ఆర్థిక మంత్రిత్వ శాఖ

తమిళనాడులో సోదాలు నిర్వహించిన - ఆదాయపు పన్ను శాఖ

Posted On: 17 MAR 2021 5:11PM by PIB Hyderabad

పెద్ద మొత్తంలో నగదును నిర్వహించడం, విదేశీ సంస్థలతో పాటు వాటి సంబంధిత సంస్థల బ్యాంకు ఖాతాల ద్వారా లెక్కలోకి రాని ధనాన్నీ, ఆ డబ్బును రౌటింగ్ చేయడంలో పాల్గొన్న వ్యక్తుల విషయంలోనూ, ఆదాయపు పన్ను శాఖ, 2021 మార్చి 11వ తేదీన సోదాలు నిర్వహించింది.  చెన్నై, కోయంబత్తూర్, సేలం, విరుధు నగర్, థేనిలలో ఉన్న 20 ప్రాంగణాల్లో ఈ సోదాలు జరిగాయి. 

వ్యవసాయ వస్తువుల అమ్మకం, కొనుగోలు ముసుగులో వివిధ సంస్థల ద్వారా 100 కోట్లు సంపాదించినట్లు, సోదాలు నిర్వహించిన ప్రాంగణంలో లభించిన ఆధారాల ద్వారా బయటపడింది. అయితే, అక్కడ, అలాంటి కార్యకలాపాలు లేవు, స్టాక్ లేదు.  అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన బిల్లులను వారి ఉద్యోగులే నకిలీవి సృష్టించినట్లు కనుగొనబడింది.  ఇంకా, బ్యాంకు రుణాలు పొందటానికి టర్నోవర్‌ను మార్చటానికి ఈ సంస్థల మధ్య అమ్మకాలు, స్టాక్ పంపిణీ వంటివి కూడా నకిలీ లావాదేవీలు చేయబడ్డాయి.  ఈ సంస్థలలో చాలా సంస్థలు ఇంతవరకు ఎటువంటి పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు.

కాగా,  ఒక విదేశీ సంస్థ నుండి డిబెంచర్ ఇష్యూ ద్వారా ఆ బృందంలోని సంస్థలు 150 కోట్ల రూపాయలు అందుకున్నారు, సోదాల్లో లభించిన ఆధారాలతో, ఇది కూడా ఒక లావాదేవీగా తేలింది,  మొత్తం డబ్బు ఈ వ్యక్తుల వ్యక్తిగత ఖాతాలకు వెళ్ళింది.

వీటితో పాటు, బృందంలోని సంస్థలు, సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేసుకున్నాయి. అక్కడ కూడా దిగుమతి వ్యయాన్ని సుమారు 25 కోట్ల రూపాయలుగా ఎక్కువ మొత్తంతో బిల్లు చేశారు.  ఈ మేరకు, నిధులను  భారతదేశం నుండి బదిలీ చేసి, ఇతర దేశాలలోని వారి వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారు. 

ఈ సోదాల్లో, గత మూడు, నాలుగు సంవత్సరాల్లో చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర పట్టణాలలోని ప్రధాన ప్రదేశాల్లో  సర్కిల్ రేట్ల కన్నా తక్కువ విలువతో అనేక స్థిరమైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా ఆధారాలు లభించాయ.   ఈ ఆస్తులను ఐ.టి. రిటర్న్స్‌ లో కూడా ఈ ఆస్తులను వెల్లడించలేదు.

ఈ సోదాల్లో, 25 కి పైగా విలాసవంతమైన కార్లు కనుగొనబడ్డాయి, వీటిలో చాలా వరకు లెక్కల్లో వెల్లడించలేదు. వీటితో పాటు, లెక్కల్లో ప్రకటించని విదేశీ బ్యాంకు ఖాతాలు, విదేశీ క్రెడిట్ కార్డులు, విదేశీ సంస్థలలో పెట్టుబడులు ఉన్నట్లు కూడా ఆధారాలు లభించాయి. 

ఈ సోదాల్లో, ఇంతవరకు, లెక్కల్లో వెల్లడించని 50 లక్షల రూపాయల మేర నగదు, 3 కోట్ల రూపాయలు విలువచేసే ఆభరణాలు, 12.5 కోట్ల రూపాయల విలువచేసే  9 విలాసవంతమైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటివరకు చేసిన సోదాల్లో లెక్కలోకిరాని సుమారు 400 కోట్ల రూపాయల మేర లెక్కల్లోకి రాని ఆదాయాన్ని స్వాధీనం చేసుకున్నారు.  నల్ల ధనానికి చెందిన చట్టం కింద కూడా తగిన దర్యాప్తు చేపట్టనున్నారు. 

తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. 

*****



(Release ID: 1705636) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Hindi