ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

‘ప్ర‌ధానమంత్రి స్వాస్థ్య సుర‌క్షా నిధి’ ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినమంత్రిమండ‌లి;  ఇది ఆరోగ్యం, విద్య‌సుంకం రూపేణా రాబ‌డుల లో నుంచి ఆరోగ్యం కోసం ప్ర‌త్యేకం గా ఏర్పాటు చేసే ఒకసింగిల్ నాన్- లాప్స‌బుల్‌ రిజ‌ర్వు ఫండు గా ఉంటుంది

Posted On: 10 MAR 2021 2:05PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి స్వాస్థ్య సుర‌క్షా నిధి (పిఎమ్ఎస్ఎస్ఎన్‌)ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది. ఇది ఫైనాన్స్ యాక్ట్, 2007 లోని సెక్ష‌న్ 136-బి ప్ర‌కారం విధించిన ఆరోగ్యం, విద్య‌ సుంకం రూపేణా రాబ‌డుల లో నుంచి ఆరోగ్యం కోసం ఉద్దేశించిన ఒక సింగిల్ నాన్- లాప్స‌బుల్ రిజ‌ర్వు ఫండ్ రూపం లో ఉంటుంది.

పిఎమ్ఎస్ఎస్ఎన్ తాలూకు ముఖ్యాంశాలు

  1. ప‌బ్లిక్ అకౌంటు లో ఆరోగ్యం కోసం ఉద్దేశించిన ఒక నాన్‌- లాప్స‌బుల్ రిజ‌ర్వు ఫండ్ ఇది;
  2. ఆరోగ్యం, విద్య సుంకం లో ఆరోగ్యం తాలూకు వాటా సొమ్ము ను పిఎమ్ఎస్ఎస్ఎన్ లో జ‌మ చేయ‌డం జ‌రుగుతుంది;
  3. పిఎమ్ఎస్ఎస్ఎన్ లోకి జమ అయిన సొమ్ముల‌ ను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ కు చెందిన ప్ర‌ధాన ప‌థ‌కాల కోసం వినియోగించ‌నున్నారు; అవి ఏవేవేంటే,

· ఆయుష్మాన్ భార‌త్ - ప్ర‌ధాన మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న (ఎబి- పిఎమ్ జెఎవై)

· ఆయుష్మాన్ భార‌త్ - హెల్త్ ఎండ్ వెల్‌నెస్ సెంట‌ర్స్ (ఎబి- హెచ్ డబ్ల్యుసి స్)

· నేశ‌న‌ల్ హెల్థ్ మిశ‌న్‌

· ప్ర‌ధాన‌ మంత్రి స్వాస్థ్య సుర‌క్ష యోజ‌న (పిఎమ్ ఎస్ఎస్ వై)

· అత్యసర పరిస్థితి మరియు విపత్తుల వేళల్లో సన్నద్ధత; ఆరోగ్య సంబంధిత అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల లో ప్ర‌తిస్పంద‌నపూర్వక చ‌ర్య‌ లు చేప‌ట్ట‌డం

· 2017 నాటి జాతీయ ఆరోగ్య విధానం (ఎన్‌హెచ్‌పి) లో నిర్దేశించుకొన్న ల‌క్ష్యాలు, ఎస్‌డిజి స్ సాధ‌న దిశ లో పురోగ‌తి కోసం త‌ల‌పెట్టే మ‌రేదైనా భావి కార్య‌క్ర‌మం లేదా ప‌థ‌కాలు.

  1. పిఎమ్ఎస్ఎస్ఎన్ తాలూకు ప‌రిపాల‌న, నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల ను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కు అప్ప‌గించ‌డ‌మైంది; ఇంకా
  2. ఏదైనా ఆర్థిక సంవ‌త్స‌రం లో, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ కు చెందిన ప‌థ‌కాల పై పెట్టే ఖ‌ర్చు ను మొదట పిఎమ్ఎస్ఎస్ఎన్ నుంచి ఖర్చు చేసి మరి ఆ తరువాత నుంచి గ్రాస్ బడ్జెటరీ సపోర్టు (జిబిఎస్) నుంచి వెచ్చించడం జరుగుతుంది.

ప్ర‌యోజ‌నాలు:

ఈ నిర్ణ‌యం వ‌ల్ల క‌లిగే ప్ర‌ధాన ప్ర‌యోజ‌నం ఏమిటంటే, ప్ర‌త్యేకం గా కేటాయించిన వ‌న‌రులు అందుబాటు లోకి రావ‌డం వ‌ల్ల సార్వజనిక ఆరోగ్య సంరక్షణ ను, త‌క్కువ ఖ‌ర్చు లో ఆరోగ్య సంర‌క్ష‌ణ ను అందించే అవ‌కాశాలు అధికం అవుతాయి. దీనితో పాటు, ఇందుకు వెచ్చించే సొమ్ము ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌ర‌లో ర‌ద్దయిపోకుండా చూసే వీలు కూడా ఉంటుంది.

పూర్వ‌రంగం:

అభివృద్ధి తాలూకు ఫలితాలు మెరుగుప‌డాలంటే అందుకు ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కీలకం. ఆర్థిక దృష్టికోణం తో చూసిన‌ప్పుడు, మెరుగైన ఆరోగ్యం ఉత్ప‌ాదకత ను పెంచుతుంది. అంతేకాదు, అకాల మ‌ర‌ణం, దీర్ఘ‌కాలం పాటు శారీరిక వైఫ‌ల్యం, ముందుగానే ప‌ద‌వీ విర‌మ‌ణ చేయడం వంటి వాటి వ‌ల్ల ఎదుర‌య్యే న‌ష్టాల ను కూడా త‌గ్గించ‌డానికి వీలు ఉంటుంది. ఆరోగ్యం, పోష‌ణ సంబంధి విజ్ఞ‌ానం అనేవి విద్యా సంబంధి కార్య‌సాధ‌న‌ల పై ప్ర‌త్య‌క్ష ప్ర‌భావాన్ని చూపడం తో పాటు ఉత్ప‌ాదకత పైన, ఆదాయం పైన ప్ర‌భావాన్ని ప్ర‌స‌రింప‌ చేస్తాయి. ఆరోగ్య రంగం పై చేసిన ప్ర‌భుత్వ వ్య‌యం పై స్వాస్థ్య సంబంధిత ఫ‌లితాలు చెప్పుకోద‌గ్గ స్థాయి లో ఆధారపడి ఉంటాయి. జ‌నాభా జీవ‌న కాలం లో అద‌నం గా ఒక సంవ‌త్స‌రం వచ్చి చేరిందా అంటే గనక త‌ల‌స‌రి జిడిపి లో 4 శాతం పెరుగుద‌ల తో పాటు ఆరోగ్య రంగానికి అవసరమైన శ్రమికుల బలగం విస్తరించవలసిన అవసరం ఎంతయినా ఉన్నందువల్ల ఆరోగ్యం రంగం లో పెట్టుబ‌డి మిలియ‌న్ల కొద్దీ ఉద్యోగాల కల్పన కు (చాలావరకు మహిళల కు) ఆస్కారం ఉంటుంది.

ఆర్థిక మంత్రి 2018వ సంవ‌త్స‌రం బ‌డ్జెటు ప్రసంగం లో, ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని గురించి ప్ర‌క‌టిస్తూనే, అప్ప‌టి 3 శాతం విద్య సుంకానికి బ‌దులు గా 4 శాతం ఆరోగ్యం, విద్య సుంకాన్ని ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు కూడా ప్రకటించారు.

***



(Release ID: 1703772) Visitor Counter : 102