యు పి ఎస్ సి

'కంబైన్డ్ జియో సైంటిస్ట్' (ప్రాథమిక) పరీక్ష-2021 ఫలితాలు ప్రకటన

Posted On: 25 MAR 2021 4:41PM by PIB Hyderabad

గత నెల 21న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన 'కంబైన్డ్ జియో సైంటిస్ట్' (ప్రాథమిక) పరీక్ష-2021 ఫలితాల ఆధారంగా, కింద పేర్కొన్న రోల్ నంబర్లు కలిగిన అభ్యర్థులు ముఖ్య పరీక్షకు అర్హత సాధించారు. కమిషన్‌ వెబ్‌సైట్‌ https://upsc.gov.in లోనూ ఫలితాలను చూడవచ్చు.

    పరీక్ష అన్ని దశల్లో నిర్దేశిత అర్హతలను ఈ అభ్యర్థుల అభ్యర్థిత్వం సంతృప్తి పరచాలి, పైగా అభ్యర్థిత్వం పూర్తిగా తాత్కాలికం. ప్రాథమిక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు, ఈ ఏడాది జులై 17, 18 తేదీల్లో నిర్వహించే ప్రధాన పరీక్షకు హాజరుకావాలి. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌-2021 పరీక్ష నియమనిబంధనలను వారు తెలుసుకుని ఉండాలి. 07.10.2020న కమిషన్‌ జారీ చేసిన పరీక్ష ప్రకటన నం.1/21-జీఈవోఎల్‌ను కూడా క్షుణ్నంగా చదివి ఉండాలి. ఈ ప్రకటన కమిషన్‌ వెబ్‌సైట్‌లోనూ ఉంది. ప్రధాన పరీక్షకు మూడు వారాల ముందు నుంచి అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లను వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. పరీక్ష ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక, అంటే తుది ఫలితాలను కూడా ప్రకటించి తర్వాత, అభ్యర్థులు సాధించిన మార్కులను వారికి తెలియజేయడంతోపాటు పరీక్ష కటాఫ్‌ మార్కులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. పరీక్ష కేంద్రం లేదా ప్రాంతం మార్పు కోసం వచ్చే అభ్యర్థనలు ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించబడవు.

    యూపీఎస్‌సీ తన భవన ప్రాంగణంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పరీక్షకు సంబంధించిన సమాచారం లేదా స్పష్టత కావాలనుకున్నవారు, అన్ని పని దినాల్లో ఉదయం 10 గం. సాయంత్రం 5 గం. మధ్య నేరుగాగానీ, టెలిఫోన్‌ నంబర్లు (011)- 23388088, 23385271/23381125/23098543 ద్వారాగానీ సంప్రదించవచ్చు.

ప్రధాన పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

***
 


(Release ID: 1707643) Visitor Counter : 156