ఆర్థిక మంత్రిత్వ శాఖ
పరోక్ష పద్దతిలో 2021 మార్చి 10 నాటికి 82,072 ఆదాయం పన్ను మదింపులు పూర్తి
Posted On:
16 MAR 2021 5:02PM by PIB Hyderabad
వ్యకిగత హాజరులేకుండా పరోక్షపద్ధతిలో ఆదాయం పన్ను మదింపులను పూర్తి చేస్తున్నామని కేంద్ర ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ సింగ్ తెలిపారు. రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఈరోజు ఇచ్చిన సమాధానంలో మంత్రి కొన్ని సందర్భాలలో మినహా అన్ని ఆదాయం పన్ను మదింపులను పరోక్ష విధానంలో పూర్తి చేస్తున్నామని అన్నారు. i. కేంద్ర ఛార్జీలకు సంబందించిన కేసులలో అసెస్‌మెంట్ ఆర్డర్లు, ii అంతర్జాతీయ పన్ను ఛార్జీలకు సంబందించిన కేసులలో అసెస్‌మెంట్ ఆర్డర్ లలో మినహా మిగిలిన అన్ని పన్ను మధింపులు పరోక్ష పద్దతిలో జరుగుతున్నాయని మంత్రి వివరించారు.
జవాబుదారీతనం, పారదర్శకతతో మరింత సమర్ధంగా మదింపుదారుని మొత్తం ఆదాయం లేదా నష్టాన్ని ఆదాయం పన్ను చట్టం 1961 లోని సెక్షన్143 (3) లేదా 144 కింద పన్నుఅంచనా వేయడానికి మదింపుదారుడు, మదింపు వేసే అధికారి నేరుగా సమావేశం కాకుండా సాధ్యమైనంత ఎక్కువగా సాంకేతికంగా వెసులుబాటులో ఉండేలా ఒక అధికారి పరిధిలో అధికారులు సభ్యులుగా వుండే బృందం ఈ విధులను నిర్వర్తిస్తుందని మంత్రి వివరించారు.
2021 మార్చి 10వ తేదీవరకు 82,072 మదింపులను పరోక్ష పద్దతిలో పూర్తి చేశామని మంత్రి సభకు తెలిపారు.
సిబిడిటి ప్రవేశ పెట్టిన పరోక్ష పన్ను మదింపు విధానంపై మదింపుదారుల నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సిఎఇఆర్), ఆర్థిక వ్యవహారాల విభాగం (డిఇఎ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) లు ఎన్‌సిఎఇఆర్ ఆధ్వర్యంలో స్వతంత్ర అధ్యయనాన్ని నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయని మంత్రి వివరించారు.
జిఎస్‌టి మదింపులను పరోక్ష పద్దతిలో నిర్వహించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని మంత్రి తన సమాధానంలో తెలిపారు. అమలులో వున్న జిఎస్‌టి చట్టాలు మరియు నియమాల కింద సాధారణ పోర్టల్‌లో రాబడిని అంచనా ఎలక్ట్రానిక్ ఫైలింగ్ వేయడానికి అవకాశం ఉందని దీనిని దృష్టిలో ఉంచుకుని జిఎస్‌టి మదింపులను పరోక్ష పద్దతిలో పరిశీలించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో లేదని మంత్రి పేర్కొన్నారు. తీవ్రమైన మోసం దర్యాప్తు కార్యాలయానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని మంత్రి తెలిపారు.
***
(Release ID: 1705248)
Visitor Counter : 174