ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ నియంత్రణలో సహకారానికి చత్తీస్ గఢ్, చండీగఢ్ కు కేంద్ర బృందాలు

Posted On: 26 MAR 2021 4:09PM by PIB Hyderabad

చత్తీస్ గఢ్ రాష్ట్రంలోను, చందీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలోనూ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతూ ఉండటంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కేంద్రబృందాలు అక్కడికి తరలి వెళ్లాయి. ఆ రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత అధికారులతో కలసి ఈ కేంద్ర బృందాలు పనిచేస్తాయి. అకస్మాత్తుగా కరోనా కేసులు పెరగటానికి కారణాలు అన్వేషించటంతోబాటు నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలమీద ఈ బృందాలు సలహాలు, సూచనలు ఇస్తాయి.

చత్తీస్ గఢ్ వెళ్ళిన బృందానికి జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ( ఎన్ సి డి సి) డైరెక్టర్ డాక్టర్ ఎస్ కె సింగ్ నాయకత్వం వహించగా రాయ్ పూర్ ఎయిమ్స్, ఆలిండియా ఇన్ స్టిట్యూ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. చండీగఢ్ వెళ్ళిన బృందానికి జౌళి శాఖాదనపు కార్యదర్శి, ఆర్థిక సలహాదారు అయిన శ్రీ విజయ్ కుమార్ సింగ్ నాయకత్వం వహిస్తుందగా ఈ బృందంలో న్యూ ఢిల్లీలోని డాక్టర్ ఆర్ ఎం ఎల్ ఆస్పత్రి, సఫ్దర్ జంగ్ ఆస్పత్రి నిపుణులు ఉన్నారు.

చత్తీస్ గఢ్ లో ఇటీవలి కాలంలో కోవిడ్ కేసుల పెరుగుదల కనబడగా రోజుకొక కోవిడ్ మరణం కూడా నమోదవుతూ వస్తోంది. అదే విధంగా చండీగఢ్ లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఎక్కువగా ప్రభావితమైన జిల్లాలు, ప్రాంతాలలో ఈ కేంద్ర బృందాలు పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనావేస్తాయి. ప్రజారోగ్య రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తిస్తాయి. తమ దృష్టికి వచ్చిన అంశాలు, అభిప్రాయాలు, సూచనలతో కూడిన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా చీఫ్ అడ్మినిస్త్రేటర్ కు అందజేస్తాయి .

కేంద్ర ప్రభుత్వం కోవిడ్ నివారణకు, నియంత్రణకు  సమగ్రమైన విధానం అనిసరిస్తూ కొవిడ్ మీద పొరాటం జరుపుతున్న సంగతి తెలిసిందే. అవసరాన్నిబట్టి రాష్టాలకు కేంద్ర బృందాలను పంపుతూ అక్కడి ప్రభుత్వాధికారులతో సమన్వయం చేసుకుంటూ నియంత్రణకు కృషి చేస్తోంది. అప్పటికీ అమలు జరుగుతున్న కార్యకలాపాలను పటిష్టం చేయటంతోబాటు కొత్త పద్ధతులు సూచించటం సాగుతూ వస్తోంది. అదే క్రమంలో తాజాగా కొత్త కేసులు వస్తున్న రాష్ట్రాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఈ విధంగా బహుముఖ నైపుణ్యమున్న ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను  పంపుతోంది.

 

***



(Release ID: 1708048) Visitor Counter : 128