ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వృద్ధుల జనాభాపై ఎల్ఏఎస్ఐ నివేదిక

Posted On: 16 MAR 2021 1:21PM by PIB Hyderabad

దేశంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులలో దీర్ఘకాలిక వ్యాధులు పరిస్థితులపై 'లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఆఫ్ ఇండియా' (ఎల్ఏఎస్ఐ) వేవ్-1 సమాచారాన్ని సేకరించింది. వాటి వివ‌రాలు ఈ కింద‌న తెల‌ప‌బడ్డాయి:
 

దీర్ఘకాలిక పరిస్థితుల ప్రాబల్యంపై స్వయంగా నివేదించబడిన‌వి

క్ర‌మ సంఖ్య

ప‌రిస్థితి

Percentage

1

ర‌క్త‌పోటు

32%

2

స్ట్రోక్

2.7 %

3

మ‌ధుమేహం మ‌రియు ర‌క్తంలో అధిక చ‌క్కెర

14.2 %

4

దీర్ఘ‌కాలిక ఉపిరితిత్తుల వ్యాధి

8.3 %

 

వృద్ధుల శ్రేయస్సును నిర్ధారించే లక్ష్యంతో వ‌యోవృద్ధుల కోసం ఎంఎస్‌జేఅండ్ఈ నేషనల్ పాలసీ (ఎన్‌పీఓపి)-1999 రూపొందించింది. ఎన్‌పీఓపీ-1999 వృద్ధుల శ్రేయ‌స్సు కోసం మొత్తం 14 సూత్రప్రాయ ప్రాంతాల‌లో జోక్య చేసుకోవాల‌ని సూచిస్తోంది. ఇందులో సూచించిన‌ సూత్రప్రాయమైన రంగాలలో ఒకటి ఆరోగ్య సంరక్షణ & పోషకాహారం. దేశంలో వృద్ధుల ఆరోగ్య సంబంధిత వివిధ సమస్యలను పరిష్కరానికి గాను 2010-11లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ “వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ కార్యక్రమం” (ఎన్‌పీహెచ్‌సీఈ)ని ప్రారంభించింది.


వృద్ధుల ఆరోగ్య సంరక్షణ జాతీయ కార్యక్రమం (ఎన్‌పీహెచ్‌సీఈ) అనేది వికలాంగుల హక్కులపై “యుఎన్ కన్వెన్షన్ అన్ ది రైట్స్ ఆఫ్ ప‌ర్స‌న్స్ విత్ డిజేబులిటీస్” ‌(యుఎన్‌సీఆర్‌పీడీ) కింద సూచించిన విధంగా ప్రభుత్వ అంతర్జాతీయ, జాతీయ కట్టుబాట్లగ ఉచ్చారణగా చెప్ప‌వ‌చ్చు. 1999లో భారత ప్రభుత్వం వృద్ధులపై జాతీయ విధానంను (ఎన్‌పీఓపీ) చేప‌ట్టింది. సీనియర్ సిటిజన్ యొక్క వైద్య సంరక్షణ కోసం నిబంధనలతో వ్యవహరించే విష‌య‌మై “తల్లిదండ్రుల నిర్వహణ, సంక్షేమం, సీనియర్ సిటిజన్స్ చట్టం, 2007”లోని సెక్షన్ 20 మేర‌కు దీనిని తీర్చిదిద్ద‌డ‌మైంది.


ఈ కార్యక్రమం రాష్ట్ర ఆధారితమైనది. ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ ఆరోగ్య సంరక్షణ యొక్క వివిధ స్థాయిలలో సీనియర్ సిటిజన్లకు (60 సంవత్సరాల వయస్సుకు పైబ‌డిన వారి) ప్ర‌త్యేక‌మైన‌ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రాథమిక ల‌క్ష్యం.

లక్ష్యాలు:
వృద్ధ‌ జనాభాకు ప్రాప్యత‌తో కూడిన‌ సరసమైన, అధిక-నాణ్యత క‌లిగిన‌ దీర్ఘకాలిక, సమగ్ర మరియు అంకితమైన సంరక్షణ సేవలను అందించడం; వృద్ధాప్య ప్ర‌జ‌ల నిమిత్తం కొత్త త‌ర‌హా ఆర్కిటెక్చ‌ర్‌ సృష్టించడం; "అన్ని వయస్కుల వారితో కూడిన‌ సమాజం" కోసం అనువైన మేటి వాతావరణాన్ని సృష్టించే దిశ‌గా ఒక ఫ్రేమ్‌వర్క్‌ నిర్మించడం. చురుకైన మరియు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం భావనను ప్రోత్సహించడం; జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, ఆయుష్ మరియు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ వంటి ఇతర డిపార్ట్‌మెంట్ల వారి సౌజ‌న్యంతో
వృద్ధుల ప్ర‌యోజ‌నార్థం కృషి చేయ‌డం.

 

సేవల ప్యాకేజీ:
-ఓపీడీ మరియు ఇండోర్ సౌకర్యాల ద్వారా తృతీయ సంరక్షణ సేవలు, వృద్ధాప్య వైద్యంలో వివిధ కోర్సులతో పాటు ప్రాంతీయ వృద్ధాప్య కేంద్రాలలో పరిశోధన మరియు వృద్ధాప్యం కోసం జాతీయ కేంద్రం ద్వారా ప్రత్యేక మానవ వనరుల అభివృద్ధి.
-వృద్ధాప్య క్లినిక్‌లు, పరిశోధనలు మరియు పునరావాస సేవల ద్వారా జిల్లా ఆసుపత్రులలో, ఉప జిల్లా స్థాయిలో ద్వితీయ మరియు ప్రాథమిక సంరక్షణ సేవల‌ను అందుబాటులో ఉంచ‌డం. వృద్ధాప్య క్లినిక్‌లు, పరిశోధనలు & పునరావాస సేవలు, మంచం మీద ఉన్న వృద్ధుల కోసం పునరావాస కార్మికుడి నివాస సందర్శనల ఏర్పాటు,ఇలాంటి రోగుల సంరక్షణ, ఆరోగ్య విద్యకు సంబంధించి కోసం కుటుంబ సభ్యులకు సలహా ఇవ్వడం. 

 

కేంద్ర స‌హాయ మంత్రి (ఆరోగ్య, కుటుంబ సంక్షేమం) శ్రీ‌ అశ్విని కుమార్ చౌబే ఈ రోజు ఇక్కడ రాజ్యసభలో ఒక ప్ర‌శ్న‌కు లిఖితపూర్వక సమాధానంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
                                                                                                        

                                                                                                                               

*****


(Release ID: 1705252) Visitor Counter : 219


Read this release in: English , Urdu , Bengali , Malayalam