మంత్రిమండలి
మూడు సంవత్సరాల కాలపరిమితి కి 22వ లా కమిశన్ ఏర్పాటు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
19 FEB 2020 4:40PM by PIB Hyderabad
ఆధికారిక రాజపత్రం లో ప్రకటించిన నాటి నుండి మూడు సంవత్సరాల కాలానికి గాను ఇరవై రెండో లా కమిశన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
లాభాలు
చట్టాని కి సంబంధించిన వివిధ కోణాల పై అధ్యయనం చేసి సిఫారసుల ను అందించే బాధ్యత లా కమిశన్ పై పెట్టారు. ప్రభుత్వానికి చట్టానికి సంబంధించిన భిన్న అంశాలపై ప్రత్యేక అర్హతలు గల ఈ వ్యవస్థ సలహా, సిఫారసు లు అందుబాటు లో ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం తనకు రిఫర్ చేసిన లేదా స్వయం గా ప్రస్తుత చట్టాల పైన లోతైన అధ్యయనాన్ని చేపట్టవచ్చును.
ప్రస్తుతం అమలు లో ఉన్న చట్టాల ను సమీక్షించి, వాటి స్థానం లో కొత్త చట్టాల ను తీసుకు వచ్చేందుకు కావలసిన పరిశోధన ను చేయవచ్చును. సంస్కరించి న్యాయ వ్యవస్థ లో జాప్యాన్ని నిరోధించేందుకు, కేసుల సత్వర పరిష్కారాని కి, లిటిగేశన్ వ్యయాల ను తగ్గించడానికి ప్రస్తుతం దేశం లో అమలు లో ఉన్న చట్టాల పై అధ్యయనాన్ని, పరిశోధన ను చేపట్టవచ్చును.
లా కమిశన్ ఆఫ్ ఇండియా ఇతర అంశాల తో పాటు,: -
ఎ. ప్రస్తుత పరిస్థితులకు ఏ మాత్రం సరిపోలని పాత చట్టాలను గుర్తించి తక్షణం రద్దు చేయవచ్చు.
బి. రాష్ట్ర విధానాని కి చెందిన నిర్దేశిక సూత్రాల కోణం లో ప్రస్తుతం అమలు లో ఉన్న చట్టాల ను పరీక్షించి మెరుగుదల కు వాటి లో మెరుగుదల కు, సంస్కరణ కు అవసరమైన సూచనల ను చేయవచ్చు.
సి. న్యాయం మరియు చట్టం మంత్రిత్వ శాఖ (న్యాయ వ్యవహారాల విభాగం) ద్వారా ప్రభుత్వం ప్రత్యేక పరిశీలన కు పంపిన న్యాయ వ్యవస్థ, ఆ శాఖ కు చెందిన పాలన వ్యవస్థ కు సంబంధించిన ఏ అంశం పై అయినా ప్రభుత్వాని కి తన సిఫారసుల ను అందించవచ్చు. న్యాయపరమైన, చట్టపరమైన అంశాలపై ప్రభుత్వాని కి తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.
డి. న్యాయం, చట్టం మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వం తన పరిశీలన ను పంపిన అభ్యర్ధన ఆధారం గా విదేశాల కోసం పరిశోధన చేపట్టవచ్చు.
ఇ. పేదల కు న్యాయ సహాయం కోసం అందుబాటు లో ఉన్న చట్టాల ను, న్యాయ విధానాలను పరిశీలించి అవసరమైన చర్యల ను తీసుకోవచ్చు.
ఎఫ్. సార్వత్రిక ప్రాధాన్యం ఉన్న కేంద్ర చట్టాల ను సరళతరం చేసేందుకు, వ్యత్యాసాల ను, గందరగోళాన్ని, అసమానతల ను తొలగించేందుకు అవసరమైన సవరణల ను చేపట్టవచ్చు.
తన సిఫారసుల ను ఖరారు చేసే ముందు అవసరం అని భావించినట్లయితే నోడల్ మంత్రిత్వ శాఖ లేదా ప్రభుత్వ శాఖ లు, ఇతర వర్గాల తో సంప్రదింపుల ను చేపట్టవచ్చు.
పూర్వరంగం
నిర్దిష్ట కాలపరిమితి కి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే లా కమిశన్ ఆఫ్ ఇండియా చట్టపరమైన అధికారాలు లేనటువంటి సంస్థ. 1955వ సంవత్సరం లో తొలిసారి గా లా కమిశన్ ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత ప్రతి మూడు సంవత్సరాల కు ఒక సారి కమిశన్ పునర్నిర్మాణం జరుగుతుంది. 21వ లా కమిశన్ కాల పరిమితి 2018 వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీ వరకు ఉండింది.
దేశం లో ఏర్పాటైన వివిధ లా కమిశన్ లు చట్టాల ను కోడిఫై చేయడానికి, ప్రగతిశీల అభివృద్ధి కి ఎంతో కీలకమైన సేవలందించాయి. ఇప్పటి వరకు లా కమిశన్ లు 277 నివేదికల ను ప్రభుత్వానికి అందించాయి.
గజెట్ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుండి 22వ లా కమిశన్ కాల పరిమితి మూడు సంవత్సరాలు ఉంటుంది. దీని లో -
ఎ. ఫుల్- టైమ్ చైర్ పర్సన్,
బి. నలుగురు ఫుల్- టైమ్ సభ్యులు ( మెంబర్ కార్యదర్శి సహా),
సి. ఎక్స్- అఫీషియో మెంబర్ గా న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి,
డి. ఎక్స్- అఫీషియో మెంబర్ గా లెజిస్లేటివ్ శాఖ కార్యదర్శి, మరియు
ఇ. అయిదుగురి కి మించకుండా పార్ట్- టైమ్ సభ్యులు
ఉంటారు.
***
(Release ID: 1708398)
Visitor Counter : 239