మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జమ్మూ ఐఐఎం లో మానసిక ఉల్లాస కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి


దేశాన్ని శక్తివంతం చేయడానికి విద్య ఉల్లాసంగా సాగాలి : శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్'

అందరికి సమగ్ర అభివృద్ధి ఫలాలు అందించాలన్నది 2020 జాతీయ విద్యా విధానం లక్ష్యం : మంత్రి

Posted On: 30 MAR 2021 2:32PM by PIB Hyderabad

 జమ్మూ ఐఐఎం లో మానసిక ఉల్లాస కేంద్రాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఈ రోజు వర్చువల్  విధానంలో ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా,  ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  జమ్మూ ఐఐఎం బోర్డ్ అఫ్ గవర్నర్స్ అధ్యక్షుడు డాక్టర్. మిలింద్ కుంబ్లే అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి  జమ్మూ ఐఐఎం డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. సాహే హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' మానసిక ఉల్లాస కేంద్రాన్ని ప్రారంభించిన జమ్మూ ఐఐఎంని అభినందించారు. ఒత్తిడి లేని విద్యాబోధన విద్యార్థులకు అవసరమని అన్నారు. దేశాన్ని శక్తివంతం చేసే అంశంలో విద్య ప్రధానపాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. ఉల్లాసంతో ఒత్తిడి లేకుండా విద్యను అభ్యసించిన విద్యార్థులు దేశ భవిషత్తును తీర్చి దిద్దుతారని అన్నారు.మానసిక ఉల్లాస కేంద్రాన్ని ప్రారంభిస్తూ జమ్మూ ఐఐఎం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యను మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని అన్నారు. నలంద, తక్షశిల వంటి ప్రాచీన భారతీయ విశ్వవిద్యాలయాల్లో అందించిన విద్యాస్థాయికి భారత దేశ విద్యావిధానం చేరాలని ఆయన అకాక్షించారు. 2020 జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా మానసిక ఉల్లాస కేంద్రం ఏర్పాటయిందని అయన పేర్కొన్నారు. 2021 నాటికి విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన తీసుకొని రావాలన్న లక్ష్యంతో 2020 జాతీయ విద్యా విధానానికి రూపకల్పన చేశామన్నారు. ఒత్తిడి లేని విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించే మానసిక ఉల్లాస కేంద్రాలను నెలకొల్పడానికి  దేశంలోని అన్ని విద్యాసంస్థలు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. 

విద్యా సంస్థల్లో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారని మంత్రి అన్నారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయవలసి ఉండడం, భోధన, చదువుకోవడం లాంటి అంశాలతో పాటు వీరు వృత్తిపరమైన వ్యక్తిగత అంశాలవల్ల ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. జమ్మూ ఐఐఎం లో ఏర్పాటైన మానసిక ఉల్లాసకేంద్రం వీరిని మానసిక ఒత్తిడికి దూరం చేసి, అన్ని అంశాలను సానుకూల దృష్టితో ఆలోచించి పని చేయడానికి అవకాశం కల్పిస్తుందని అన్నారు. దీనివల్ల  జమ్మూ ఐఐఎం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. 

ప్రతి ఒక్కరికి సంపూర్ణ శ్రేయస్సును అందించాలన్న లక్ష్యంతి  జమ్మూ ఐఐఎం లో మానసిక ఉల్లాస కేంద్రాన్ని నెలకొల్పారని మంత్రి వివరించారు. ' ఆనందం' కేంద్రంలో క్రమంతప్పకుండా శారీరక వ్యాయామాలు చేయడం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు శారీరక ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. మనస్సును స్వీయ నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా మానసిక ఆనందాన్ని పొందవచ్చునని మంత్రి అన్నారు. ఈ కేంద్రంలో ప్రాణాయామ, ధ్యానం, శ్వాస వ్యాయామాలను చేయడానికి సౌకర్యాలు  కల్పించామని మంత్రి తెలిపారు. 

కౌన్సెలింగ్, పరిపూర్ణ ఆనందం, ఆనందాన్ని అందించడం , పరిశోధన నాయకత్వ అభివృద్ధి,

కోర్సుల ఎంపిక  అనే ఐదు విస్తృత విభాగాలుగా 'ఆనందం' కేంద్రం పనిచేస్తుందనిమంత్రి వివరించారు. కేంద్రాన్ని నిర్వహించడానికి వివిధ విభాగాలకు చెందిన నిపుణులు తమ సేవలను అందిస్తారని అన్నారు. 

మానసిక ఉల్లాసంతో  భూటాన్ అగ్రస్థానంలో ఉందని  జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా తెలిపారు. సంపదను డబ్బుతో కాకుండా మానసిక ఉల్లాసం ప్రాతిపదికగా అంచనా వేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. యోగాప్రాణాయామంధ్యానం ద్వారా విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉంటారని ఆయన చెప్పారు. 

"ఆనందం"అంటే స్వచ్ఛమైన చైతన్యం అన్న  భారతీయ జ్ఞాన సంప్రదాయం స్ఫూర్తిగా ' ఆనందం' కేంద్రాన్ని నెలకొల్పారు. ఆనందం అంటే కేవలం ఆనందం మాత్రమే కాదు నిజాలను తెలుసుకోవడం, మంచి పంటకు చేయడం, ప్రకృతి అందాలను ఆస్వాదించడం అని తెలుసుకోవలసి ఉంటుంది. “ ఆనందం ” కు అందరి శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండడం అని చెప్పే “సర్వభతహితరత”అనే ట్యాగ్‌లైన్ ను చేర్చారు. 

***



(Release ID: 1708531) Visitor Counter : 218