ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కరోనా వైరస్‌ను ట్రాక్ చేయడానికి డిజిటల్ ప్రక్రియ
Posted On:
15 MAR 2021 2:48PM by PIB Hyderabad
దేశంలో కరోనా మరియు ఇతర అంటు వ్యాధులతో బాధపడుతున్న రోగులను గుర్తించడానికి / ట్రాక్ చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వాటి
వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:-
ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం (ఐడీఎస్‌పీ):- ఐడీఎస్‌పీ కింద, అన్ని రాష్ట్రాలు, జిల్లా ప్రధాన కార్యాలయాలలో తగు నిఘా యూనిట్లు స్థాపించబడ్డాయి. ఇవి అంటువ్యాధి బారినపడే వ్యాధుల వారి సమాచార వివరాలను వారంవారం నివేదిస్తున్నాయి. రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్(ఆర్‌ఆర్‌టీ) ద్వారా వ్యాధి పోకడలను పర్యవేక్షించడానికి వ్యాధి తీరును పెరుగుతున్న ప్రారంభ దశలోనే వ్యాప్తిని గుర్తించడానికి గాను తగు విధంగా ప్రతిస్పందించేందుకు గాను డేటా సేకరించబడుతుంది. చైనా, హాంకాంగ్, తైవాన్ వంటి వివిధ దేశాల నుండి వచ్చే ప్రయాణీకులను ట్రాక్ చేయడానికి మరియు అనుసరించడానికి కోవిడ్-19 వ్యాధికి సంబంధించి ఐడీఎస్‌పీ కూడా సన్నద్ధమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఆరోగ్యసేథు యాప్ కోవిడ్ -19 కాంటాక్ట్ ట్రేసింగ్, లక్షణాల మ్యాపింగ్ మరియు స్వీయ-అంచనాలకు గాను ఇది ఉపయోగపడుతుంది. ఇది కోవిడ్ -19 క్లస్టర్‌లను గుర్తించడంలో తగు విధంగా సహాయపడుతుంది. కోవిన్ యాప్ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్‌ఫాం, ఇది కోవిడ్ -19 టీకా కార్యక్రమాన్ని ట్రాక్ చేయడానికి మరియు కోవిడ్ -19 టీకా షాట్ కోసం భారతీయ పౌరులను దరఖాస్తు చేసుకోవడానికి ఏజెన్సీలకు సహాయపడుతుంది. కోవిడ్ -19 మహమ్మారి నిర్వహణ యొక్క వివిధ అంశాలకు సంబంధించిన కేసుల సంఖ్య, మౌలిక సదుపాయాల లభ్యత పరీక్ష మొదలైన వాటికి సంబంధించిన రాష్ట్ర నిర్దిష్ట డేటాను సేకరించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్-ఇండియా పోర్టల్ & టెస్టింగ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. అంటు వ్యాధి బారినపడేందుకు కారణాలు, వ్యాధుల కారణాలు తెలుసుకోవడం, దాని వ్యాప్తిని గుర్తించి, స్పందించే లక్ష్యంతో.. ఐడీఎస్‌పీని అన్ని రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలలో నేషనల్ హెల్త్ మిషన్ కింద అమలు చేస్తున్నారు. ఐడీఎస్‌పీ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలో మహమ్మారుల వ్యాప్తిని కట్టడి చేసేందుకు అదనపు మానవ శక్తిని, వ్యాప్తి పరిశోధనల కోసం గుర్తించిన.. రాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్ఆర్‌టీ) సభ్యులకు తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు ఆయా అంటువ్యాధులను గుర్తించడానికి ప్రయోగశాలలను బలోపేతం చేయడం, డేటా ఎంట్రీ కోసం ఐటీ పరికరాలు, విశ్లేషణ డేటా బదిలీ వంటి చర్యలు చేపట్టడమైంది. దీనికి తోడు ఈ మంత్రిత్వ శాఖ కేంద్ర స్థాయి నుండి ఆరోగ్య అవగాహనకు మీడియా ప్రచారాలను బ్యూరో ఆఫ్ అవుట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో మొదలైన వాటి ద్వారా విడుదల చేస్తోంది.
స్వస్థ్ నాగరిక్ అభియాన్ (ఎస్ఎన్ఏ) క్రింద ఈ మంత్రిత్వ శాఖ గత ఐదేళ్ళలో చేసిన ఖర్చుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
సంవత్సరం
|
వ్యయం
(కోట్లలో రూ.)
|
2015-16
|
223.07
|
2016-17
|
251.08
|
2017-18
|
188.47
|
2018-19
|
226.57
|
2019-20
|
132.20
|
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
*****
(Release ID: 1704987)
Visitor Counter : 134