ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మానసిక ఆరోగ్య సహాయానికి కోవిడ్-19హెల్ప్‌లైన్‌లు
Posted On:
09 MAR 2021 1:23PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి విస్తరణ, లాక్‌డౌన్ సమయంలో ప్రజల మానసిక ఆరోగ్యం, మానసిక సామాజిక ఆందోళనల పరిష్కారానికి గాను 29 మార్చి, 2020న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో పని చేసే ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ జాతీయ స్థాయిలో నిరంతరాయంగా పని చేసే హెల్ప్‌లైన్ (080-4611 0007) 'సెంటర్ ఫర్ సైకలాజికల్ సపోర్ట్ ఇన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్'ను ప్రారంభించింది. 27 ఫిబ్రవరి 2021 నాటికి ఈ హెల్ప్‌లైన్‌కు 3,37,556 కాల్‌లు వచ్చాయి. 53,081 మందికి నిర్దిష్టమైన సహాయం/ తగిన జోక్యంతో సహాయం అందించింది. దీనికి తోడు కేంద్రంలోని రెండు జాతీయ సంస్థలు.. లోకప్రియా గోపీనాథ్ బోర్డోలోయి రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (ఎల్‌జీబీఆర్ఐ ఎంహెచ్), రాంచీలోని తేజ్‌పూర్ మరియు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ (సీఐపీ)లు రాష్ట్రాలు / యుటీలతో కలిసి ఇతర పలు స్థానిక భాషలలో ఇటువంటి సేవలను విస్తరించేందుకు ముందుకు వచ్చాయి. దీనికి తోడు తేజ్‌పూర్‌లోని ఎల్‌జీబీఆర్ఐఎంహెచ్ చికిత్సా కౌన్సెలింగ్ మరియు సైకో థెరపీలో సహాయం అందించడానికి మరో రెండు సహాయ హెల్ప్‌లైలను ప్రారంభించింది. మరోవైపు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ.. మానసిక ఆరోగ్య పునరావాస హెల్ప్‌లైన్ “కిరణ్”ను (1800-500-0019) ప్రారంభించింది. 13 భాషల్లో ఈ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 24 గంటలూ వారంలో ఏడు రోజులు పాటు నిరంతరాయంగా పని చేస్తుంది. ఈ హెల్ప్‌లైన్‌లో 660 క్లినికల్/ రిహాబిలిటేషన్ సైకాలజిస్టులు మరియు 668 మంది మనోరోగ వైద్యులు సేవల్ని అందిస్తున్నారు. ప్రారంభంలోనే స్క్రీనింగ్; ప్రథమ చికిత్స; మానసిక మద్దతు; బాధ నిర్వహణ; మానసిక శ్రేయస్సు; విపరీత ప్రవర్తనల నివారణ; మానసిక సంక్షోభ నిర్వహణ మరియు మానసిక ఆరోగ్య నిపుణులకు రిఫెరల్ వంటివి ఈ హెల్ప్‌లైన్ యొక్క లక్ష్యాలు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి మన సమాజంలోని వివిధ విభాగాల కోసం పలు మార్గదర్శకాలు, సలహాలు మరియు న్యాయవాద అంశాలు అభివృద్ధి చేయబడ్డాయి. వీటిని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్‌లో “బిహేవియరల్ హెల్త్ - సైకోలాజికల్ హెల్ప్‌లైన్” (https: // www. mohfw.gov.in/) ద్వారా పొందవచ్చు. వినికిడి లోపం, మేథోపరమైన రుగ్మత, మస్తిష్క పక్షవాతం మరియు బహుళ వైకల్యాలు వంటి కమ్యూనికేషన్ లోపాలతో బాధపడుతున్న పిల్లల ఉపయోగార్థం పిల్లల సంరక్షణాధికారులకు కౌన్సెలింగ్ అందించడానికి అల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వంటి సంస్థలు కోవిడ్ మహమ్మారి సమయంలో వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాయి. కౌన్సెలింగ్ మరియు ఇతర సమస్యలపై వీడియోలను కూడా అధ్యాపకులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. వినికిడి సమస్య ఉన్నవారి ప్రయోజనం కోసం సోషల్ మీడియాలో ఉప శీర్షికలు కూడా అందించబడ్డాయి. కోవిడ్-19 సంక్రమిత అభివృద్ధి చేసిన మానసిక అనారోగ్యం మరియు నాడీ సంబంధిత సమస్యలు ఉన్నవారి కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డ్‌ను ఏర్పాటు చేసింది. ఈ వార్డును 13 జూలై 2020 న ఏర్పాటు చేశారు. ఈ వార్డు (26 ఫిబ్రవరి, 2021 వరకు) 72 మంది రోగులకు సేవలు అందించింది. కోవిడ్-19 తీవ్రత తీవ్రతరం అయినప్పుడల్లా రోగులను తగిన నియమించబడిన కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులకు రిఫర్ చేయడమైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈ విషయాన్ని.. ఈ రోజు ఇక్కడ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.
****
(Release ID: 1703720)
Visitor Counter : 119