ఆర్థిక మంత్రిత్వ శాఖ
అటల్ పెన్షన్ యోజన కింద ఫిబ్రవరి 2021 వరకు 57,078.22 లక్షల రూపాయల పంపిణి
Posted On:
22 MAR 2021 3:47PM by PIB Hyderabad
అటల్ పెన్షన్ యోజన కింద ఫిబ్రవరి 2021 వరకు ప్రభుత్వం తన వాటాగా 57,078.22 లక్షల రూపాయలనుచెల్లించిందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఈ రోజు లోక్ఒ సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మంత్రి అటల్ పెన్షన్ యోజన వివరాలను తెలిపారు.
2015 మే తొమ్మిదవ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజనపథకం 2015 జూన్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. బ్యాంకు లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా కలిగి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు వున్నవారు ఈ పథకం పరిధిలోకి వస్తారని అన్నారు. 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత ఖాతాదారులకు పథకం ప్రయోజనాలు అందుతాయని మంత్రి తెలిపారు. పథకం కింద 1,000, 2,000, 3,000, 4,000 మరియు 5,000 రూపాయల పెన్షన్ స్లాబులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ పెన్షన్ కు కేంద్ర ప్రభుత్వ హామీ ఉందని వివరించారు. ఖాతాదారునికి 60 సంవత్సరాల వయస్సు నుంచి లేదా మరణిస్తే ఆయన భార్యకు ప్రభుత్వం పెన్షన్ చెల్లిస్తుందని అన్నారు. ఖాతాదారుడు మరియు అతని భార్యా ఇద్దరూ మరణిస్తే వారి వారసులకు పెన్షన్ నిధిని చెల్లించడం జరుగుతుందని అన్నారు.
సంచిత దశలో వాస్తవ రాబడి కనీస హామీ పెన్షన్ కోసం returns హించిన రాబడి కంటే ఎక్కువగా ఉంటే, అటువంటి అదనపు చందాదారులకు పంపబడుతుంది.
చెల్లింపుల దశలో వాస్తవ రాబడి కనీస హామీ పెన్షన్ కోసంనిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువగా ఉంటే అటువంటి అదనపు మొత్తాన్ని చందాదారులకు బదిలీ చేస్తామని మంత్రి వివరించారు.
ఆదాయం పన్ను చెల్లించకుండా మారే చట్టబద్ద పెన్షన్ పథకంలో సభ్యులు కాకుండా 2015 జూన్ ఒకటి నుంచి 2016 మార్చి 31వ తేదీల మధ్య పథకంలో చేరినవారికి కేంద్రం తన వాటాగా ఏడాదికి 1000 రూపాయలు లేదా ఖాతాదారుడు చెల్లించిన మొత్తంలో 50%( ఏది తక్కువగా ఉంటే అది)ని చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రాల వారీగా 2015 జూన్ నుంచి 2021 ఫిబ్రవరి వరకు కేంద్రం తన వాటాగా చెల్లించిన మొత్తం వివరాలను మంత్రి వివరించారు.
అటల్ పెన్షన్ యోజన పథకంలో మరింత ఎక్కువమంది చేరేలా చూడడానికి ప్రభుత్వం ఈ కింది చర్యలను తీసుకుంటున్నదని మంత్రి సభకు తెలిపారు.
i. కాలానుగుణ ఆదాయాన్ని సంపాదించేవారిని పరిగణనలోకి తీసుకొని చందాదారుల నెలనెలా, త్రైమాసిక మరియు అర్ధ సంవత్సరానికి ఒకసారి తమ వాటాను చెల్లించే వెసులుబాటు కల్పించడం
ii . చందాదారులు ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా పెన్షన్ మొత్తాన్ని పెంచుకోవడానికి లేదాతగ్గించుకొనే సౌకర్యాన్ని కల్పించడం . ఈ సదుపాయాన్ని ఆర్థిక సంవత్సరంలో ఒకసారి వినియోగించుకోవచ్చును.
iii . అటల్ పెన్షన్ యోజన ఖాతాల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక మొబైల్ యాప్ ద్వారా మరియు ఈ- ప్రాన్, ఈ-సాట్ వంటి విలువ ఆధారిత సౌకర్యాలు ద్వారా అటల్ పెన్షన్ యోజన లావాదేవీలు మరియు ఇతర వివరాలను ఆన్ లైన్ లో తెలుసుకొనే అవకాశాన్ని కల్పించడం
iv. అటల్ పెన్షన్ యోజన లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడడానికి బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ వ్యవస్థలను వాడకుండా బ్యాంకుల సేవింగ్స్ అక్కౌంట్లను అనుసంధానం చేయడం
v. నెట్ బ్యాంకింగ్ వ్యవస్థలను వాడకుండా బ్యాంకుల సేవింగ్స్ అక్కౌంట్లను అటల్ పెన్షన్ యోజన తో అనుసంధానం చేయడం కోసం 17 బ్యాంకులను గుర్తించడం జరిగింది.
vi. అటల్ పెన్షన్ యోజన యాప్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్ (UMANG) ప్లాట్‌ఫామ్ తో అనుసంధానం చేయబడింది.
vii. ఇంగ్లీష్, హిందీ మరియు ప్రాంతీయ భాషలలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలుజారీ అవుతున్నాయి.
viii. అటల్ పెన్షన్ యోజన అమలు జరుగుతున్న తీరుపై పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) అధికారులు దేశవ్యాప్తంగా బ్యాంక్ అధికారులతో క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు.
ix. అటల్ పెన్షన్ యోజన ఖాతాదారుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు
x. వివిధ శిక్షణా కార్యక్రమాల ద్వారా బ్యాంకుల అధికారుల సామర్ధ్యాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తన సమాధానంలో వివరించారు.
****
(Release ID: 1706827)
Visitor Counter : 163