ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాజస్థాన్‌లో వాక్సిన్ డోసుల కొరత లేదు
అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు వాక్సిన్ సరఫరాను కేంద్రం సునిశితంగా పర్యవేక్షిస్తోంది
प्रविष्टि तिथि:
09 MAR 2021 1:32PM by PIB Hyderabad
రాజస్థాన్‌లో కోవిడ్ 19 వాక్సిన్ డోసుల కొరతపడే అవకాశముందంటూ కొన్ని పత్రికలలో వార్తలు వచ్చాయి.
కాగా, వాస్తవ స్థితిలో ప్రస్తుతం రాష్ట్రం వద్ద కోవిడ్ 19 వాక్సిన్ల కొరత లేదు. రాజస్థాన్‌కు 37.61 లక్షల డోసులను పంపగా సోమవారం రాత్రి వరకు 24.28 లక్షల డోసులను మాత్రమే వినియోగించారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వాక్సిన్ సరఫరాల అందుబాటును క్రమంతప్పకుండా పర్యవేక్షిస్తోంది, అవసరాన్ని బట్టి, వినియోగ పద్ధతిని బట్టి వాటిని అందిస్తోంది.
***
(रिलीज़ आईडी: 1703538)
आगंतुक पटल : 228