ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ టీకా ;లబ్ధిదారులు
Posted On:
19 MAR 2021 2:55PM by PIB Hyderabad
కోవిడ్-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిమిత్తం ఏర్పాటైన నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ (ఎన్ఈజీవీఏసీ) సిఫారసు మేరకు ఈ క్రింది వర్గాల వారికి కోవిడ్-19 టీకాలకు అర్హులైన వారి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి: ఆరోగ్య సంరక్షణ కార్మికులు, కోవిడ్‌పై పోరులో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న (ఫ్రంట్ లైన్) కార్మికులు, 60 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు, 45 నుండి 59 సంవత్సరాలు ఉండి నిర్ధిష్టమైన కొమొర్బిడిటీలతో బాధ పడుతున్నవారు. టీకా కోసం రిజిస్ట్రేషన్ కోవిన్ 2.0 పోర్టల్/ వెబ్‌సైట్ ద్వారా లేదా ఆరోగ్య సేథు యాప్ ద్వారా రిజిస్టటర్ చేసుకోవచ్చు.
కోవిన్ 2.0 లోని మార్గదర్శక పత్రం ప్రకారం, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పొందటానికి పౌరులు ఈ క్రింది ఫోటో గుర్తింపు పత్రాలలో దేనినైనా ఉపయోగించవచ్చు: ఆధార్ కార్డ్, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (ఈపీఐసీ), పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డ్, ఛాయాచిత్రంతో కూడిన పెన్షన్ పత్రం. కో-విన్ 2.0 లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో లబ్ధిదారులకు COVID టీకా కేంద్రాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది. మార్చి 15, 2021 నాటికి, మొత్తం 3.05 కోట్ల మంది లబ్ధిదారులు (హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు మరియు 45- 59 సంవత్సరాల మధ్య కొమొర్బిడిటీ ఉన్నవారు) కో-విన్ 2.0 పోర్టల్‌లో నమోదు చేయబడ్డారు.
45 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల పౌరులు టీకా పొందేందుకు గాను తగిన అర్హతను నిర్ణయించడానికి పేర్కొన్న 20 కొమొర్బిడిటీల జాబితా ఇలా ఉంది.
***
(Release ID: 1706225)
Visitor Counter : 149