సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

2019 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు

Posted On: 22 MAR 2021 3:05PM by PIB Hyderabad

2019 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని ఒమాన్‌కు చెందిన దివంగత హిజ్ మెజెస్టి సుల్తాన్ కబూస్ బిన్ సాయిద్ అల్ సాయిద్‌కు ప్రదానం చేయనున్నారు. మహాత్మా గాంధీ 125 వ జయంతి  సందర్భంగా గాంధీ శాంతి బహుమతి వార్షిక పురస్కారాన్ని 1995 నుండి భారత ప్రభుత్వం అందిస్తోంది.  ఈ అవార్డు జాతీయత, జాతి, భాష, కులం, మతం లేదా లింగంతో సంబంధం లేకుండా ప్రదానం చేయబడుతుంది.

గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గాంధీ శాంతి బహుమతి జ్యూరీ పనిచేస్తుంది.  అలాగే ఇందులో ఇద్దరు ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఉంటారు. వారిలో ఒకరు భారత ప్రధాన న్యాయమూర్తి కాగా మరొకరు లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకులు. ఇద్దరు ప్రముఖ సభ్యులు కూడా జ్యూరీలో ఉన్నారు. వారు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా మరియు సులాబ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు శ్రీ బిందేశ్వర్ పాథక్.

2021 మార్చి 19న జ్యూరీ  సమావేశమైంది. అహింసాత్మక మరియు ఇతర గాంధేయ పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ పరివర్తన కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా (లేట్‌)  హెచ్.ఎమ్. సుల్తాన్ కబూస్ బిన్ సాయిద్ అల్ సాయిద్‌కు  2019 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

గత అవార్డు గ్రహీతలలో టాంజానియా మాజీ అధ్యక్షుడు డాక్టర్ జూలియస్ నైరెరే వంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు; డాక్టర్ గెర్హార్డ్ ఫిషర్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ; రామకృష్ణ మిషన్; బాబా అమ్టే (శ్రీ ముర్లిధర్ దేవిదాస్ అమ్టే); దివంగత డాక్టర్ నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు; గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్; దక్షిణాఫ్రికా ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు; శ్రీ చండి ప్రసాద్ భట్ & ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అలాగే ఇటీవలి అవార్డు గ్రహీతలలో వివేకానంద కేంద్రం, ఇండియా (2015); అక్షయ పాత్రా ఫౌండేషన్, ఇండియా మరియు సులాబ్ ఇంటర్నేషనల్ (సంయుక్తంగా, 2016 కోసం); ఏకల్ అభియాన్ ట్రస్ట్, ఇండియా (2017) మరియు శ్రీ యోహీ ససకావా, జపాన్ (2018).

1 కోటి రూపాయల నగదు బహుమతితో పాటు ఒక ప్రశంసా పత్రం, జ్ఞాపిక మరియు సాంప్రదాయ హస్తకళ / చేనేత వస్తువును అందిస్తారు బహుమతిగా అందిస్తారు.

హిజ్ మెజెస్టి సుల్తాన్ కబూస్ ఒక దూరదృష్టి గల నాయకులు. అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో మితవాదం మరియు మధ్యవర్తిత్వం వంటి జంట విధానం అతనికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు మరియు గౌరవాన్ని అందించింది. వివిధ ప్రాంతీయ వివాదాలు మరియు సంఘర్షణలలో శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.  భారతదేశం మరియు ఒమన్ మధ్య ప్రత్యేక సంబంధాల రూపకర్త హెచ్.ఎం. సుల్తాన్ కబూస్. అతను భారతదేశంలో చదువుకున్నారు. భారతదేశంతో ఎల్లప్పుడూ ప్రత్యేక సంబంధాన్ని కొనసాగించారు. అతని నాయకత్వంలో భారతదేశం మరియు ఒమన్ వ్యూహాత్మక భాగస్వాములుగా మారాయి. పరస్పర ప్రయోజనకరమైన, సమగ్ర భాగస్వామ్యం ప్రయత్నాలను బలోపేతం చేశారు.

హెచ్.ఎం. సుల్తాన్ కబూస్ కన్నుమూసినప్పుడు భారతదేశం-ఒమన్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన సేవలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. "భారతదేశానికి నిజమైన స్నేహితుడు మరియు భారతదేశం మరియు ఒమన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి బలమైన నాయకత్వాన్ని అందించారు" అని తెలిపారు. ప్రధానమంత్రి ఆయనను "దూరదృష్టిగల నాయకుడు మరియు రాజనీతిజ్ఞుడు" మరియు "మా ప్రాంతానికి మరియు ప్రపంచానికి శాంతికి దారి చూపారు" అని జ్ఞాపకం చేసుకున్నారు.

భారతదేశం మరియు ఒమన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు గల్ఫ్ ప్రాంతంలో శాంతి మరియు అహింసను ప్రోత్సహించడానికి దివంగత హెచ్.ఎమ్  సుల్తాన్ కబూస్ బిన్ చేసిన ప్రయత్నాలను మరియు ఆయన అసమాన దృష్టిని మరియు నాయకత్వాన్ని గాంధీ శాంతి బహుమతి గుర్తించింది.


 

*******



(Release ID: 1706684) Visitor Counter : 197