ఆర్థిక మంత్రిత్వ శాఖ

2019-20లో 49.87కోట్ల మందికి ఆరోగ్య బీమా కవరేజీ

Posted On: 15 MAR 2021 4:55PM by PIB Hyderabad

   2019-20వ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా కవరేజీ కింద మొత్తం 49.87కోట్ల మందికి బీమా సదుపాయం కల్పించినట్టు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐ.ఆర్.డి.ఎ.) పేర్కొంది. పర్సనల్ యాక్సిడెంట్, ట్రావెల్ బిజినెస్ మినహాయిస్తూ ఈ కవరేజీ కల్పించినట్టు ఐ.ఆర్.డి.ఎ. తెలిపింది.  ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయం తెలిపారు

  ఆరోగ్య బీమా కవరేజీ కింద గత ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి, అదే ఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకూ మొత్తం 30.22కోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పించినట్టు ఐ.ఆర్.డి.ఎ. పేర్కొందని మంత్రి తెలిపారు. అంతకు ముందు సంవత్సరం,  అంటే 2019 ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి అదే ఏడాది సెప్టెంబరు 30వరకూ 17.83కోట్ల మందికి మాత్రమే బీమా సదుపాయం కల్పించారని, అంటే గత ఏడాది ఈ బీమా వాణిజ్యంలో 69.8శాతం వృద్ధి నమోదైందని కేంద్రమంత్రి తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ఆరోగ్య బీమా ప్రీమియంలో అసాధారణ వృద్ధి ఏమీ నమోదు కాలేదని కేంద్రమంత్రి సభకు తెలిపారు.

 

*****



(Release ID: 1704977) Visitor Counter : 76


Read this release in: English , Urdu , Marathi