వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

స‌మానంగా అంద‌రికీ అందుబాటులో ఔష‌ధాలు

Posted On: 24 MAR 2021 2:24PM by PIB Hyderabad

COVID-19 నివారణ, చికిత్స, నియంత్రణ కోసం వాణిజ్య సంబంధ‌ మేధో సంపత్తి హక్కుల (టిఆర్ ఐపి ఎస్- ట్రిప్స్‌‌‌) ఒప్పందంలోని కొన్ని అంశాల ర‌ద్దు కోసం  అక్టోబ‌ర్ 2, 2020న  ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ ) ట్రిప్స్ ‌కౌన్సిల్‌కు భారతదేశం, దక్షిణాఫ్రికా త‌మ‌‌ ప్ర‌తిపాద‌న‌ను సమర్పించాయి. 
మేథోసంప‌త్తి హ‌క్కులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యాలు పెర‌గ‌డానికి అడ్డంకిని సృష్టించ‌కుండా కోవిడ్ -19 మ‌హమ్మారిని నియంత్రించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని వాక్సిన్లు, చికిత్స‌, ఇతర సామాగ్రి  స‌కాలానికి, స‌మానంగా, స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉండాల‌న్న ల‌క్ష్యంతో ఈ ప్ర‌తిపాదన‌ను చేశారు. 
అక్టోబ‌ర్‌, 2020లో టిఆర్ ఐపిఎస్ కౌన్సిల్‌కు స‌మ‌ర్పించిన త‌ర్వాత‌, ఈ ర‌ద్దు ప్ర‌తిపాద‌నకు ఇప్పుడు 57మంది డ‌బ్ల్య‌ట‌టిఒ స‌భ్యుల కోస్పాన్స‌ర్‌షిప్ చేస్తుండ‌గా, అనేక మంది స‌భ్యులు స‌భ‌లో మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఈ ర‌ద్దు ప్ర‌తిపాద‌న‌కు అనేక పౌర సంఘాల నుంచి, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. 
ఈ స‌మాచారాన్ని కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హాయ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురీ బుధ‌వారం లోక్‌స‌భ‌కు స‌మ‌ర్పించిన లిఖిత స‌మాధానంలో వెల్ల‌డించారు. 

 

***
 


(Release ID: 1707314) Visitor Counter : 125


Read this release in: English , Urdu , Punjabi , Malayalam