ఆయుష్

అండమాన్-నికోబార్ దీవులలో యోగా దినోత్సవం - 2021: ప్రజల భాగస్వామ్యం కోసం ముందస్తు ప్రణాళికలను పరిపాలనా యంత్రాంగం ఖరారు చేసింది

Posted On: 22 MAR 2021 2:09PM by PIB Hyderabad

అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐ.డి.వై) - 2021 సందర్భంగా, అండమాన్-నికోబార్ దీవులలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంత పరిపాలనా యంత్రాంగం, తగిన జాగ్రత్తలతో చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా, మహమ్మారి ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా, ప్రజలు, యోగా ను అనుసరించడానికి పెద్ద సంఖ్యలో ప్రేరణ పొందుతారని భావిస్తున్నారు. 

గత సంవత్సరాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాల పరిశీలనల ద్వారా సృష్టించిన వేగాన్ని, 2021 జూన్, 21వ తేదీన నిర్వహించే 7 వ అంతర్జాతీయ దినోత్సవానికి కల్లా, మరింత ముందుకు తీసుకెళ్లాలని, యు.టి. పరిపాలనా యంత్రాంగం నిర్ణయించింది. ఈ సంవత్సరం నిర్వహించే కార్యకలాపాల్లో, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా చూడాలని, యు.టి. పాలనా యంత్రాంగం ఆసక్తిగా ఉంది.  మునుపటి సంవత్సరంలో నిర్వహించిన కార్యకలాపాలకు అనుగుణంగా, 7వ ఐ.డి.వై. నిర్వహణ కోసం, యు.టి. కార్యాచరణ ప్రణాళిక ఇప్పటికే ఖారారైయింది.  ఐ.డి.వై. నిర్వహణకు చెందిన కార్యకలాపాలన్నీ, కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగానే కొనసాగుతాయి. 

సాధారణ యోగా నిర్వహణ నియమాలు (సి.వై.పి) ఆధారంగా ప్రముఖ ప్రదేశాలలో, సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహించబడతాయి.  ఇందుకోసం, తగిన పంచాయతీ హాళ్ళు,  కమ్యూనిటీ హాళ్ళు, పాఠశాలల హాళ్ళు మొదలైనవాటిని, సాధ్యమైనంత వరకు వినియోగించుకోనున్నారు. భారత ప్రభుత్వం జారీ చేసిన, ప్రస్తుత కోవిడ్-19 మార్గదర్శకాలు, యు.టి. లోని మూడు జిల్లాల్లోనూ  ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది.  ప్రతి ప్రదేశంలోనూ నిర్వహించే ఈ కార్యక్రమాలను,  క్షేత్ర స్థాయి విభాగాల సహకారంతో, యు.టి. అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి / హెచ్.ఓ.డి. / ఇతర సంబంధిత అధికారులు వంటి సీనియర్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు.   ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారికి మార్గనిర్దేశనం చేయడానికి యోగా నిపుణులను ఆహ్వానిస్తారు.

ప్రస్తుత కోవిడ్-19 మార్గదర్శకాలకు లోబడి,  7వ ఐ.డి.వై. లో ప్రజల భాగస్వామ్యం పెరిగే విధంగా, భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించడం కోసం. యు.టి. వ్యాప్తంగా,  ఐ.డి.వై - 2021 కి కనీసం ఒక నెల ముందు నుంచీ,  అవగాహనా కార్యకలాపాలు చేపట్టాలని నిర్ణయించారు. 

ఇందుకోసం  ప్రతిపాదించిన కార్యకలాపాలు:

i.           అవగాహన / యోగా ర్యాలీలు; 

ii.          పాఠశాల / కళాశాల విద్యార్థులు, సాధారణ ప్రజల కోసం చిత్రలేఖనం / వక్తృత్వం / వ్యాస రచన  / ప్రసంగాలు / పోస్టర్ పోటీలు; 

iii.         యోగాపై సెమినార్లు / వర్క్ షాపులు; 

iv.         యోగాపై సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు; 

v.          యోగాపై చిన్న చిన్న ప్రదర్శనలు; 

vi.        యోగా అవగాహన / బహుళ ప్రయోజనాలు చేకూర్చే ఆరోగ్య శిబిరాలు; 

vii.       పాఠశాల విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించే కార్యక్రమాలు; 

viii.      యోగా మొదలైన ఆరోగ్య పరమైన అంశాలపై ప్రసంగాలు, చర్చా కార్యక్రమాలు. 

ఈ క్రమబద్ధమైన ప్రయత్నాల ద్వారా, ఈ  ద్వీపాలలో ప్రజారోగ్య రంగంలో, యోగా,  శాశ్వతమైన స్థానాన్ని,  పొందే అవకాశం ఉందని, భావిస్తున్నారు.  దీనితో పాటు, ఐ.డి.వై. ద్వారా పెరుగుతున్న ప్రజా ప్రయోజనం, అండమాన్-నికోబార్ దీవులలోని యోగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, యోగా పర్యాటకాన్ని పెంపొందించడానికీ కూడా తోడ్పడుతుందని భావిస్తున్నారు.

 

*****



(Release ID: 1706828) Visitor Counter : 123


Read this release in: Bengali , Urdu , English , Hindi