మంత్రిమండలి
స్వచ్ఛ్ భారత్ మిశన్ (గ్రామీణ్) రెండో దశ కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
19 FEB 2020 4:27PM by PIB Hyderabad
స్వచ్ఛ్ భారత్ మిశన్ (గ్రామీణ్) [ఎస్‌బిఎమ్(జి)] యొక్క రెండో దశ ను 2024-25 వరకు అమలుపరచేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ఓపెన్ డిఫికేశన్ ఫ్రీ ప్లస్ (ఒడిఎఫ్ ప్లస్)పై శ్రద్ధ వహిస్తుంది. ఒడిఎఫ్ ప్లస్ లో ఒడిఎఫ్ సస్‌టేనబిలిటి ఎండ్ సాలిడ్ ఎండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఎస్ఎల్‌డబ్ల్యుఎమ్) కూడా కలసివుంటుంది.
ఈ కార్యక్రమం ఏ ఒక్కరి ని వదలివేయకుండాను, ప్రతి ఒక్కరు టాయిలెట్ ను ఉపయోగించేటట్లు గాను పూచీపడే దిశ గా కృషి చేస్తుంది. కేంద్రం మరియు రాష్ట్ర వాటా లు కలుపుకొని 2020-21 నుండి 2024-25 మధ్య కాలాని కి 52,497 కోట్ల రూపాయల అంచనా బడ్జెటు తో ఒక ఉద్యమం తరహా లో ఎబిఎమ్ (జి) రెండో దశ ను సైతం అమలు చేయడం జరుగుతుంది. దీనికి అదనం గా, రానున్న ఆర్థిక సంవత్సరం కోసం గ్రామీణ స్థానిక సంస్థ ల ద్వారా నీటి సరఫరా కు మరియు పారిశుధ్యాని కి గాను 30,375 కోట్ల రూపాయల ను కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ తో ఒడిఎఫ్ ప్లస్ కార్యక్రమం కలసిపోతుంది. అంతేకాకుండా, క్రొత్త గా ప్రారంభించినటువంటి జల్ జీవన్ మిశన్ కు కూడా ఇది పూరకం గా ఉంటుంది.
ఈ కార్యక్రమం లో భాగం గా, ఇన్డివిజువల్ హౌస్‌హోల్డ్ టాయిలెట్ (ఐహెచ్‌హెచ్ఎల్) నిర్మాణాని కి గాను ఇప్పుడు ఉన్న నియమ నిబంధన ల ప్రకారం నూతనం గా అర్హత ను సంపాదించే కుటుంబాల కు 12,000 రూపాయల ప్రోత్సాహకాన్ని అందించడాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఘనమైన మరియు ద్రవ్య రూప వ్యర్థ పదార్థాల నిర్వహణ (ఎస్ఎల్‌డబ్ల్యుఎమ్)కు గాను ఆర్థిక సహాయ సంబంధ నియమాల ను హేతుబద్ధం చేయడం తో పాటు కుటుంబాల సంఖ్య స్థానం లో తలసరి ప్రాతిపదిక పద్ధతి కి మార్పు చేయడమైంది. దీనికి తోడు, గ్రామ స్థాయి లో కమ్యూనిటీ మేనేజ్ డ్ శానిటరీ కాంప్లెక్స్ (సిఎమ్ఎస్‌సి)ని నిర్మించడం కోసం గ్రామ పంచాయతీ (జిపి స్)లకు ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్క సిఎమ్ఎస్‌సి కి 2 లక్షల రూపాయల నుండి 3 లక్షల రూపాయల కు పెంచడమైంది.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల కు త్వరలో జారీ చేయనున్న మార్గదర్శక సూత్రాల కు అనుగుణం గా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయనున్నాయి. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య నిధుల పంపకం నమూనా ఈశాన్య ప్రాంత రాష్ట్రాల కు, హిమాలయ ప్రాంత రాష్ట్రాల కు మరియు జమ్ము, కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాని కి 90:10 గాను; ఇతర రాష్ట్రాలకు 60:40 గాను; అన్య కేంద్రపాలిత ప్రాంతాల కు అన్ని కంపోనంట్ లకు గాను 100:0 గాను ఉంటుంది.
ఒడిఎఫ్ ప్లస్ యొక్క ఎస్ఎల్‌డబ్ల్యుఎమ్ కంపొనంట్ ను నాలుగు కీలక రంగాలు.. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, బయో-డీగ్రేడబుల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఏనిమల్ వేస్ట్ మేనేజ్ మంట్ సహా), గ్రే వాటర్ మేనేజ్‌మెంట్, ఇంకా ఫీకల్ స్లజ్ మేనేజ్ మంట్ ల పరంగా ఫలితాల సూచికల ను ఆధారం చేసుకొని పర్యవేక్షించడం జరుగుతుంది.
కుటుంబాల వారీ టాయిలెట్ ల మరియు సముదాయ టాయిలెట్ ల నిర్మాణం తో పాటు కంపోస్ట్ పిట్స్, ఇంకుడు గుంతలు, వ్యర్థాల స్థిరీకరణ గుంత లు, సామగ్రి ని స్వాధీనం చేసుకొనే సదుపాయాలు తదితర ఎస్ఎల్‌డబ్ల్యుఎమ్ సంబంధిత మౌలిక సదుపాయాల ను నిర్మించడం ద్వారా ఎస్‌బిఎమ్-జి యొక్క రెండో దశ గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజాన్ని అందించడంతో పాటు ఉద్యోగ కల్పన కు కూడాను తోడ్పాటు ను ఇవ్వనుంది.
ఎస్‌బిఎమ్-జి ని 2014వ సంవత్సరం అక్టోబరు 2వ తేదీ న ప్రారంభించిన వేళ దేశం లో గ్రామీణ ప్రాంతాల కు పారిశుధ్య సేవ లభ్యత 38.7 శాతం గా ఉన్నట్టు నమోదు అయింది. ఈ మిశన్ ను ఆరంభించినప్పటి నుండి 10 కోట్ల కు పైగా వ్యక్తిగత టాయిలెట్ ల ను నిర్మించడమైంది. ఫలితం గా అన్ని రాష్ట్రాల లోని గ్రామీణ ప్రాంతాలు 2019వ సంవత్సరం అక్టోబరు 2వ తేదీ కల్లా ఒడిఎఫ్ గా తమను తాము ప్రకటించుకొన్నాయి. అయితే, ఇప్పటికీ ఒక్క టాయిలెట్ సౌకర్యం అందుబాటు లో లేనటువంటి గ్రామీణ ప్రాంత కుటుంబాలు అనేవి ఏవీ లేవు అంటూ రాష్ట్రాలన్నిటిని మరొక్క మారు ఖరారు చేయవలసింది గాను, మరి అటువంటి కుటుంబాలు ఏవైనా ఉన్నట్లు గుర్తించిన పక్షం లో ఈ కార్యక్రమం లో ఏ ఒక్కరి ని వదలి వేయకుండా చూడటానికి వ్యక్తిగత కుటుంబ టాయిలెట్ ను నిర్మించుకోవడాని కి అవసరమైన మద్ధతు ను అందించవలసిందిగాను త్రాగు నీరు మరియు పారిశుధ్యం విభాగం (డిడిడబ్ల్యుఎస్) సూచించింది.
***
(Release ID: 1708480)
Visitor Counter : 253