వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

దండి మార్చ్‌ మార్గంలో ఉప్పు కార్మికులకు ఆరోగ్య శిబిరం నిర్వహించారు

प्रविष्टि तिथि: 26 MAR 2021 6:04PM by PIB Hyderabad

అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా గుజరాత్‌లోని భరూచ్‌ జిల్లా ఆమోద్‌లోని మాగ్నాడ్‌ వద్ద ఆ చుట్టుపక్కల పనిచేసే ఉప్పు కార్మికుల కోసం ఈ రోజు ఆరోగ్య అవగాహన శిబిరం ఏర్పాటు చేయబడింది. భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ,  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రెడ్ (డిపిఐఐటి) ఆధ్వర్యంలో సాల్ట్ కమిషనర్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

శిబిరానికి పరిసర  ప్రాంతాల్లో అంటే దేవ్లా, మాల్పూర్, నాడా, ఆశారా, టాంకారి, జంబుసార్, గాంధర్ & దహేజ్‌లకు చెందిన 236 మంది ఉప్పు కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఈ శిబిరానికి హాజరయ్యారు.  శిబిరంలో ఉప్పు కార్మికుల ఆరోగ్య తనిఖీ 10.30 గంటలకు ప్రారంభమైంది మరియు మధ్యాహ్నం 1.30 వరకు కొనసాగింది. జంబుసర్ ప్రభుత్వ వైద్య కళాశాల & ఆసుపత్రి మరియు తాలూకా ఆరోగ్య విభాగం వైద్యులు మరియు నిపుణుల బృందం ఆరోగ్య పరీక్షలను నిర్వహించింది.

పారామెడికల్ సిబ్బంది వైద్యుల బృందానికి సహకరించారు. వైద్యులు సూచించిన మందులు ఉప్పు కార్మికులకు ఇచ్చారు. శిబిరంలో డిప్యూటీ కలెక్టర్, భరూచ్ మరియు డిప్యూటీ సాల్ట్ కమిషనర్ (ఐ / సి) హాజరయ్యారు.

75వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ‘అమృత్ మహోత్సవ్’పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మహోత్సవ్‌ను గౌరవ ప్రధాని 2021 మార్చి 12 న ప్రారంభించారు. మన దేశ చరిత్రను మార్చడంలో ఉప్పు కీలక పాత్ర పోషించింది. ఉప్పు పాన్లోని కార్మికులు ఉప్పు ఉత్పత్తి కోసం కృషి చేస్తూ భారతదేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

స్వాతంత్య్రానికి పూర్వం భారతీయులు దిగుమతి చేసుకున్న ఉప్పును చాలా ఎక్కువ ఖర్చుతో కొనుగోలు చేయవలసి వచ్చేది.  స్థానికంగా ఉప్పును ఉత్పత్తి చేయకుండా లేదా అమ్మకుండా నిరోధించారు. ఈ క్రమంలో మహాత్మా గాంధీ చేపట్టిన  దండి మార్చ్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో చాలా ముఖ్యమైన అధ్యాయాన్నిలిఖించింది. నేడు భారతదేశం ప్రపంచంలో 3 వ అతిపెద్ద ఉప్పు ఉత్పత్తి చేసే దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉప్పును ఎగుమతి చేస్తుంది. ప్రస్తుతం ఉప్పు ఉత్పత్తి 30 మిలియన్ టన్నులకు (స్వాతంత్య్ర పూర్వం 2 మిలియన్ టన్నుల కన్నా తక్కువ) చేరుకుంది. అన్ని మానవ మరియు పారిశ్రామిక అవసరాలను ఇది తీరుస్తోంది. దేశీయ అవసరాలు పోనూ 5 మిలియన్ టన్నుల ఉప్పును ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు ఎగుమతి చేస్తుంది.

పోషక పదార్ధాల (అయోడిన్ మరియు ఐరన్) వాహనంగా ఉప్పు పనిచేస్తుంది.  మొత్తం జనాభాకు అయోడైజ్డ్ ఉప్పు అందించడం ద్వారా అయోడిన్ లోపాన్ని ప్రభావవంతంగా ఎదుర్కోగలిగామని నిరూపించబడింది.

***


(रिलीज़ आईडी: 1708050) आगंतुक पटल : 122
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi