భారత ఎన్నికల సంఘం

నందిగ్రామ్ సంఘటనపై ఎన్నికల సంఘం చర్యలు

Posted On: 14 MAR 2021 5:51PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై ఈ నెల 10వ తేదీన నందిగ్రామ్ లో జరిగిన దాడి  సంఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి సమర్పించిన నివేదికను ప్రత్యేక సాధారణ పరిశీలకుడు శ్రీ అజయ్ నాయక్ప్రత్యేక పోలీస్ పరిశీలకుడు శ్రీ వివేక్ దూబే సంయుక్తంగా సమర్పించిన నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు పరిశీలించింది. 

పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి సమర్పించిన నివేదిక పూర్బా మెడినిపూర్ జిల్లా మెజిస్ట్రేట్ మరియు 210 నందిగ్రామ్ శాసనసభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అందజేసిన నివేదికలుసంఘటనకు దారి తీసిన పరిస్థితులపై ప్రత్యేక పరిశీలకులు అందజేసిన నివేదికల ఆధారంగా ఎన్నికల సంఘం ఈ కింది నిర్ణయాలను తీసుకోవాలని నిర్ణయించింది. 

1 )  శ్రీ వివేక్ సహాయ్ ఐపిఎస్డైరెక్టర్ సెక్యూరిటీని డైరెక్టర్ సెక్యూరిటీ పదవి నుంచి  తొలగించి వెంటనే సస్పెన్షన్‌లో ఉంచాలి. జెడ్ + రక్షణలో వున్న వ్యక్తికి రక్షణ కల్పించే అంశంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై  వారంలోపు అతనిపై అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేయాలి. 

2 ) నిబంధనలకు అనుగుణంగా డీజీపీ తో చర్చించి సరైన వ్యక్తిని  డైరెక్టర్ సెక్యూరిటీగా ముఖ్య కార్యదర్శి నియమించాలి. ఈ నియామక ఉత్తర్వులను 2021 మార్చ్ 15వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోగా సంఘానికి పంపాలి. 

3 ) జెడ్ + రక్షణలో వున్న వ్యక్తికి రక్షణ కల్పించే అంశంలో విధి నిర్వహణలో విఫలమైన డైరెక్టర్ సెక్యూరిటీ కాకుండా ఇతర అధికారులను గుర్తించి మూడు రోజుల లోగా వారిపై ప్రధాన కార్యదర్శి డిజీపీ సభ్యులుగా వుండే కమిటీ తగిన చర్యలను తీసుకుని వీటి వివరాలను కమిషన్ కు 2021 మార్చ్ సాయంకాలం అయిదు గంటలలోగా కమిషన్ కు తెలియజేయాలి. 

4) విభూ గోయెల్ ఐఏఎస్ స్థానంలో పూర్బా మెడినిపూర్ డిఎం మరియు డి ఈ ఓ గా శ్రీమతి స్మితా పాండే ఐఏఎస్ 2005 ను వెంటనే నియమించాలి.  ఎన్నికలతో సంబంధం లేని పదవికి విభూ గోయెల్ ఐఏఎస్ ను బదిలీ చేయాలి. 

5) బందోబస్త్ కల్పించడంలో పూర్తిగా విఫలమైన శ్రీ ప్రవీణ ప్రకాష్ఐపిఎస్ఎస్పీ పూర్బా మెడినిపూర్ కూడా వెంటనే సస్పెండ్ చేసి ఆయనపై అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేయాలి. 

6) శ్రీ ప్రవీణ ప్రకాష్ స్థానంలో  ఎస్పీ పూర్బా మెడినిపూర్ గా శ్రీ సునీల్ కుమార్ యాదవ్ఐపిఎస్: 2009ని వెంటనే నియమించాలి. 

7) నందిగ్రామ్ సంఘటనపై నమోదైన -03-2021 నాటి నందిగ్రామ్ పిఎస్ కేస్ నంబర్ 97/21 విచారణ 15 రోజులలో పూర్తయి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకొని దీనిపై కమిషన్ కు 2021 మార్చ్ 31వ తేదీనాటికి నివేదిక అందించాలి.  

ఎన్నికలసమయంలో ప్రచారం నిర్వహించే  స్టార్ క్యాంపెయినర్లకు భద్రత కల్పించాలని కమిషన్ ఆదేశించింది.  శాంతిభద్రతలతో ముడిపడిన ఈ అంశం ప్రజలు ఎక్కువగా గుమికూడే సమయాల్లో మరింత సున్నిత అంశంగా మారుతుంది కాబట్టి,సంబంధిత వ్యక్తికీ కల్పించే రక్షణ తరగతికి అనుగుణంగా వారి కార్యక్రమ వివరాలను ముందుగానే తెలియచేయడంసభలు ప్రదర్శనలను నిర్వహించడానికి ముందుగా అనుమతులు పొందేలా చూడడంమోటారు వాహనాల చట్టం తదితర నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగేలా చూడడానికి పోలీస్  ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది. అనుమతులు పొందిన తరువాత మాత్రమే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో మార్పులు చేసుకోవడానికి అనుమతించాలని కమిషన్ ఆదేశాలు జారీచేసింది. 

ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సీఈఓ లకు పై అంశాలను విడిగా ఆదేశాలను జారీ చేయాలని కమిషన్ నిర్ణయించింది. స్టార్ క్యాంపెయినర్ల రక్షణ భద్రతకు సంబంధించి వారికి కల్పిస్తున్న రక్షణస్థానికంగా ఎదురయ్యే సమస్యలు తదితర అంశాలను రాజకీయ పార్టీలకు తెలియజేసి భద్రత నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కమిషన్ నిర్ణయించింది. 

ఇంతేకాకుండా,పశ్చిమ బెంగాల్ శాసనసభకు సార్వత్రిక ఎన్నికలకు ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా పంజాబ్ మాజీ డిజిపి ఇంటెలిజెన్స్శ్రీ అనిల్ కుమార్ శర్మ(రిటైర్డ్ ఐపిఎస్ 1984 పంజాబ్ కేడర్) . పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలనిర్వహణకు శ్రీ వివేక్ దుబేతో పాటు శ్రీ కె కె శర్మను  రెండవ స్పెషల్ పోలీస్ పరిశీలకుడిగాభారత ఎన్నికల కమిషన్ నియమించింది. 

***

 



(Release ID: 1704742) Visitor Counter : 93


Read this release in: English , Urdu , Hindi , Bengali