు తక్కువ ఖర్చుతో ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.   

*ఫాల్టాన్ లో నివసిస్తున్న ప్రజలు ఫాల్టాన్ నుంచి పూణే కు వెళ్లి రావడానికి రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. 

***


(Release ID: 1708591) Visitor Counter : 175